• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Automobiles >  భారత్ లో టెస్లా...

భారత్ లో టెస్లా డిజాస్టర్? బుకింగ్స్ చెబుతోంది ఇదేనా?

| ఎన్నో అంచనాలు.. మరెన్నో లెక్కలతో భారత మార్కెట్ లోకి వచ్చిన టెస్లాకు షాక్ తగిలిందా? ఏదో అనుకుంటే మరేదో అయ్యిందా?

By - Garuda Media
Update: 2025-09-03 04:17 GMT

ఎన్నో అంచనాలు.. మరెన్నో లెక్కలతో భారత మార్కెట్ లోకి వచ్చిన టెస్లాకు షాక్ తగిలిందా? ఏదో అనుకుంటే మరేదో అయ్యిందా? జులై మధ్యలో అమ్మకాలు మొదలు పెట్టిన టెస్లా.. భారతీయుల్ని పెద్దగా ఆకట్టుకోలేదా? అర్భాటంగా అమ్మకాలు షురూ చేసినప్పటికీ.. ఇప్పటివరకు టెస్లా కార్లు బుక్ అయ్యింది కేవలం ఆరువందలే కావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. క్రేజీ వస్తువులు మార్కెట్లోకి వస్తున్నాయంటే చాలు.. ఎగబడిపోయి కొనుగోలు చేసే భారతీయులు టెస్లా విషయంలో పెద్దగా రియాక్టు కాకపోవటం ఆసక్తికరంగా మారింది.

జులై మధ్యలో మొదలైన బుకింగ్స్ ఇప్పటివరకు కేవలం 600 మాత్రమే అయినట్లుగా చెబుతున్నారు. ఈ ఏడాది 350 నుంచి 500 వరకు మాత్రమే కార్లను డెలివరీ చేయాలని టెస్లా భావిస్తున్నట్లు చెబుతున్నారు. మొదటి బ్యాచ్ ఈ నెలలో షాంఘై నుంచి వస్తుందని చెబుతున్నారు. తొలుత తమ కార్లను పరిమిత నగరాల్లో మాత్రమే డెలివరీ చేయాలని టెస్లా భావిస్తోంది.

ఆ సంస్థ తమ కార్లను ముంబయి.. ఢిల్లీ.. ఫూణే.. గురు గ్రామ్ నగరాల్లో మాత్రమే తొలుత డెలివరీ ఇవ్వనున్నారు. ఆ తర్వాతి కాలంలో దేశ వ్యాప్తంగా ఇతర నగరాలకు విస్తరించాలన్న యోచనలో ఉననట్లు చెబుతున్నారు. ఇప్పటికే టెస్లా దేశంలో రెండు డీలర్ షిప్ లను ప్రారంభించింది. ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేయటంపై ఫోకస్ చేస్తోంది. ఎన్నో అంచనాలతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన టెస్లా నెలన్నరలో కేవలం 600 కార్లు మాత్రమే బుక్ అయ్యాయి.

సాధారణంగా పరిమితంగా డబ్బులు కట్టి.. కార్లను అడ్వాన్స్ గా బుక్ చేసుకోవటం మొదట్నించి ఉన్నదే. ఇటీవల కాలంలో హైఎండ్ కార్లను సైతం బుకింగ్ స్టార్ట్ చేశారో లేదో.. వేలాది కార్లకు అడ్వాన్స్ బుకింగ్ లు కట్టే ధోరణి చూస్తున్నాం. అందుకు భిన్నంగా కేవలం 600 కార్లు మాత్రమే బుక్ కావటం.. డెలివరీ సమయానికి ఇందులో ఎన్ని పక్కాగా డెలివరీ అవుతాయి? మరెన్ని క్యాన్సిల్ అవుతాయన్నది ఇప్పుడో ప్రశ్నగా చెప్పాలి.

