• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  USA >  చిత్తుగా ఓడించినా ట్రంప్...

చిత్తుగా ఓడించినా ట్రంప్ మద్దతుదారులకు బుద్ది రాలేదు.. సియాటిల్ లో హిందువులపై అదే విద్వేషం..

| అమెరికాలోని సియాటెల్‌లో జరిగిన దీపావళి వేడుకలను కొందరు ట్రంప్ మద్దతుదారులు వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు. హిందువులు అమెరికా సంస్కృతిని, క్రైస్తవ మతాన్ని దెబ్బతీస్తున్నారంటూ నినాదాలు చేశారు. అమెరికా రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛకు ఇలాంటి చర్యలు విరుద్ధమని, భారతీయ అమెరికన్లపై విద్వేషం పెంచడం ఆందోళనకరమని ఈ ఘటన చర్చకు దారితీసింది.

By - A.N.Kumar
Update: 2026-11-08 06:00 GMT

చింత చచ్చినా పులుపు చావదు అంటారు.. ట్రంప్ కు, ఆయన మద్దతుదారులకు అమెరికా మిడ్ టర్మ్ ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టినా బుద్దిరాలేదు. మళ్లీ అదే విద్వేషం పెచ్చరిల్లుతోంది. ముఖ్యంగా మన హిందువులను వారి పండుగలను టార్గెట్ చేసి విద్వేషం పంచారు. తమ చేష్టలతో ప్రజలు చీకొట్టి ఓడించినా కూడా ట్రంప్ మద్దతుదారులకు బుద్దిరాకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అమెరికాలో రాజకీయ ఫలితాలు తారుమారైతే మారొచ్చు గానీ.. కొందరి తలకాయల్లో నాటుకుపోయిన మత దురహంకారానికి మాత్రం ఎక్స్‌పైరీ డేట్ లేనట్టే ఉంది. వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటిల్ నగరంలో ఇటీవల జరిగిన దీపావళి వేడుకలు ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలిచాయి. దీపాల పండుగను ఆనందంగా జరుపుకుంటున్న హిందూ సమాజంపై కొందరు ట్రంప్ మద్దతుదారులు నానా యాగీ చేయడం చూస్తుంటే.. వీళ్ల భయం చూసి నవ్వాలో.. అమాయకత్వంపై జాలిపడాలో అర్థం కాదు.

సియాటిల్ సంబరాల్లో ఈ 'అతి మేధావులు' చేసిన హంగామా అంతా ఇంతా కాదు. "అమెరికాను కాపాడండి.. ఈ హిందువులు మన సంస్కృతిని నాశనం చేస్తున్నారు.. మన క్రిస్టియానిటీని లేకుండా చేయడానికి కుట్ర పన్నుతున్నారు" అంటూ గొంతుచించుకుని మరీ నిరసనకు దిగారు. బాణాసంచా పేలకముందే వీళ్ల నోట్ల నుంచి వెలువడిన విద్వేషపు పొగలతో అక్కడి వాతావరణం కలుషితమైపోయింది. ఒక లైటింగ్ దీపం వెలిగిస్తే అమెరికాలోని క్రైస్తవ సామ్రాజ్యం కూలిపోతుందనే రేంజ్‌లో వీరు భయపడుతుండటం విశేషం.

అసలు ఈ మహాశయుల లాజిక్ ప్రకారం.. అమెరికాలో హిందువులు దీపావళి జరుపుకుంటే వీళ్ల జీసస్ పండుగలకు సెలవు ప్రకటిస్తారా? లేక ఏకంగా క్రిస్మస్ ట్రీలన్నీ మాయమైపోతాయా? అమెరికా ఆర్థిక, సాంకేతిక, వైజ్ఞానిక రంగాలను అగ్రస్థానంలో నిలబెట్టడంలో భారతీయ అమెరికన్ల చెమట.. ప్రతిభ ఉన్నాయన్న సత్యం వీళ్ల కళ్లకు కనిపించదు. కానీ దీపావళికి మిఠాయిలు పంచుకుంటుంటే మాత్రం వీళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి.. రాజకీయాల్లో ఓటములు ఎదురైనా.. అధికారం చేజారినా.. ఈ మతపరమైన అసహనం మాత్రం వీళ్ల డీఎన్‌ఏ నుంచి పోదని మరోసారి నిరూపించారు.

