• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Box Office >  బేబీ బలగం వారే..

బేబీ బలగం వారే..

| ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలుగా వచ్చినవి పెద్ద హిట్ అవుతున్నాయి.

By - Tupaki Desk
Update: 2023-07-18 13:32 GMT

ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలుగా వచ్చినవి పెద్ద హిట్ అవుతున్నాయి. ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా ఆడియన్స్ చిన్న సినిమాలు చూసేటపుడు థియేటర్స్ కి వస్తారు. వారికి ఏ మాత్రం కంటెంట్ సర్ప్రైజ్ చేసిన ఇక మూవీకి పాజిటివ్ టాక్ వచ్చేస్తుంది. అలాగే వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఏకంగా 25 కోట్లు కొల్లగొట్టింది. ఆ సినిమాకు ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

రీసెంట్ గా శ్రీవిష్ణు సామజవరగమన చిత్రం కూడా అలాగే అంచనాలు లేకుండానే థియేటర్స్ లోకి వచ్చింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ తో బొమ్మ పడినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఆడియన్స్ ను నవ్వించడంతో మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. మౌత్ టాక్ తో జనాల్లోకి వెళ్ళిపోయింది. దీంతో కలెక్షన్స్ రెండో రోజు నుంచి అనూహ్యంగా పెరిగిపోయాయి.

శ్రీవిష్ణు కెరియర్ లోనే హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన చిత్రంగా సామజవరగమన నిలిచింది. ఈ సినిమాకు కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ గట్టిగా సపోర్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ వరుసలోకే బేబీ మూవీ కూడా వస్తోంది. సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎస్కేఎన్ నిర్మించారు. ముక్కోణపు ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చింది. అయితే మొదటి రోజు నెగిటివ్ రివ్యూలు వచ్చిన యూత్ కి మాత్రం విపరీతంగా కనెక్ట్ అయ్యింది.

దీంతో సినిమా మొదటి మూడు రోజుల్లోనే బ్రేక్ ఎవెన్ అందుకుంది. అలాగే ఓవర్సీస్ లో కూడా మూవీకి మంచి ఆదరణ లభిస్తోంది. తెలుగు రాష్ట్రాలలో అయితే ఎక్కువగా కాలేజీ స్టూడెంట్స్ బేబీ సినిమా చూడటానికి థియేటర్స్ దగ్గర క్యూ కడుతున్నారు. ఈ రోజుల్లో యువతలో చాలా శాతం మంది అబ్బాయిలు ఇలాంటి చేదు అనుభవాలను ఫేస్ చేస్తున్నవారే. ప్రేమలో మోసం పోయిన వారు ఫీల్ అవుతుంటే.. సింగిల్ లా ఉండేవారు మరోలా ఎంజాయ్ చేస్తున్నారు. ఏదేమైనా యువతకు కావాల్సిన పాయింట్ తో సాయి రాజేష్ గట్టిగానే ఎట్రాక్ట్ చేశాడు.

వీకెండ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా అద్భుతంగా చిత్రాన్ని ఆదరిస్తూ ఉండటం విశేషం. నెగిటివ్ రివ్యూలు రావడంతో వీకెండ్ తర్వాత కలెక్షన్స్ తగ్గుతాయని చిత్ర యూనిట్ భావించింది. అయితే సోమవారం కూడా స్ట్రాంగ్ కలెక్షన్స్ బేబీ సినిమాకి రావడం వలన మూవీ ఏ స్థాయిలో మౌత్ టాక్ తో యూత్ కి కనెక్ట్ అయ్యిందనేది అర్ధమవుతోంది.

Tags:    
  • BABYMovie 
  • BalagamMovie 
  • BoxOffice 
  • Tollywood 
  • MovieNews 

Similar News

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

పండగ రేసులో భారీ చిత్రాల సునామీ

2026-11-01 15:30 GMT

అల్ట్రా వయొలెన్ప్.. ఇంట్రెస్ట్ లేదు బాస్

2026-10-31 14:53 GMT

1000 కోట్ల డిబేట్‌పై సుబ్బరాజ్ చమత్కారం!

2026-10-30 13:01 GMT

2026 న‌వంబర్ సంథింగ్ స్పెష‌ల్ ఎందుకంటే?

2026-10-30 09:36 GMT

తెలంగాణ యాస ఉంటే చాలదు.. బాక్సాఫీస్ లెక్కలు వేరే గురూ!

2026-10-29 06:42 GMT

ప్రతి వారం ఇన్ని సినిమాలా? సంక్రాంతి వరకు థియేటర్లలో రచ్చే!

2026-10-28 09:39 GMT

Copyright @2026

Powered by Blink CMS