ఇంతకూ టెస్లాకు భారత్ లో స్పందన అంతంతమాత్రంగా ఎందుకు ఉంది? అన్నప్రశ్నలోకి వెళితే.. భారత్ మార్కెట్ లోకి ఎంట్రీ వేళ.. కేవలం ఒక్క కారును మాత్రమే అందుబాటులో ఉంచటం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ఎంట్రీ లెవల్ మోడల్ అయిన వై రియర్ వీల్ డ్రైవ్ వేరియంట్ ను మాత్రమే అందుబాటులో ఉంచారు. దీని ఎక్స్ షోరూం ధర రూ.59.89 లక్షలు. రెండో వేరియంట్ లాంగ్ రేంజ్ ఆర్ డబ్ల్యూడీ. దీని ధర రూ.67.89 లక్షలు. ఈ రెండు వేరియంట్ ను ఈ నెల మూడో వారం నుంచి డెలివరీ చేయనున్నారు.

వై సిరీస్ లో మొదటి వేరియంట్ ను ఒకసారి ఛార్జ్ చేస్తే 500కి.మీ. రేంజ్ అందిస్తుంది. రెండో వేరియంట్ మీద ఒకసారి ఛార్జ్ చేస్తే 622కి.మీ. రేంజ్ ను అందిస్తుంది. ఈ రెండు మోడళ్ల టాప్ స్పీడ్ గంటకు 201కి.మీ. రెండు వెర్షన్లు దాదాపు 295 హార్స్ పవర్ ను ఉత్పత్తి చేస్తాయని చెబుతున్నారు. ఒకే మోడల్ ను మార్కెట్లోకి తీసుకురావటం.. ఎలక్ట్రిక్ కారు కావటం.. ఇటీవల కాలంలో అమెరికా ఉత్పత్తుల విషయంలో భారతీయుల్లో వస్తున్న మార్పు టెస్లా బుకింగ్ లలో కనిపిస్తుందని చెబుతున్నారు. అయితే.. ఈ వాదనపై త్వరపడి వ్యాఖ్య చేసే కన్నా.. కాస్తంత వెయిట్ చేస్తేనే మంచిదని చెప్పకతప్పదు.

Tags:    
  • Tesla 
  • TeslaIndia 
  • TeslaModelY 
  • ElectricCars 
  • EVIndia 
  • TeslaBookings 

Similar News

Hyundai Bayon 2026 Review: కొత్త SUVలో ఆకట్టుకునే ఫీచర్లు.. కొనేముందు తెలుసుకోవాల్సిన విషయాలు!

2026-10-27 05:28 GMT

స్టార్ హీరో గ్యారేజీలోకి మరో రాయల్ రైడ్!

2026-10-13 09:53 GMT

ముదురు రంగుల‌తో పోలిస్తే 'వైట్ కార్' ప్ర‌యోజ‌నం అదే!

2026-10-03 05:51 GMT

కారు కొని అల్లాడుతున్నారా? వినియోగదారుల కమిషన్ తీర్పు.. ఆటోమొబైల్ కంపెనీలకు గట్టి గుణపాఠం!

2026-09-29 00:30 GMT

మోడీ సర్కార్ చేసిన చిన్న మార్పు..దేశంలో 'కార్ల'ను ఎగబడి కొనేలా చేస్తోంది..

2026-09-24 02:30 GMT

పెట్రోల్‌ కార్ల కు నై.. ఈవీలకు జై.. భారత్ లో మారుతున్న ట్రెండ్

2026-08-07 17:08 GMT

మెగాస్టార్ దసరా సెంటిమెంట్ మళ్లీ వర్కవుట్ అవుతుందా?

2026-08-03 18:22 GMT

ఎలాన్ మస్క్ 'టెస్లా'.. అమ్మకాలు ఢమాల్.. మూసుకోవాల్సిందే

2026-07-18 09:34 GMT

కొత్త కారు ప్లానింగు ఉందా? ఈ నెలలోనే కొనేయండి.. లేదంటే?

2026-06-09 16:30 GMT

ల్యాండ్ రోవర్ ధరలు అంత భారీగా తగ్గనున్నయా?

2026-04-02 04:10 GMT

మెకానిక్ మ్యాజిక్.. మారుతీ టూ లంబోర్గిని!

2026-03-04 05:10 GMT

ప్రయాణ భద్రతను కట్టుదిట్టం చేస్తున్న చైనా.. కారణం ఇదే..

2026-02-15 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS