తెగిన చేతిని కాలికి వేసి కుట్టేశారు!

Update: 2015-07-18 13:43 GMT
ఒక ప్రమాదంలో చేయి నుజ్జు నుజ్జు అయ్యి, పూర్తిగా పాడయిపోతే ఏమి చేస్తారు? ఆ చేతిని తొలగించి, అతడి ప్రాణాలు కాపాడతారు... ఫలితంగా ఆ వ్యక్తి అవిటివాడిగా బ్రతుకీడుస్తాడు! కాస్త అటు ఇటుగా ఇలాంటి సంఘటన చైనాలో జరిగింది కానీ ఫలితం వేరుగా వచ్చింది! చైనా లోని ఒక కార్మికుడు విధినిర్వహణలో ఉండగా తన ఎడమ చెయ్యి మిషన్ లో పడి పూర్తిగా కట్ అయ్యి.. తెగిపడిపోయింది! అతికించడానికి ఏమాత్రం అవకాశం లేకుండా నుజ్జు గా అయిపోయింది. ఈ సమయంలో ఈ కార్మికుడికి శస్త్ర చికిత్స చేయడానికి పూనుకున్న వైద్యులు అరుదైన ఆలోచన చేసి అతడికి తిరిగి చెయ్యి అతికించారు!

వివరాళ్లోకి వెళితే... చైనాలోని జో అనే కార్మికుడి చెయ్యి స్పిన్నింగ్ బ్లేడ్ మిషన్ లో పడి పూర్తిగా నలిగి పోయింది. ఈ సమయంలో అతికించడానికి శరీరం సరిగా లేకపోవడంతో... చర్మం ఫాం అవ్వడానికి తెగిపడిన ఆ చేతిని కుడికాలికి జతచేశారు! దీంతో పిప్పి పిప్పిగా అయిపోయిన ఆ చెయ్యికి సజీవంగా నిలిచింది. నరాలు పూర్తిగా పనిచేయడం మొదలు పెట్టాయి! ఇదంతా జరగడానికి ఒక నెల పట్టింది! ఈ నెలరోజుల తర్వాత సుమారు 10 గంటలపాటు భారీ ఆపరేషన్ చేసిన డాక్టర్లు... విజయవంతంగా ఆ కార్మికుడికి చేతిని అతికించారు. ప్రస్తుతం ఈ విషయం వైద్య రంగంలోని అద్భుతాల్లో ఒకటిగా పరిగణిస్తున్నారు. ఆపరేషన్ అనంతరం జో ఇప్పుడిప్పుడే తన చేతివేళ్లను మెళ్ల మెళ్లగా కదిలించగలుగుతున్నాడు. అందుకే అంటారు... సృష్టికి ప్రతిసృష్టి చేసే వైద్యులను దేవుడితో సమానం అని!
Tags:    

Similar News