త్వరలోనే ఓటీటీలోకి జూనియర్
ఆడియన్స్ అలా వెయిట్ చేస్తున్న సినిమాల్లో జూనియర్ కూడా ఒకటి. ఈ మూవీతోనే ప్రముఖ పారిశ్రామిక వేత్త గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు గాలి కిరీటి రెడ్డి ఇండస్ట్రీలోకి వచ్చి హీరోగా పరిచయమయ్యాడు.;
కొన్ని సినిమాలకు థియేటర్ రిలీజ్ కంటే ఓటీటీ రిలీజ్ కోసమే ఆడియన్స్ ఎక్కువగా ఎదురుచూస్తుంటారు. ఆడియన్స్ దృష్టిలో థియేటర్లలో మాత్రమే చూసే సినిమాలు కొన్ని, ఓటీటీ లో చూసే సినిమాలు కొన్ని అని సపరేట్ కేటగిరీలుంటాయి. ఆడియన్స్ అలా వెయిట్ చేస్తున్న సినిమాల్లో జూనియర్ కూడా ఒకటి. ఈ మూవీతోనే ప్రముఖ పారిశ్రామిక వేత్త గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు గాలి కిరీటి రెడ్డి ఇండస్ట్రీలోకి వచ్చి హీరోగా పరిచయమయ్యాడు.
రిలీజ్ కు ముందు మంచి బజ్
టాలీవుడ్ డ్యాన్సింగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో జెనీలియా కీలక పాత్రలో నటించారు. రిలీజ్ కు ముందు మంచి బజ్ తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ను తెచ్చుకున్నప్పటికీ సూపర్‌హిట్ కాలేకపోయింది. దీంతో సినిమా ఎక్కువ రోజులు ఆడలేకపోయింది. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చూస్తున్నారు ఆడియన్స్.
త్వరలోనే ఆహాలోకి జూనియర్
ప్రేక్షకుల ఎదురుచూపులకు తెర దించుతూ జూనియర్ ఓటీటీ రిలీజ్ అప్డేట్ వచ్చేసింది. జ్ఞాపకాలు, ప్రేమ, నమ్మలేని నిజం.. త్వరలోనే అందరికీ తెలుస్తాయి. జూనియర్.. త్వరలోనే ఆహా లోకి వస్తుంది అని ఆహా ఓటీటీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. అయితే జూనియర్ మూవీని సెప్టెంబర్ 19 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
జూనియర్ రైట్స్ ప్రైమ్ వీడియో వద్ద కూడా?
అయితే జూనియర్ డిజిటిల్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వద్ద కూడా ఉన్నాయని, ఇతర భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రైమ్ వీడియో సొంతం చేసుకుందని అంటున్నారు. కానీ ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన ఈ సినిమాను హిందీ, తమిళ, మలయాళ భాషల్లోనూ డబ్బింగ్ వెర్షన్స్ తో స్ట్రీమింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు అంటున్నారు కానీ దానిపై ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు.