వారం ఆలస్యంగా ఓటీటీలో పొలిటికల్‌ థ్రిల్లర్‌...!

శక్తి తిరుమగన్‌, భద్రకాళి సినిమా విషయంలోనూ ఓటీటీ ఫలితం అలాగే ఉంటుందేమో అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.;

Update: 2025-10-15 08:25 GMT

విజయ్‌ ఆంటోనీ హీరోగా అరుణ్‌ ప్రభు దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ 'శక్తి తిరుమగన్‌' గత నెల 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. విజయ్ ఆంటోనీ పొలిటికల్‌ బ్రోకర్ పాత్రలో కనిపించిన విషయం తెల్సిందే. సినిమాకు తమిళ ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ రివ్యూలు వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అన్నట్లుగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. తెలుగులో ఈ సినిమాను భద్రకాళి టైటిల్‌ తో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన విషయం తెల్సిందే. తెలుగులో పెద్దగా సినిమాకు అధరణ దక్కలేదు. కానీ విజయ్‌ ఆంటోనీ సినిమా అంటే మినిమం ఉంటుందనే విశ్వాసంతో చాలా మంది ప్రేక్షకులు ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. ముఖ్యంగా తమిళ, తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని చెబుతున్నారు.

విజయ్ ఆంటోనీ శక్తి తిరుమగన్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌

ఈ మధ్య కాలంలో థియేట్రికల్‌ రిలీజ్ అయిన సమయంలో పెద్దగా ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు, కానీ ఓటీటీలో వచ్చినప్పుడు మాత్రం ఎక్కువ మంది చూస్తున్నారు. ఇప్పుడు అదే జరిగే అవకాశాలు ఉన్నాయి. వార్‌ 2 సినిమాను ప్రేక్షకులు ఎక్కువగా థియేటర్‌లో చూడలేదు. కానీ హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ అభిమానులు మాత్రం సినిమాను ఓటీటీలో తెగ చూస్తున్నారు. సినిమా థియేట్రికల్‌ రిలీజ్ సమయంలో ఫ్లాప్‌ అయినప్పటికీ ఓటీటీలో అత్యధికులు చూడటం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అందుకే థియేట్రికల్‌ ఫలితంతో సంబంధం లేకుండా ఓటీటీలో సినిమాలకు మంచి స్పందన రావడం మనం ముందు ముందు మరింత చూసే అవకాశాలు ఉన్నాయి. శక్తి తిరుమగన్‌, భద్రకాళి సినిమా విషయంలోనూ ఓటీటీ ఫలితం అలాగే ఉంటుందేమో అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

జియో హాట్‌స్టార్‌లో భద్రకాళి సినిమా స్ట్రీమింగ్‌

సాధారణంగా ఈమధ్య కాలంలో సినిమాలు ఎక్కువ శాతం థియేట్రికల్‌ రిలీజ్ అయిన నాలుగు వారాలకు ఓటీటీలో స్ట్రీమింగ్‌ కావడం చూస్తూ ఉన్నాం. కానీ ఈ సినిమా మాత్రం అయిదు వారాల తర్వాత స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ జియో హాట్‌ స్టార్‌లో ఈ సినిమాను స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. జియో హాట్‌ స్టార్‌ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చింది. అక్టోబర్‌ 24 నుంచి తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా జియో హాట్‌ స్టార్‌లో అందుబాటులో ఉంటుంది అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది. దాంతో ప్రేక్షకులు ఈ సినిమా స్ట్రీమింగ్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విజయ్ ఆంటోనీ సినిమాలపై అభిమానం కనబర్చే వారు చాలా మంది ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీలో అన్ని భాషల ప్రేక్షకులను అలరిస్తుందా అనేది చూడాలి.

విజయ్ నిర్మాణంలో శక్తి తిరుమగన్‌

సునీల్ కృపలాని , తృప్తి రవీంద్ర, క్రిష్ హసన్, వాగై చంద్రశేఖర్ , సెల్ మురుగన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాను విజయ్ ఆంటోనీ తన సొంత బ్యానర్‌ అయిన విజయ్ ఆంటోనీ ఫిల్మ్‌ కార్పోరేషన్ బ్యానర్‌ లో నిర్మించాడు. ఈ సినిమాలో హీరోగా నటించి, నిర్మించడం మాత్రమే కాకుండా సంగీతాన్ని సైతం స్వయంగా తానే అందించాడు. ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ చాలా విభిన్నమైన పాత్రలో కనిపించాడు. సినిమా ప్రమోషన్ సమయలో విజయ్ ఆంటోనీ చాలా నమ్మకంగా సినిమా గురించి ప్రమోషన్ చేశాడు. అయితే బాక్సాఫీస్‌ వద్ద అప్పటి పరిస్థితుల కారణంగా ఆశించిన స్థాయిలో వసూళ్లు నమోదు కాలేదు. తెలుగులో అప్పుడు వేరే సినిమాలు ఉన్న కారణంగా బాక్సాఫీస్ వద్ద భద్రకాళి ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేక పోయింది. మరి ఓటీటీలో ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News