బిగ్ బాస్ 9.. నామినేషన్స్ లో దమ్ము చూపించిన శ్రీజ..!

బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం నామినేషన్స్ ని హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వారు చేసే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్.;

Update: 2025-10-28 04:22 GMT

బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం నామినేషన్స్ ని హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వారు చేసే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. వాళ్లకు రెండు కత్తులు ఇచ్చి పంపించి వాటిలో వాళ్లు డైరెక్ట్ గా ఒకరిని నామినేట్ చేసి మరొకటి వేరే వాళ్లకి ఇవ్వాలని ఫిక్స్ చేశారు. ఐతే మిగతా వారంతా ఎలా ఉన్నా దమ్ము శ్రీజ వచ్చి దడదడలాడించింది. తన మీద ఆడియన్స్ కు ఉన్న నమ్మకాన్ని ఏమాత్రం తగ్గకుండా శ్రీజ నామినేషన్స్ లో మాట్లాడింది.

శ్రీజ మెయిన్ టార్గెట్ వాళ్లే..

శ్రీజ కళ్యాణ్ ని నామినేట్ చేసింది.. హౌస్ లో ఉన్నప్పుడు ఆమె కళ్యాణ్, పవన్ లను తన స్నేహితులుగా భావించింది. తన ఫ్రెండ్ రాంగ్ ట్రాక్ లోకి వెళ్తున్నాడని ఫీల్ అవుతుంది శ్రీజ. కళ్యాణ్ ని నామినేట్ చేస్తూ నువ్వు అమ్మాయిల పిచ్చోడివా.. కాదన్నప్పుడు నువ్వు ఎందుకు సరిగా డిఫెన్స్ చేసుకోలేదు. ఆరోజు తనూజని నామినేట్ చేస్తా అని చెప్పి ఇమ్మాన్యుయెల్ ని ఎందుకు మోసం చేశావ్ అంటూ కళ్యాణ్ ని అడగాల్సిన పాయింట్స్ ని అడిగేసింది శ్రీజ.

ఇక మాధురితో కూడా.. బయట వెళ్లాక కూడా మీ గురించి అడిగితే ఎవరు చెప్పలేదని అన్నది శ్రీజ. మీరు మాధురినా.. మాస్ మాధురీనా అంటూ మాధురిని కూడా టచ్ చేసింది. ఐతే మాధురి కూడా నీ గురించి కూడా నాకేమి తెలియదని చెప్పింది. ఇక తనూజ ని కూడా టార్గెట్ చేసింది రెండు చేతులు జోడిస్తేనే క్లాప్స్ అంటూ రమ్యతో వాదించిన నువ్వు ఆ కామెంట్ చేసిన వారితో ఉంటున్నావ్ అంటూ ఆమెను కూడా టచ్ చేసింది.

శ్రీజ నామినేషన్స్ పాయింట్స్..

ఇలా శ్రీజ నామినేషన్స్ పాయింట్స్ తోనే తన మార్క్ చాటింది. అంతేకాదు శ్రీజ హౌస్ లోకి రీ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇక ఆమె ఆట తీరుతో కచ్చితంగా మిగతా హౌస్ మెట్స్ కి గట్టి పోటీ ఇస్తుంది. ఇక శ్రీజ నిఖిల్ తో కూడా హౌస్ లో సరిగా కనిపించట్లేదు అంటే.. నేను ఎవరితో కలిసి బాండింగ్ క్రియేట్ చేయను.. నా టైం వచ్చినప్పుడు నేను కనిపిస్తా అంటూ ఆన్సర్ ఇచ్చాడు.

మొత్తానికి శ్రీజ ఎంట్రీ తో హౌస్ లో పెను తుఫాను వచ్చినట్టే అయ్యింది. తప్పకుండా దమ్ము శ్రీజ ఇంపాక్ట్ హౌస్ లో కనిపించేలా ఉంది. శ్రీజ ఎలిమినేషన్ ప్రక్రియ టైం లో అందరు ఆడియన్స్ ఆమెను కొన్నాళ్లు ఉంచాల్సిందని భావించారు. ఐతే శ్రీజ ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి హౌస్ మెట్స్ అందరికి గట్టి పోటీ ఇచ్చేలా ఉంది.

Tags:    

Similar News