• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Box Office >  బాలయ్య vs రవితేజ.....

బాలయ్య vs రవితేజ.. బాక్సాఫీస్ లెక్క తప్పింది

| నందమూరి బాలకృష్ణ - మాస్​ మహారాజా రవితేజ మధ్య చాలా ఏళ్లుగా బాక్సాఫీస్ వార్​ నడుస్తున్న సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2023-10-22 07:56 GMT

నందమూరి బాలకృష్ణ - మాస్​ మహారాజా రవితేజ మధ్య చాలా ఏళ్లుగా బాక్సాఫీస్ వార్​ నడుస్తున్న సంగతి తెలిసిందే. రవితేజ కన్నా బాల్యయ టాప్ స్టార్​ అయినప్పటికీ.. వీరిద్దరి మధ్య బాక్సాఫీస్ పోరు వచ్చిన ప్రతిసారీ మాస్ రాజాదే పైచేయి ఉండేది. కానీ ఈ సారి కథ మారింది. బాక్సాఫీస్ వద్ద టైగర్​ నాగేశ్వరరావుపై భగవంత కేసరి గెలిచిండు.

వివరాళ్లోకి వెళితే.. రవితేజ కన్నా బాలయ్య బిగ్ స్టార్ అన్న సంగతి తెలిసిందే. మాస్​ మహారాజా హీరో కాకముందే.. బాలయ్య ఎన్నో భారీ హిట్లు ఇండస్ట్రీకి ఇచ్చారు. అయితే మొదట క్యారెక్టర్ ఆర్టిస్​గా రాణించిన రవితేజ ఆ తర్వాత హీరోగా మారి స్టార్ ఇమేజ్​ను సొంతం చేసుకున్నారు. భారీ అభిమానగణాన్ని కూడా సంపాదించుకున్నారు.

అలాగే రవితేజ.. తనకన్నా బిగ్​ స్టార్ అయిన బాలయ్యపై బాక్సాఫీస్ దగ్గర డామినేషన్ కూడా చూపించారు. 2008 సంక్రాంతికి బాలయ్య ఒక్కమగాడుతో రాగా రవితేజ కృష్ణగా వచ్చారు. ఇందులో బాలయ్య చిత్రం డిజాస్టర్​గా నిలవగా.. రవితేజ సూపర్ హిట్​గా నిలిచారు. 2011లో పరమవీరచక్ర - మిరపకాయ్ పోటీ పడగా.. రవితేజ చిత్రం విజయం సాధించింది.

మిత్రుడు, కిక్ కాస్త గ్యాప్‌లో విడుదల కాగా.. బాలయ్య చిత్రమే డిజాస్టర్ అయింది. దీంతో ఈసారి దసరాకు బాలయ్య, రవితేజల పోటీలో ఎవరు పైచేయి సాధిస్తారా అని ఉత్కంఠ నెలకొంది. సెంటిమెంట్ వర్కౌట్ అయితే మరోసారి రవితేజ విజేతగా నిలుస్తారని అంతా అనుకున్నారు. కానీ అంచనాలు తారుమరయ్యాయి. కథ మారింది. బాలయ్య సినిమా భగవంత్ కేసరి బ్లాక్ బాస్టర్​ టాక్​ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మంచి వసూళ్లను కూడా అందుకుంటోంది. కానీ రవితేజ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’కు మాత్రం కాస్త డివైడ్ టాక్ వచ్చింది. అయినా వసూళ్లను పర్వాలేదనిపించేలా ఉన్నాయి.

ఇక ఈ రెండు సినిమాలకు పోటీగా దళపతి విజయ్​ లియో కూడా రిలీజై కాస్త డివైడ్​​ టాక్​ను తెచ్చుకుంది. కానీ వసూళ్లు మాత్రం భారీగా వస్తున్నాయి. దీంతో ఈ దసరాకు బాలయ్య బాక్సాఫీస్ విన్నర్​గా నిలిచారు.

Tags:    
  • Balakrishna 
  • Raviteja 
  • Bhagavanthkesari 
  • Tigernageshwararao 
  • Tollywood 
  • Movienews 

Similar News

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

పండగ రేసులో భారీ చిత్రాల సునామీ

2026-11-01 15:30 GMT

అల్ట్రా వయొలెన్ప్.. ఇంట్రెస్ట్ లేదు బాస్

2026-10-31 14:53 GMT

1000 కోట్ల డిబేట్‌పై సుబ్బరాజ్ చమత్కారం!

2026-10-30 13:01 GMT

2026 న‌వంబర్ సంథింగ్ స్పెష‌ల్ ఎందుకంటే?

2026-10-30 09:36 GMT

తెలంగాణ యాస ఉంటే చాలదు.. బాక్సాఫీస్ లెక్కలు వేరే గురూ!

2026-10-29 06:42 GMT

ప్రతి వారం ఇన్ని సినిమాలా? సంక్రాంతి వరకు థియేటర్లలో రచ్చే!

2026-10-28 09:39 GMT

Copyright @2026

Powered by Blink CMS