• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Sports >  పురుషులు.. మహిళలు.....

పురుషులు.. మహిళలు.. కుర్రాళ్లు.. టీమ్ ఇండియాకు బ్యాడ్ సండే..

| అలాంటి సండే రోజు క్రికెట్ మ్యాచ్ ఉంటేనా పైగా పురుషులు, మహిళలు.. కుర్రాళ్ల మ్యాచ్ లు మూడూ ఉంటేనా.. ఇక పండుగే కదా కానీ, ఈ సండే అభిమానులకు బ్యాడ్ డే మిగిలిపోయింది.

By - Tupaki Desk
Update: 2024-12-08 16:40 GMT

సండే హాలీ డే.. అందుకే ఈ వారం ఎప్పుడొస్తుందా అని అందరూ ఎదురుచూస్తుంటారు.. వారం అంతా పనిచేసిన అలసిపోయిన కొందరైతే ఏ పనీ చేయకుండా ఖాళీగా కూర్చుంటారు. మరికొందరు జాలీ టూర్ లు వేస్తుంటారు. చాలామంది తమ ఫ్యామిలీలతో గడిపేస్తుంటారు. అందుకే సండే హాలీ డేనే కాదు.. జాలీ డే కూడా. అలాంటి సండే రోజు క్రికెట్ మ్యాచ్ ఉంటేనా పైగా పురుషులు, మహిళలు.. కుర్రాళ్ల మ్యాచ్ లు మూడూ ఉంటేనా.. ఇక పండుగే కదా కానీ, ఈ సండే అభిమానులకు బ్యాడ్ డే మిగిలిపోయింది.

కుర్రాళ్లు కుమ్మేస్తారనుకుంటే?

ఆసియా అండర్ 19 కప్ లో టీమ్ ఇండియా  ఫైనల్లో ఓటమిపాలైంది. అయితే, ప్రత్యర్థి పాకిస్థాన్ అయితే పోనీలే అనుకోవచ్చు. కానీ, బంగ్లాదేశ్. లీగ్ దశలో పాకిస్థాన్ చేతిలో మన జట్టు ఓడిపోయినా, కానీ, తర్వాత దంచికొట్టి ఫైనల్ కు చేరింది. అయితే, బంగ్లా విసిరిన 199 పరుగుల లక్ష్యాన్ని చేరుకోలేక చతికిల పడింది. 13 ఏళ్లకే ఐపీఎల్ లోకి ఎంపికై సంచలనం రేపిన వైభవ్ సూర్యవంశీ (9) విఫలం కావడంతో ఆసియా కప్ ను యువ భారత్ జట్టు అందుకోలేకపోయింది.

అమ్మాయిలు చేతులెత్తేశారు..

పురుషుల జట్టుతో పాటు భారత మహిళలూ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఆ దేశ జట్టుతో వన్డే సిరీస్ ఆడుతున్నారు. తొలి వన్డేలో పరాజయం పాలైనప్పటికీ.. రెండో వన్డేలో గెలుస్తారని భావించారు. కానీ, ఈసారి మరింత ఘోరంగా ఓడారు. ఆసీస్ అమ్మాయిలు ఏకంగా 371 పరుగుల భారీ స్కోరు సాధించారు. భారత జట్టు 249 పరుగులకే ఆలౌటైంది. 122 పరుగుల తేడాతో ఓడింది.

పురుషులు ప్చ్..

ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో టీమ్ ఇండియా పురుషుల జట్టు ప్రదర్శన మరీ నాసిరకం. తొలి ఇన్నింగ్స్ లో 180 పరుగులకే ఆలౌటైన టీమ్ ఇండియా, రెండో ఇన్నింగ్స్ లో 175 పరుగులే చేయగలిగింది. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (42, 42) మినహా మరే బ్యాట్స్ మన్ క్రీజులో నిలవలేకపోయారు. తొలి ఇన్నింగ్స్ లో 337 పరుగులు చేసిన ఆసీస్ కు 19 పరుగుల స్వల్ప లక్ష్యం ఎదురైంది. వికెట్ కోల్పోకుండా దీనిని ఛేదించింది.

Tags:    
  • Cricket 
  • Under19Asiacup 
  • Vaibhavsuryavanshi 
  • Womenscricket 
  • Indiavsaustralia 
  • Smritimandanna 
  • Richaghosh 
  • Testseries 
  • Nitishkumarreddy 
  • Cricketfans 
  • Viratkohli 
  • Teamindia 

Similar News

దిగ్గజాల వీడ్కోలు.. 2026 క్రీడాభిమానులకు ఓ చేదు జ్ఞాపకం..

2026-11-18 10:02 GMT

ఐపీఎల్‌లో కెప్టెన్సీ కుర్చీ కోసం పోటీ.. వేలానికి ముందే ఐదు జట్లలో హాట్ టాపిక్

2026-11-18 09:54 GMT

బ్రేకింగ్ : ఐపీఎల్ కు ధోని రిటైర్ మెంట్.. ఇక సీఎస్కే లో ఈ కొత్త రోల్..

2026-11-17 10:33 GMT

పాక్ పనిపట్టిన గుంటూరు కుర్రోడు.. విజయ సుభాష్ ఫుల్ స్టోరీ ఇదే..

2026-11-15 20:25 GMT

అండర్-19 ఆసియా కప్ 2026: వారెవ్వా! ఇదిరా కిక్కిచ్చే విక్ట‌రీ అంటే.. గ్రేట్ ఇండియా!

2026-11-14 16:38 GMT

న్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోర ఓటమి.. 89 పరుగులకే చాపచుట్టేసిన టీమిండియా!

2026-11-13 10:19 GMT

రూ.10 లక్షల నుంచి రూ.18 కోట్లకు.. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా?

2026-11-13 06:53 GMT

తోపు క్రికెటర్ అయినా.. పబ్లిక్ లో భార్యకు గజగజ వణికిపోయాడు.. వైరల్ వీడియో

2026-11-12 19:30 GMT

ఇది భారత చెస్ స్వర్ణయుగానికి అసలైన బలమైన ఆరంభం

2026-11-10 11:30 GMT

ఐపీఎల్ లో మరో రెండు జట్లు.. 10 నుంచి 12కు పెరగనున్న టీమ్‌ల సంఖ్య? బీసీసీఐ మాస్టర్ ప్లాన్ ఇదేనా?

2026-11-10 10:30 GMT

భారత్ తో క్రికెట్ ఆడకపోతే దివాళా తీయాల్సిందే.. ఇంగ్లండ్ పరిస్థితి అదే..

2026-11-09 04:25 GMT

శాండ్ పేపర్ వివాదం.. ఆస్ట్రేలియా క్రికెట్ లో మంటపెట్టిన ఉస్మాన్ ఖవాజా

2026-11-07 08:22 GMT

Copyright @2026

Powered by Blink CMS