సినీ 'క్రిస్మస్'.. ఏ ఏ సినిమాలు రాబోతున్నాయి?

2025లో చూస్తుండగానే.. మరో 12 రోజుల్లో 10 నెలలు కంప్లీట్ అయిపోతున్నాయి. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.;

Update: 2025-10-18 16:10 GMT

2025లో చూస్తుండగానే.. మరో 12 రోజుల్లో 10 నెలలు కంప్లీట్ అయిపోతున్నాయి. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తమ లుక్ ను టెస్ట్ చేసుకున్నాయి. కొన్ని అనుకోకుండా హిట్స్ గా నిలిచాయి. మరికొన్ని చిత్రాలు అంచనాలు అందుకుని సత్తా చాటాయి. ఇంకొన్ని హైప్ తో రిలీజ్ అయ్యి డిజాస్టర్స్ గా నిలిచాయి.

అయితే దీపావళి కానుకగా నాలుగు సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ కాగా.. ఇప్పుడు క్రిస్మస్ ఫెస్టివల్ కు థియేటర్లలో సందడి చేసేందుకు పలు చిత్రాలు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే మూడు సినిమాలు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకోగా.. మరొక మూవీ విడుదల విషయంలో క్లారిటీ లేదు. అవే డెకాయిట్, ఫంకీ, చాంపియన్, శంబాల.

నిజానికి.. అన్నింటి కన్నా ముందు డెకాయిట్ మూవీ రిలీజ్ డేట్ ను ఖరారు చేసుకుంది. క్రైమ్ అండ్ యాక్షన్ డ్రామాగా పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఆ సినిమా డిసెంబర్ 25వ తేదీన విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ హీరో అడివి శేష్ ఇటీవల గాయపడడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. దీంతో సినిమా వాయిదా పడుతుందని టాక్ వినిపిస్తోంది.

అదే సమయంలో డిసెంబర్ 24వ తేదీన యంగ్ హీరో విశ్వక్ సేన్ ఫంకీ మూవీ రిలీజ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వం వహిస్తున్న ఆ కామెడీ ఎంటర్టైనర్.. విడుదల తేదీని మరికొద్ది రోజుల్లో మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. స్పెషల్ అప్డేట్ తో అనౌన్స్ చేయనున్నారట.

యంగ్ హీరో రోషన్ మేకా లీడ్ రోల్ లో నటిస్తున్న చాంపియన్ మూవీ.. డిసెంబర్ 25వ తేదీన రిలీజ్ కానుంది. సినిమా స్టార్ట్ అయ్యి చాలా కాలం అయినా మొన్నటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో అనేక రూమర్స్ వచ్చాయి. రీసెంట్ గా మేకర్స్.. సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు. అద్భుతమైన ప్రయాణానికి సిద్ధమవ్వాలని కోరుతూ ప్రకటించారు.

రీసెంట్ గా మరో యంగ్ హీరో ఆది సాయి కుమార్ శంబాల మూవీతో డిసెంబర్ 25వ తేదీన రానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. మిస్టికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఆ మూవీ రిలీజ్ డేట్ ను ఇటీవల ప్రకటించారు. మొత్తానికి 2025 క్రిస్మస్ కు అంతా యంగ్ హీరోలే బాక్సాఫీస్ వద్ద గట్టిగా పోటీ పడనున్నారన్నమాట. మరి ఎవరు.. ఏ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News