• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Crime >  సీరియల్ నటి హనీ...

సీరియల్ నటి హనీ ట్రాప్... పెద్దాయన వయసు 75!

| ఇందు లో హానీ ట్రాప్ కి పాల్పడింది ఒక సీరియల్ నటి అయితే... బలైంది ఆర్మీ రిటైర్ ఉద్యోగి!

By - Tupaki Desk
Update: 2023-07-29 12:31 GMT

ఈ మద్యకాలం లో హనీ ట్రాప్స్ పెరిగిపోతోన్న సంగతి తెలిసిందే. అందమైన మహిళలు.. కాస్త బలహీన మనస్తత్వం ఉన్న పురుషుల కు వలపుల వల వేయడం.. అనంతరం చనువుగా మెలగడం.. ఆ సన్నివేశాలు చిత్రీకరించడం.. ఆనాక బ్లాక్ మెయిల్ చేయడం.. అందిన కాడిన దోచుకోవడం పరిపాటిగా మారిపోయింది!

ఈ క్రమంలో తాజాగా మరో సంఘటన వెలుగు లోకి వచ్చింది. ఇందు లో హానీ ట్రాప్ కి పాల్పడింది ఒక సీరియల్ నటి అయితే... బలైంది ఆర్మీ రిటైర్ ఉద్యోగి! ఇదేవిధంగా... ఆ సీరియల్ నటి వయసు 32 కాగా.. ఆర్మీ రిటైర్ ఉద్యోగి వయసు 75! ఈ డిఫరెంట్ హనీ ట్రాప్ కథా కమీషేమిటో ఇప్పుడు చూద్దాం..!

మలయాళ టీవీ సీరియల్స్‌ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కేరళ చెందిన నటి... ఈజీ మనీ కోసం తన స్నేహితుడితో కలిసి అడ్డదారులు తొక్కింది. ఇందులో భాగంగా వయసుతో సంబంధం లేకుండా వలపుల వల విసరడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఒక రిటైర్ ఆర్మీ ఉద్యోగి పడ్డారు అని తెలుస్తోంది.

అవును... ఈజీమనీ కోసం అడ్డదారులు తొక్కాల ని ఫిక్సయిన సీరియల్ నటి... తిరువనంతపురానికి చెందిన ఆర్మీ రిటైర్ ఉద్యోగి (75) కి తన స్నేహితుడితో కలిసి వలేసింది. ఇల్లు అద్దెకు కావాలనే వంకతో ఆ సీనియర్ సిటిజన్‌ తో పరిచయం పెంచుకుని ట్రాప్‌ చేసి డబ్బులు గుంజే ప్లాన్‌ చేసింది!

అద్దెకు ఉండేందుకు ఇంటి ని వెతుకుతుండగా ఏర్పడిన పరిచయంతో నిరంతర ఫోన్ కాల్స్ ద్వారా వృద్ధుడితో స్నేహం పెంచుకుంది. అలా వారిద్దరి మధ్య మంచి పరిచయం పెరిగింది. దీంతో ఒకరోజు తన అద్దె ఇంటికి రావాల ని ఆ వృద్ధుడిని నటి పిలిచింది. దీంతో ఆమె ఆహ్వానాన్ని మన్నించి వృద్ధుడు ఆమె ఇంటికి వెళ్లాడు.

అనంతరం జరిగిన విషయాలు పూసగుచ్చినట్లుగా ఆ సీనియర్ సిటిజన్ పోలీసుల కు చెప్పాడని తెలుస్తోంది. ఈ సమయంలో... తాను ఆమె ఇంటికి వెళ్లగానే మాటల తో ముంచెత్తించిందంట. అనంతరం ఇతడి దుస్తులు తొలగించడంతోపాటు.. ఆమె కూడా దుస్తులు తొలగించుకుందట. ఇంతలో ఆమె స్నేహితుడు వచ్చి ఇద్దరి ఫోటోలూ తీశాడంట.

