• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  జగన్...

జగన్ వెన్నుపోటుదారు....సీరియస్ గానే విజయసాయి !

| వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2009లో వైఎస్సార్ మరణం తర్వాత సీఎం పదవి కోరుతూ జగన్ కాంగ్రెస్‌ను డిమాండ్ చేశారని, సోనియా గాంధీ అంగీకరించకపోవడంతో ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేశారని వెల్లడించారు. జగన్‌ను వెన్నుపోటుదారుడిగా అభివర్ణించారు. వైసీపీలో తన ఆత్మగౌరవం దెబ్బతినడం వల్లే పార్టీని వీడానని ఆరోపించారు.

By - Satya P
Update: 2026-11-25 17:53 GMT

వెన్నుపోటుదారుడు అన్నది రాజకీయాల్లో ఒక తీవ్రమైన విమర్శ. దీనిని ఎక్కువగా టీడీపీ ప్రత్యర్ధులు చంద్రబాబు మీద ప్రయోగిస్తూంటారు. ఆయన 1995 ఆగస్టు సంక్షోభంలో ఎన్టీఆర్ నుంచి పదవిని తీసేసుకున్నారు అని ఇప్పటికీ ఆరోపిస్తూంటారు. అది ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్నది టీడీపీ సైడ్ వాదనగా ఉంటుంది. ఇదిలా ఉంటే ఏపీలో జగన్ ని వెన్నుపోటుదారు అని ఆయన ప్రత్యర్ధులు అంటూంటారు. ఆయన తనకు రాజకీయ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ ని వీడి వచ్చారని అలా ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచారు అని ఇప్పటిదాకా ప్రత్యర్ధులు అపుడపుడు అంటూ వచ్చారు. దానికి మరింతగా ధృవీకరిస్తూ జగన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు ఒకనాటి వైసీపీ నంబర్ టూ. జగన్ తోడుగా నీడగా దశాబ్దాల తరబడి ఉన్న విజయసాయిరెడ్డి. దీంతో ఈ విమర్శలు ఇపుడు ప్రకంపనలు రేపుతున్నాయి.

సీఎం సీటు కోసం :

విజయసాయిరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ 2009 లో వైఎస్సార్ మరణించినప్పుడు సీఎం సీటు కోసం జగన్ కాంగ్రెస్ పార్టీని జగన్ డిమాండ్ చేశారు అని విజయసాయిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అంగీకరించకపోవడంతో జగన్ తన ఎంపీ పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు అని విజయసాయిరెడ్డి పదిహేనేళ్ల క్రితం నాటి విషయాలను బయట పెట్టారు. అంతే కాదు జగన్ వెన్నుపోటుదారుడే అని డిసైడ్ చేశారు. తాను వైసీపీని వీడి వెన్నుపోటు పొడిచాను అని అంటున్న వైసీపీ నేతలు ఈ విషయాన్ని తెలుసుకోవాలని విజయసాయిరెడ్డి కోరడం విశేషం.

అందుకే వైసీపీకి గుడ్ బై :

తాను వైసీపీకి ఏ పరిస్థితుల్లో గుడ్ బై కొట్టాల్సి వచ్చిందో విజయసాయిరెడ్డి వివరించారు. తాను వైసీపీని పునాదుల నుంచి ఎంతగానో అభివృద్ధి చేశాను అని ఆయన అన్నారు. అంతే కాదు జగన్ తో పాటు జైలుకు వెళ్లాను అన్నారు. ఈ కారణంగానే తనకు వైసీపీలో నంబర్ టూ పదవి దక్కిందని అన్నారు. అయితే వైసీపీలో తన ఆత్మ గౌరవం దెబ్బతీసేలా వ్యవహరించారు అని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఇవన్నీ జగన్ కి తెలిసే జరిగాయని ఆయన అన్నారు. జగన్ చుట్టూ కోటరీ ఉందని కూడా మరోసారి విజయసాయిరెడ్డి విమర్శించారు. ఆయనకు చుట్టూ జరిగేది ఏమీ తెలియనీయకుండా చేస్తున్నారు అని కూడా విజయసాయిరెడ్డి విమర్శించారు.

జగన్ టార్గెట్ గానే :

ఇదిలా ఉంటే ఢిల్లీలో తాజాగా విజయసాయిరెడ్డి పెట్టిన ప్రెస్ మీట్ లో జగన్ ని గట్టిగానే టార్గెట్ చేశారు. తనను వైసీపీ నేతలు విమర్శిస్తే తాను జగన్ నే నేరుగా విమర్శిస్తాను అని ఆయన చెప్పకనే చెబుతున్నారు. విజయసాయిరెడ్డి మరో మాట కూడా అన్నారు. వైఎస్సార్ కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు అన్నీ తనకు రాజ్యసభ మాజీ మెంబర్ అయిన కేవీపీ రామచంద్రరావుకు మాత్రమే తెలుసు అన్నారు. అంటే వైసీపీలోనే కాదు వైఎస్ కుటుంబంలో కూడా తాను ఒకనాడు ఎంత ముఖ్యుడిగా ఉన్నానో విజయసాయిరెడ్డి చెబుతున్నారు అన్న మాట. ఇక వైఎస్ జగన్ షర్మిల మధ్య ఆస్తుల వివాదం గురించి మాట్లాడడానికి ఆయన నిరాకరించారు. అది వారి వ్యక్తిగత విషయం అని కూడా అన్నారు. మొత్తానికి జగన్ నే తన టార్గెట్ అని విజయసాయిరెడ్డి స్పష్టం చేస్తున్నారు అన్న మాట.

Tags:    
  • vijayasaireddy 
  • ysjagan 
  • ysrcp 
  • ysrcongress 
  • andhrapolitics 

Similar News

యలహంక ఆస్తుల వివాదం.....విజయసాయి హాట్ కామెంట్స్

2026-11-25 17:55 GMT

వైసీపీ బోణీ కొడుతుందా ?

2026-11-25 17:54 GMT

నేనూ పాద‌యాత్ర చేస్తా.. ఎప్పుడంటే: సాయిరెడ్డి

2026-11-25 17:54 GMT

ఎన్టీఆర్ భారతరత్న...కూతురు అందుకోవచ్చా ?

2026-11-25 17:52 GMT

దేశంలోనే తొలిసారి...వాళ్లకు రక్షణగా కూటమి చట్టం

2026-11-25 14:30 GMT

రాజమండ్రికి 'మహా కుంభమేళా' వైభవం.. గోదావరి పుష్కరాల ప్రత్యేకతలు ఇవే..!

2026-11-25 13:13 GMT

ఇంటింటికీ వచ్చి క్షమాపణ చెబుతా: గౌతు శిరీష సంచలన వీడియో

2026-11-25 12:50 GMT

ఒకే క్లిక్‌తో 10 లక్షల మందికి సందేశం.. టీడీపీని నడిపిస్తున్న డిజిటల్ వెన్నెముక

2026-11-25 12:05 GMT

జ‌న‌సేన 'క‌ట్టు' త‌ప్పుతోంది: సాగ‌దీతే కార‌ణమా.. ?

2026-11-25 12:04 GMT

టీడీపీలో సామాన్య కార్యకర్తలకు పదవులు.. అసలు సీక్రెట్ ఇదే.. పనిచేసిన లోకేశ్ మాస్టర్ ప్లాన్!

2026-11-25 11:01 GMT

10 లక్షల మందితో ‘మైటీడీపీ’ యాప్ సరికొత్త రికార్డు.. లోకేశ్ డిజిటల్ వ్యూహం సక్సెస్!

2026-11-25 10:31 GMT

Copyright @2026

Powered by Blink CMS