7 సీటర్ కార్ కోసం ఎదురుచూసే వారికి శుభవార్త.. GST తగ్గింపుతో ఈ మోడల్ పై భారీ ఊరట!
రెనాల్ట్ ట్రైబర్ కారు 7 సీటర్ అయినప్పటికీ కూడా తాజాగా తీసుకువచ్చిన కొత్త జిఎస్టి నిబంధన ప్రకారం ఈ కారు చిన్న కారు కేటగిరీలోకి వచ్చేస్తుంది.;
మనలో చాలామంది కుటుంబంతో కలిసి ప్రయాణించడానికి కారు కొనాలనుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కారు కొనాలి అంటే కచ్చితంగా రూ.10 నుంచి 15 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అయితే అంత బడ్జెట్ లేదని బాధపడుతున్నారా? అయితే ఇలాంటి వారి కోసమే ప్రభుత్వం ఒక బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్ లలో తీసుకువచ్చిన మార్పుల వల్ల.. ప్రముఖ బ్రాండ్ కు సంబంధించి 7 సీటర్ కారు ధర గణనీయంగా తగ్గబోతోంది.ఆ కారు ఏదో కాదు రెనాల్ట్ ట్రైబర్. అతి తక్కువ ధరకే ఈ 7 సీటర్ కారు ను మనం దక్కించుకోవచ్చు.
రెనాల్ట్ ట్రైబర్ కారు 7 సీటర్ అయినప్పటికీ కూడా తాజాగా తీసుకువచ్చిన కొత్త జిఎస్టి నిబంధన ప్రకారం ఈ కారు చిన్న కారు కేటగిరీలోకి వచ్చేస్తుంది. అందుకు రెండు ప్రధాన కారణాలు కలవు.. అందులో ఒకటి.. ఈ కారు పొడవు కేవలం నాలుగు మీటర్ల లోపే కలదు. మరొక కారణం ఇంజన్ కెపాసిటీ.. ఈ రెండు నిబంధనల ప్రకారం కారు ధర తగ్గుదలలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంతకుముందు ఇలాంటి వాహనాలపై కూడా 28% Gst ఉండేది అయితే ఇప్పుడు ఈ కార్ స్మాల్ కార్ కేటగిరి లోకి రావడం వల్ల రెనాల్ట్ ట్రైబర్ సెవెన్ సీటర్ కారుకి ఇప్పుడు 18% జీఎస్టీ మాత్రమే వర్తిస్తోంది. దీన్నిబట్టి చూస్తే సుమారుగా 10% వరకు జీఎస్టీ తగ్గుతుంది.
అంటే ఒక లక్ష రూపాయల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. ఇది మధ్యతరగతి కుటుంబాలకు కూడా మంచి శుభవార్త అని చెప్పవచ్చు. కియా కారెన్స్, టయోటా రుమియాన్, మారుతి ఎర్టిగా వంటి కార్లు 7 సీటర్లు కలిగి ఉన్నప్పటికీ పొడవులో ఇంజన్ సామర్థ్యంలో పెద్దవిగా ఉన్నాయి అందుకే అవి చిన్న కారు కేటగిరీలోకి అర్హత అందుకోలేకపోయాయి. దీనివల్ల జిఎస్టి తగ్గింపు ప్రయోజనం కూడా ఈ కార్లకు ఉండదు.అయితే మారుతీ లోని ఈ కార్ కు మాత్రం ఈ సౌలభ్యం లభిస్తోంది.
రెనాల్ట్ ట్రైబర్ కేవలం ధరలలోనే కాదు దాని ఫీచర్స్ తో కూడా వినియోగదారులకు బాగా ఉపయోగపడేలా కనిపిస్తోంది. ఫ్లెక్సిబుల్ స్టీరింగ్ కలదు. లగేజ్ వేసుకోవడానికి సీట్లను సులభంగా మనం తీసివేసుకోవచ్చు. ఈ కార్ బయట చిన్నగా కనిపించిన లోపల చాలా విశాలమైన స్థలమే కలిగి ఉంటుంది.1.0 ml ఇంజన్ మంచి మైలేజ్ ఇవ్వడమే కాకుండా ఖర్చులు కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఇందులో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో పాటుగా, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ , నాలుగు ఎయిర్ బ్యాగ్లు కలవు.
రెనాల్ట్ ట్రైబర్ చాలా తక్కువ బడ్జెట్ లోనే లభిస్తుంది. ఒక మంచి ఫ్యామిలీ కార్ కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ప్రస్తుతం పన్ను తగ్గింపుతో ఇది మరింత ఆకర్షణీయంగా మారింది. అయితే దీని ధర ప్రస్తుతం ఆన్లైన్ వివరాల మేరకు రూ.6.30 నుంచి రూ.9.40 లక్షల వరకు ఉన్నది.. ఇది పెట్రోల్, సిఎన్జి వంటి ఆప్షన్లతో లభిస్తుంది.