అమెరికాలోని ఆకాశహర్మ్యం మీద కాళికాదేవి

Update: 2015-08-11 05:59 GMT
అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని ప్రసిద్ద ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ మీద కాళికాదేవి అమ్మవారు దర్శనమిచ్చారు. ఇందులో మాయ.. మంత్రం ఏమీ లేదు.. కేవలం సాంకేతికత మాత్రమే. ఈ 102 అంతస్తుల బిల్డింగ్ మీద.. కాలుష్యం.. పర్యావరణం నాశనం చేయటం లాంటి అంశాలపై పోరాడేందుకు ఒక భీకరమైన.. అత్యంత శక్తివంతమైన రూపం కోసం వెతికిన వారు.. చివరకు భద్రకాళి బొమ్మను ఫైనల్ చేశారు.

ప్రత్యేక ప్రొజెక్టర్ సాయంతో ఈ భారీ ఆకాశహర్మ్యంపై భద్రకాళి అమ్మవారి బొమ్మను ప్రొజెక్ట్ చేయటంతో.. ఆకాశంలో అమ్మవారు ప్రత్యక్షమైన అనుభూతి కలిగింది. భద్రకాళి అమ్మవారి బొమ్మ.. అమెరికా వాసుల్ని విపరీతంగా ఆకట్టుకుంది.

శక్తి స్వరూపిణికి కేరాఫ్ అడ్రస్ గా వారి మదిని దోచుకుంది. పలువురు న్యూయార్క్ వాసులు.. బిల్డింగ్ మీద ప్రొజెక్ట్ చేసిన కాళికమ్మవారి బొమ్మను ట్విట్టర్.. ఫేస్ బుక్.. ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకోవటం గమనార్హం. ఇక.. పర్యాటకులకైతే ఈ శక్తి స్వరూపిణి ప్రత్యేక ఆకర్షణగా మారినట్లు చెబుతున్నారు.

కాలుష్యంపై పోరాడేందుకు ఒక శక్తివంతమైన రూపం అవసరం కావటంతో.. కాళికమ్మ వారి రూపాన్ని చివరకు ఎంపిక చేసినట్లుగా చెబుతున్నారు. మొత్తానికి భద్రకాళి రూపం న్యూయార్క్ వాసుల్ని అమితంగా ఆకర్షించటం గమనార్హం. ఇటీవల ఫోకస్ చేసిన ఈ చిత్రం న్యూయార్క్ వాసుల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది.
Tags:    

Similar News