• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Video Stories >  'బ్రో' కిల్లి కిల్లి...

'బ్రో' కిల్లి కిల్లి రీమిక్స్​.. పవన్ వింటేజ్ బీట్​ అదిరిపోయిందహే

| గుడుంబా శంకర్ సినిమాలోని 'కిల్లి కిల్లి' సాంగ్, ఇంకా 'వయ్యారి భామ', 'ఏదోలా ఉందీవేళ', 'సరిగమ పదనిస' వంటి సాంగ్స్​ను మిక్స్ చేసి తమన్​ బీట్​ కొట్టినట్లు ప్రచారం సాగింది

By - Tupaki Desk
Update: 2023-07-26 05:19 GMT

మరి రెండు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ పవన్ కల్యాణ్​ సందడి కనిపించనుంది. ఆయన.. తన మేనల్లుడు సాయి తేజ్​తో కలిసి నటించిన క్రేజీ మూవీ 'బ్రో' రిలీజ్​కు రెడీ అయిపోయింది. ఈ సినిమాలో పవన్​ ఫుల్ లెన్త్ రోల్ పోషించక పోయినప్పటికీ.. సినిమాపై పవర్ స్టార్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే పవన్​ ఉన్నంత మూవీ హై లెవల్లో ఉంటుందని ఆశపడుతున్నారు.

ఇప్పటికే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో పవన్ వింటేజ్​ లుక్​లో కనిపించనున్నారని గతంలో పోస్టర్లు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఫ్యాన్స్​ మరింత ఆసక్తిగా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే ఫ్యాన్స్​కు డబుల్ ట్రీట్​ ఇచ్చేందుకు పవన్ వింటేజ్​​ సూపర్ హిట్​ సాంగ్స్​ను ఇందులో రీమేక్ చేశారని వార్తలు వచ్చాయి. గుడుంబా శంకర్ సినిమాలోని 'కిల్లి కిల్లి' సాంగ్, ఇంకా 'వయ్యారి భామ', 'ఏదోలా ఉందీవేళ', 'సరిగమ పదనిస' వంటి సాంగ్స్​ను మిక్స్ చేసి తమన్​ బీట్​ కొట్టినట్లు ప్రచారం సాగింది.

అయితే ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ.. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్​లో అభిమానుల్లో ఫుల్ జోష్​ నింపారు మేకర్స్​. గుడుంబా శంకర్ సినిమాలోని 'కిల్లి కిల్లి' సాంగ్​ను రీమిక్స్​ చేసి దానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.

ఆ సాంగ్​ బీట్​ అదిరిపోయింది. ముఖ్యంగా పవన్, సాయితేజ్​, తమన్​ కలిసి వేసిన మాస్​ స్టెప్పులు పవన్ అభిమానులను ఊర్రూతలూగించేశాయి. ఈవెంట్​ హాలంతా ఈలలు, గోలలతో దద్దరిల్లిపోయింది. పవన్ అయితే వింటేజ్ కూలీ లుక్​లో లుంగీ, ఎర్రచొక్క వేసుకుని అదిరిపోయారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్​మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే వాస్తవానికి ఈ చిత్రం నుంచి మొదట రిలీజ్ చేసిన రెండు పాటలకు అంతగా హైప్ రాలేదు.

ఆ సాంగ్స్ విషయంలో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహపడ్డారు. ఈ క్రమంలోనే రీసెంట్​గా బ్రో థీమ్​ లిరికల్ వీడియో సాంగ్​ రిలీజై గుస్​బంప్స్​ తెప్పించింది. లిరిక్స్​, తమన్ స్వరపరిచిన బీట్​ ఊపు తెప్పించింది. అలాగే ఇప్పుడు కిల్లి కిల్లి సాంగ్​ ప్రోమో ఆ ఉత్సాహాన్ని మరింత పెంచింది. అభిమానులు ఈ ప్రోమోను చూసి ర్యాంప్ ఆడేసింది పాట అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మొత్తంగా ఈ రెండు పాటలు అప్పటివరకు సినిమాపై తక్కువగా ఉన్న హైప్​ను అమాంతం పెంచేశాయి. అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.ఇప్పుడు సోషల్​మీడియాలో ఎక్కడ చూసిన అవే కనపడుతున్నాయి. ఇకపోతే ఈ చిత్రానికి ఒరిజినల్ వెర్షన్​ వినోదయ సీతమ్​కు దర్శకత్వం వహించిన సముద్రఖనినే ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ స్క్రీన్​ ప్లే, మాటలు అందించారు.


Full View


Tags:    
  • BroMovie 
  • Brofilm 
  • Pawankalyan 
  • Saidharamtej 
  • Killikilli 
  • Songpromo 
  • Ssthaman 
  • Samudrakhani 
  • Ketika 
  • PriyaVarrior 

Similar News

విదేశాల్లో భారతీయుల ప్రవర్తనపై విమర్శలు.. అసలు సమస్య ఎక్కడుంది?

2026-11-09 16:30 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

వెట్టువమ్ 'సెలబ్రేట్ రెసిలియెన్స్'.. ఇంటెన్స్ లుక్‌లో శోభిత

2026-11-09 11:03 GMT

ఊపిరి ఆడడం లేదు.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్య భూతం.. బతికేదెలా?

2026-11-09 05:26 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

చిత్తుగా ఓడించినా ట్రంప్ మద్దతుదారులకు బుద్ది రాలేదు.. సియాటిల్ లో హిందువులపై అదే విద్వేషం..

2026-11-08 06:00 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

Tupaki Exclusive : నాగార్జున ఎందుకు ప్రెజెంట్ చేశారు? అనీష్ ఓపెన్ చాట్

2026-11-07 06:12 GMT

Copyright @2026

Powered by Blink CMS