అమెరికా రాజ్యాంగం అందరికీ మత స్వేచ్ఛను ప్రసాదించింది. కానీ ఈ సంకుచిత మనస్తత్వం ఉన్నవారికి మాత్రం భిన్నత్వం అనేది ఒక పెద్ద ఉరితాడులా కనిపిస్తోంది. నిజానికి అమెరికా బలం దాని వైవిధ్యంలోనే ఉంది. కానీ ఇలాంటి అజ్ఞానపు నిరసనకారులు మాత్రం.. తమ దేశం మళ్లీ రాతియుగంలోకి వెళ్లిపోతుందనే భ్రమలో బతుకుతున్నారు. ఎన్నికల్లో ఎవరు గెలిచినా.. ఓడినా అసలైన ఓటమి మాత్రం ఇలాంటి వారి సంస్కారానిదే. దీపావళి చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీక అయితే.. ఈ నిరసనలు మాత్రం అమెరికన్ సమాజంలోని చీకటి కోణాన్ని... మేధోపరమైన దిగజారుడుతనాన్ని కళ్లకు కడుతున్నాయి.

అమెరికాను కాపాడండి అంటూ నిరసన. అమెరికాలోని సియాటిల్ నగరంలో నిర్వహించిన దీపావళి వేడుకల సందర్భంగా ట్రంప్ మద్దతుదారులు నిరసనకు దిగారు. “అమెరికా సంస్కృతిని కాపాడాలి” అంటూ నినాదాలు చేస్తూ.. హిందూ సంస్కృతి, దీపావళి వేడుకలపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. #Diwali #Seattle #USA #TeluguNews #Tupaki Follow 👉 @tupaki_official

— Tupaki (@tupaki_official) November 8, 2026
Tags:    
  • diwali 
  • seattle 
  • trumpsupporters 
  • antihindu 
  • america 

Similar News

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

H-1B స్లాట్ల కోసం రోజూ ఎదురుచూపులు.. బుక్ చేసేలోపే మాయం!

2026-11-19 05:09 GMT

GTA 6 కోసం నాలుగు రోజులు సెలవు.. అమెరికా సైనికులకు అదిరిపోయే ఆఫర్!

2026-11-19 05:08 GMT

అమెరికాలో మరో షాక్.. NSA రహస్య నెట్‌వర్క్ కూడా డౌన్!

2026-11-18 06:51 GMT

జెఫ్రీ ఎప్‌స్టీన్‌ది ఆత్మహత్యా కాదా.? పక్కా ప్లాన్‌తో చేసిన హత్యా? ఫోరెన్సిక్ విశ్లేషణతో సంచలనం

2026-11-17 12:46 GMT

అమెరికాలో భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ట్రంప్ తెచ్చిన కొత్త రూల్‌ను కొట్టేసిన కోర్టు!

2026-11-17 10:20 GMT

1.8 లక్షల మంది కోరుతున్నా.. జెన్సన్ హువాంగ్‌ను వెనక్కి తీసుకోని ఎన్విడియా!

2026-11-17 10:01 GMT

అమెరికాలో ఇరాన్ దాడికి ప్లాన్ చేస్తోందా? ట్రంప్ అధికారులకు భద్రత పెంపు!

2026-11-17 05:35 GMT

అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గింది.. మాస్టర్స్ చదువుపైనే ఎక్కువ ప్రభావం!

2026-11-17 04:38 GMT

అమెరికా విమానాల రద్దు వెనుక అసలు విలన్ ఎవరు? ఆ 4 సెకన్ల కథేంటి?

2026-11-16 18:55 GMT

విమానాలు ఎగరలేదు.. తప్పంతా బైడెన్ దే.. నాది కాదు.. ట్రంప్ మళ్లీ ఏసాడు..

2026-11-16 06:55 GMT

ఎన్ని ఎఫైర్లు పెట్టుకున్నా మళ్లీ జెన్సన్ రావాలి.. ఎన్వీడియో పగ్గాలి చేపట్టాలట.. వైట్ హౌస్ వద్దకు పంచాయితీ..

2026-11-16 04:53 GMT

Copyright @2026

Powered by Blink CMS