• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Crime >  వద్దని చెబుతున్నా వెంట...

వద్దని చెబుతున్నా వెంట పడుతున్నోడ్ని పుట్టింటికి పిలిచి ఏసేసింది

| అదే ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల సాయినాథ్ సింగ్ ఆమె వెంట పడేవాడు. అంతకంతకూ అతడి వేధింపులు ఎక్కువ అవుతున్నాయే తప్పించి.. అతడిలో మార్పు రావట్లేదు.

By - Garuda Media
Update: 2026-09-29 12:30 GMT

ప్లీజ్ వెంటపడొద్దు. ఫ్యామిలీ ఉంది. పిల్లలు ఉన్నారంటూ ఎంత చెప్పినా అతడి ఏ మాత్రం వినలేదు. అదే పనిగా వేధింపులకు పాల్పడుతూ ఇబ్బంది పెడుతున్నోడిని పుట్టింటికి పిలిచి.. చున్నీతో ఉరేసిన వివాహిత ఉదంతం హైదరాబాద్ లో వెలుగు చూసింది. స్థానికంగా సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. శివలాల్ నగర్ లో నలుగురు పిల్లలున్న మహిళ ఒకరు నివసిస్తున్నారు.

అదే ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల సాయినాథ్ సింగ్ ఆమె వెంట పడేవాడు. అంతకంతకూ అతడి వేధింపులు ఎక్కువ అవుతున్నాయే తప్పించి.. అతడిలో మార్పు రావట్లేదు. తనను వదిలేయాలని.. తనకు కుటుంబం ఉందని చెప్పినా వినకపోగా.. వేధింపుల పర్వాన్ని మరింత పెంచాడు. దీంతో.. ఆమె తనకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి భర్త.. కుటుంబ సభ్యులకు చెప్పింది.

వారంతా సదరు యువకుడ్ని వేధింపులకు పాల్పడొద్దని హెచ్చరించారు. అయినప్పటికి.. అతడు మాత్రం ఆమెను వేధించటం మానలేదు సరికదా.. మరింత మోతాదు పెంచాడు. దీంతో విసిగిపోయిన ఆమె షాకింగ్ నిర్ణయాన్ని తీసుకుంది. మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహీంనగర్ లోని తన పుట్టింటికి రావాలని సదరు యువకుడిని పిలిచింది బాధితురాలు.

దీంతో సాయినాథ్ సింగ్ వెంటనే ఆమె చెప్పిన ప్రాంతానికి వెళ్లాడు. అప్పటికే అక్కడ అతడ్ని చంపేందుకు ప్లాన్ చేసిన బాధిత యువతి.. తన చున్నీతో సాయినాథ్ సింగ్ మెడకు ఉరిలా వేసి చంపేసింది. ఈ ఉదంతంలో ఆమెకు మరికొందరు సహకరించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో భర్త ర్యాపిడో కెప్టెన్ గా పని మీద బయటకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. సదరు యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.

Tags:    
  • hyderabadcrime 
  • hyderabadnews 
  • crimenews 

Similar News

త‌నిష్క్ కేసు: 31 కోట్ల బంగారం చోరీ కేసులో యూట్యూబ‌ర్ అరెస్ట్!

2026-11-15 07:33 GMT

రీల్స్ పిచ్చి పరాకాష్ట.. యువకుడిని సజీవ దహనం చేసేందుకు యత్నం!

2026-11-07 02:29 GMT

ఉదయం పోలీసులకు ఫిర్యాదు.. సాయంత్రానికి రక్తపాతం.. హైదరాబాద్ దారుణ హత్యల క్రైం కథ

2026-11-07 02:27 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

అమెరికాకే మోస్ట్ వాంటెడ్ గా మారిన ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్ కథ

2026-11-03 06:56 GMT

హాలోవీన్ వేడుకల్లో కాల్పుల కలకలం.. డల్లాస్‌లో నలుగురు మృతి, 15 మందికి గాయాలు!

2026-11-02 03:57 GMT

రాప్తాడు బాలికపై దాడి కేసులో కీలక పరిణామం.. అడవుల్లో నిందితుడిపై పోలీసుల కాల్పులు

2026-11-01 16:39 GMT

మానవ చరిత్రలోనే అతిపెద్ద దోపిడీల్లో ఒకటి.. ఒక్క రాత్రిలో రూ.57,000 కోట్ల షాక్!

2026-10-30 06:18 GMT

ఫ్రెండ్ గర్ల్‌ఫ్రెండ్‌ పై రేప్ ఆరోపణలు.. ఇద్దరు టెకీల అరెస్ట్!

2026-10-29 17:03 GMT

సైబర్ మోసాల్లో బ్యాంకుల నిర్లక్ష్యం ఉంటే.. బాధితులకు పరిహారం!

2026-10-29 17:03 GMT

దసరా వేళ దారుణం.. సిద్దిపేటలో బాలికపై ఏడుగురి అఘాయిత్యం!

2026-10-24 13:28 GMT

Copyright @2026

Powered by Blink CMS