• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  NRI >  లండన్‌ లో హైదరాబాదీ...

లండన్‌ లో హైదరాబాదీ దారుణ హత్య.. ఈనెల 5న కూతురు పెళ్లి!

| అవును... హైదరాబాద్‌ వాసి విదేశంలో దారుణ హత్యకు గురయ్యారు. ఉపాధి కోసం లండన్‌ వెళ్లిన మహమ్మద్‌ ఖాజా రయీస్ ఉద్దీన్‌ (65) ని ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేశాడు.

By - Tupaki Desk
Update: 2023-10-03 10:55 GMT

ఈ మధ్యకాలంలో విదేశాల్లో భారతీయులపై జరుగుతున్న దాడులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లో మగ్గింగ్ పేరున జరుగుతున్న దోపిడీలు, వీకెండ్స్ లో వినిపిస్తున్న తుపాకీల చప్పుళ్లు మరింత ఆందోళన కలిగిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా లండన్ లో హైదరాబాదీ వాసి హత్యకు గురయ్యారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

అవును... హైదరాబాద్‌ వాసి విదేశంలో దారుణ హత్యకు గురయ్యారు. ఉపాధి కోసం లండన్‌ వెళ్లిన మహమ్మద్‌ ఖాజా రయీస్ ఉద్దీన్‌ (65) ని ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేశాడు. డబ్బుల కోసమే ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ సమయంలో ఖాజా తోపాటు ఆఫ్ఘాన్ కు చెందిన మరో వ్యక్తి కూడా హత్యకు గురయ్యాడు!

వివరాళ్లోకి వెళ్తే... మహమ్మద్‌ ఖాజా రయిస్‌ ఉద్దీన్‌ 2011లో ఉపాధి కోసం హైదరాబాద్ నుంచి లండన్‌ వెళ్లాడు. ఈ క్రమంలో తన తన స్నేహితుడితో కలిసి వెళుతుండగా ఉంగాడా దేశానికి చెందినవారిగా చెబుతున్న ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వీరిపై దాడికి యత్నించారు. ఈ దాడిలో వారి చేతిలో ఖాజా కత్తిపోట్లకు గురై మరణించారు.

ఇదే సమయంలో ఖాజాతోపాటు ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన మరో వ్యక్తిని సైతం నిందితులు అదే కత్తితో పొడిచి చంపారు. డబ్బుల కోసం వీరితో గొడవపడిన దుండగులు, డబ్బులు ఇవ్వడానికి వీరు నిరాకరించేసరికి కత్తితో పొడిచి హత్య చేసి పరారైనట్లు అనుమానిస్తున్నారు.

కాగా, ఈ నెల 5న హైదరాబాద్‌ లో మహమ్మద్‌ ఖాజా కుమార్తె వివాహం ఉంది. దీంతో కూతురు పెళ్లి కోసం ఆయన హైదరాబాద్‌ కు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మరోపక్క పెళ్లి ఏర్పాట్లలో కుటుంబ సభ్యులు బిజీగా ఉన్నారు. ఇళ్లంతా పెళ్లి వాతావరణంతో సందడిగా మారింది. సరిగ్గా ఈ సమయంలోనే దారుణం జరిగిపోయింది.. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది. ఈ వార్త విని షాక్ కి గురయ్యారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయామంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Tags:    
  • Mohammed 
  • Khazaraeesuddin 
  • Hyderabadi 
  • Uk 
  • England 
  • Crime 
  • Murder 

Similar News

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

అమెరికా కాంగ్రెస్‌లోకి మరో భారత సంతతి మహిళ.. ఫ్లోరిడాలో పియా దండియా చారిత్రాత్మక విజయం!

2026-11-04 08:52 GMT

విశాఖ యువకుల వ్యథ.. యువకులకు యుద్ధమే ఆహ్వానం పలికింది... బయటపడేదెలా?

2026-11-02 13:49 GMT

డాలర్లతో సొంతింటి కల.. తల్లిదండ్రుల భద్రతే ఎన్నారైల తొలి ప్రాధాన్యం

2026-10-31 23:30 GMT

స్వదేశంతో తెగని బంధం.. ఎన్‌ఆర్‌ఐల కలల ఆస్తులకు ఇన్నాళ్లకు లభించిన విముక్తి

2026-10-30 10:30 GMT

అమెరికాలో భారత సంతతి మహిళ సంచలనం.. మేయర్ రేసులో నిత్యా రామన్!

2026-10-29 05:05 GMT

యూకేలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయులకు 28 ఏళ్ల జైలు శిక్ష!

2026-10-27 05:01 GMT

ఫుడ్ బ్యాంక్ వివాదం.. అమెరికాలో భారతీయ విద్యార్థులపై ద్వేషానికి మరో అస్త్రం

2026-10-25 08:30 GMT

F-1 వీసా రిజెక్ట్ అయితే 300 రోజులు ఆగాలా?

2026-10-25 04:52 GMT

అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి.. తండ్రితో ఫోన్ మాట్లాడిన కాసేపటికే విషాదం!

2026-10-23 14:17 GMT

Copyright @2026

Powered by Blink CMS