పవర్ లోకి వస్తే సుప్రీం జడ్జి లనే మారుస్తాడంట

Update: 2015-08-10 04:47 GMT
అమెరికా అధ్యక్ష పదవిని సొంతం చేసుకోవాలని తహతహలాడుతున్న లూసియాన గవర్నర్ బాబి జిందాల్ తాజాగా చేసిన వ్యాఖ్య పలువురు దృష్టిని ఆకర్షిస్తోంది. అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్షపదవికి పోటీ పడుతున్న ఆయన.. సుప్రీం తీరును విమర్శించటమే కాదు.. తాను కానీ పవర్ లోకి వస్తే.. సుప్రీంకోర్టు జడ్జిలను తొలగిస్తానని అంటున్నారు.

రాజ్యాంగంతో సందర్భంగా పబ్లిక్ సర్వేల మీద ఆధారపడి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తీర్పులు ఇస్తున్నారని.. ఒబామా హెల్త్ కేర్.. స్వలింగ సంపర్క విధానాలపై తీర్పులే ఇందుకు నిదర్శమనిన ఆయన వాదిస్తున్నారు. ఇలాంటి పనులు చేసే కన్నా కోర్టుల్ని మూసివేస్తే ఖర్చులు తగ్గుతాయంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.

ఆవేశంతో బాబీ జిందాల్ చేసిన వ్యాఖ్యను డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటర్ తీవ్రంగా స్పందిస్తున్నారు. కోర్టుల్ని మూసివేయాలన్న మాటపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కోర్టులు మూసివేయాలన్న మాట తీవ్రంగా ఉందని చెబుతున్నారు.

దీనికి స్పందించిన బాబీ జిందాల్.. తన మాటను కాస్త మార్చి.. తనకు కానీ అవకాశం ఉంటే సుప్రీంకోర్టు లోని ఆరుగురు జడ్జిలను తొలగిస్తానని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు జడ్జి లపై రాజకీయ నాయకులు ఇంత స్వేచ్ఛగా వ్యాఖ్యలు చేయటం అమెరికాలోని ప్రజాస్వామ్యానికి నిదర్శనమా? లేక.. అక్కడ ఏ విషయానైన్నా రాజకీయ నాయకులు తమదైన శైలిలో వ్యాఖ్యలు చేసేస్తారా? ఏమైనా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల విషయంలో జిందాల్ విమర్శ అంత సరికాదన్న వాదన వినిపిస్తోంది.
Tags:    

Similar News