అనంతరం... అడిగినంత డబ్బు ఇవ్వాల ని, లేదంటే ఫోటోల ను సోషల్‌ మీడియా లో పెడతామని వారిద్దరు ఈ సీనియర్ సిటిజన్ పై బెదిరింపుల కు దిగారట. దీంతో ఇప్పటికే వారికి రూ.11 లక్షలు ఇచీనట్లు తెలిపిన సీనియర్ సిటిజన్... మరో రూ. 25 లక్షలు డిమాండ్‌ చేశారని.. అంత డబ్బు లేదని, ఇక ఇవ్వలేనని వారితో చెప్పినట్లు పోలీసుల కు తెలిపాడు.

దీంతో పోలీసుల సూచన మేరకు ఆ వృద్ధుడు రూ.25 లక్షలు డబ్బు ఇస్తానని వారిద్దరికి ఆఫర్‌ చేశాడు. కానీ డబ్బు కోసం తన ఇంటికి ఆహ్వానించాడు. పక్కా ప్లాన్‌ తో పోలీసులు అక్కడే ఉండి ఆ సీరియల్ నటిని, ఆమె స్నేహితుడి ని అరెస్ట్‌ చేశారు. ఆపై వారిద్దిరని కోర్టులో హాజరుపరిచారు.

Tags:    
  • Kerala 
  • Serialactress 
  • Honeytrap 
  • Retiredarmyofficer 
  • Actress 
  • Socialmedia 

Similar News

హాలోవీన్ వేడుకల్లో కాల్పుల కలకలం.. డల్లాస్‌లో నలుగురు మృతి, 15 మందికి గాయాలు!

2026-11-02 03:57 GMT

రాప్తాడు బాలికపై దాడి కేసులో కీలక పరిణామం.. అడవుల్లో నిందితుడిపై పోలీసుల కాల్పులు

2026-11-01 16:39 GMT

మానవ చరిత్రలోనే అతిపెద్ద దోపిడీల్లో ఒకటి.. ఒక్క రాత్రిలో రూ.57,000 కోట్ల షాక్!

2026-10-30 06:18 GMT

ఫ్రెండ్ గర్ల్‌ఫ్రెండ్‌ పై రేప్ ఆరోపణలు.. ఇద్దరు టెకీల అరెస్ట్!

2026-10-29 17:03 GMT

సైబర్ మోసాల్లో బ్యాంకుల నిర్లక్ష్యం ఉంటే.. బాధితులకు పరిహారం!

2026-10-29 17:03 GMT

దసరా వేళ దారుణం.. సిద్దిపేటలో బాలికపై ఏడుగురి అఘాయిత్యం!

2026-10-24 13:28 GMT

భార్య కనిపించడం లేదని ఫిర్యాదు.. ఇమ్మిగ్రేషన్ అధికారుల పేరుతో భర్త కట్టుకథ!

2026-10-23 13:56 GMT

హనీట్రాప్ లో ఏసీపీ.. ఇన్ స్పెక్టర్ ఎలా పడ్డారబ్బా?

2026-10-22 08:02 GMT

Apple Mass Warning.. ఐఫోన్లు కొట్టేశారా.. మామూలుగా ఉండదు!

2026-10-22 05:25 GMT

డబ్బుల కోసం దాచేసి .. దొరికిపోతానని !

2026-10-13 07:52 GMT

ఇది మరో 'పిశాచి' కథ.. తండ్రిపై ప్రేమతో నాలుగేళ్లుగా ఫ్రీజర్‌‌లోనే మృతదేహం.. ముంబైలో గగుర్పొడిచే కథ

2026-10-01 06:23 GMT

ఫోన్ కోసం కన్నబిడ్డను అమ్మేశారు.. ఇంతకంటే ఘోరం ఉంటుందా?

2026-09-30 04:48 GMT

Copyright @2026

Powered by Blink CMS