• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Travel >  కనుమరోజున ప్రయాణాలు...

కనుమరోజున ప్రయాణాలు వద్దంటారు.. ఎందుకో తెలుసా?

| వాస్తవానికి కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదని పెద్దలు పెట్టిన ఆచారం వెనుక ఓ గొప్ప ఔన్నత్యమే దాగి ఉంది! పూర్వం ఎక్కువగా ప్రయాణాలకు ఎడ్ల బండ్లే ఉపయోగించేవారనే సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-01-16 06:13 GMT

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతిని పెద్ద పండగగా జరుపుకుంటారు. ప్రపంచంలో ఏ మూళన ఉన్నా ఈ పండక్కి సొంత ఊరికి రావాలని భావిస్తుంటారు. అలాకానిపక్షంలో.. ఉన్న చోటే సంక్రాంతి శోభను ముగ్గులతో, సంబరాలతో తెచ్చుకుంటారు. ఇలా మూడు రోజుల పాటు ఎంతో సందడిగా జరిగే ఈ పండగ సమయంలో తొలి రోజు భోగ భాగ్యాలను ప్రసాదించే భోగి, రెండో రోజు పితృదేవతలను పూజించే సంక్రాంతి కాగా.. మూడో రోజు కనుమ.

ఈ మూడోరోజు పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. దీన్ని పాడి పశువుల పండగగా చెబుతారు. వ్యవసాయ క్షేత్రాల్లో పంటల సాగుకు ఎంతగానో సహాయపడిన పశువులకు ఈరోజున రైతులు కృతజ్ఞత తెలుపుకొంటారు. అయితే, "కనుమ రోజున కాకులు కూడా కదలవు" అనే సామెతను గుర్తు చేస్తూ ఆ రోజు ప్రయాణాలు చేయొద్దని చెబుతుంటారు. అది ఎందుకనేది ఇప్పుడు చూద్దాం...!

వాస్తవానికి కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదని పెద్దలు పెట్టిన ఆచారం వెనుక ఓ గొప్ప ఔన్నత్యమే దాగి ఉంది! పూర్వం ఎక్కువగా ప్రయాణాలకు ఎడ్ల బండ్లే ఉపయోగించేవారనే సంగతి తెలిసిందే. అయితే... ఏడాదిపాటు రైతుకి పొలంలోనూ, ప్రయాణాల్లోనూ తోడుగా ఉండే ఎడ్లను కనుమ రోజున పూజలు చేస్తారు. అందువల్ల ఆ ఒక్కరోజైనా వాటిని కష్టపెట్టకుండా ఉంచాలనే భావనతో బళ్లు కట్టకుండా ఉండేందుకు అసలు కనుమరోజున ప్రయాణమే వద్దని చెప్పేవారు.

కాగా... కనుమను పల్లెల్లో వైభవంగా జరుపుకొంటారనేది తెలిసిన విషయమే. రైతు కుటుంబాలకు సుఖ సంతోషాలను, పంటలను అందించేందుకు అహర్నిశలు కష్టపడుతూ ఈ మూగ జీవాలు పోషిస్తున్న పాత్రను రైతులు ఒక పండగలా జరుపుతారు. అందులో భాగంగా కనుమ రోజు నదీ తీరాలు, చెరువుల వద్దకు పశువులను తీసుకెళ్లి స్నానం చేయించిన తర్వాత నుదట పసుపు, కుంకుమ దిద్దుతారు. ఆ విధంగా పశువుల పట్ల కృతజ్ఞతగా కనుమ రోజున వాటికి విశ్రాంతి ఇచ్చి పూజించుకుంటారు.

Tags:    
  • Kanuma 
  • Sankranthi 
  • Festival 
  • Telugustates 
  • Telangana 
  • Andhrapradesh 
  • Travle 
  • Bullockcart 
  • Ancient 

Similar News

దుబాయ్‌లో 24 క్యారెట్ల బంగారు నడకదారి.. 2026లో మరో అద్భుత ఆకర్షణ!

2026-10-27 04:59 GMT

ట్రైన్ జర్నీలో వీడియోలు చూసే అలవాటుందా? మిస్ కావొద్దు

2026-10-20 05:58 GMT

ఇంధన ధరల మోతతో ఇండిగో ఛార్జీలకు రెక్కలు.. ఎంతంటే?

2026-10-06 04:48 GMT

విదేశీ ట్రావెల్ ఇక రిచ్‌లకే కాదు.. మిడిల్ క్లాస్ డ్రీమ్ నిజం అవుతోంది

2026-09-27 02:30 GMT

మేఘాల కొండ...అదో అందమైన గమ్మత్తు !

2026-09-18 08:30 GMT

సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్.. స్మార్ట్‌ఫోన్ బోర్డింగ్ పాస్ చాలు!

2026-08-22 14:30 GMT

Gen Z ట్రావెల్ ట్రెండ్.. రూల్స్ బ్రేక్ చేస్తుందా?

2026-04-24 23:30 GMT

భూమిపై అతి సుందర ప్రదేశం స్పిటీ వ్యాలీ.. అక్కడ ప్రకృతి ఎలా ఉంటుందంటే?

2026-04-07 07:30 GMT

భారత పాస్‌పోర్ట్ కి 75వ స్థానం.. ఈ ర్యాంకింగ్ తో ఎన్ని దేశాలు తిరగచ్చో తెలుసా?

2026-02-13 18:30 GMT

ఏమిటీ బ్లూటూత్ ట్రెండ్.. హనీమూన్ స్పాట్ కాస్తా హెచ్ ఐవీ సెంటర్

2026-02-07 04:28 GMT

వందేభారత్ స్లీపర్ టికెట్ క్యాన్సిల్ కొత్త రూల్ తెలిస్తే షాకే!

2026-01-24 06:30 GMT

విదేశీయులు మెచ్చిన నగరం.. అభివృద్ధిలో వేగవంతం!

2026-01-08 02:30 GMT

Copyright @2026

Powered by Blink CMS