• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Sports >  చరిత్ర తిరగరాసిన గిల్.....

చరిత్ర తిరగరాసిన గిల్.. 117 బంతుల్లోనే డబుల్ సెంచరీ.. వన్డేల్లో ప్రపంచ రికార్డు

| టీమిండియా కెప్టెన్.. యంగ్ సెన్సేషన్ శుభ్‌మన్ గిల్ వెస్టిండీస్‌‌పై ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ప్రపంచ క్రికెట్ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు.

By - A.N.Kumar
Update: 2026-09-30 16:46 GMT

ఏం కొట్టుడు సామీ ఇదీ.. ఇంత పిచ్చకొట్టుడు మా జిందగీల చూడలే’ అని స్టేడియంకు వచ్చిన ప్రేక్షకులు.. టీవీలు చూస్తున్న ప్రేక్షకులు ఊర్రూతలూగిపోయారు.. ఏమన్నా మ్యాచ్ నా ఇదీ..‘అస్సాంలో మ్యాచ్ జరిగింది కాబట్టి.. బంతి కొడితే అస్సామే అన్నట్టుగా సాగింది. విండీస్ వీరులు మూడు సెంచరీలతో విధ్వంసం సృష్టిస్తే.. మనోళ్లు తక్కువ తిన్నారా..? విండీసోళ్లకు ఈ అర్ధరాత్రి నిజంగానే చుక్కలు చూపించారు. బంతి పడడమే ఆలస్యం.. చుక్కల్లా ఎగిరి ప్రేక్షకుల్లో పడిపోవడం.. రోహిత్ దంచికొడితే.. మన కెప్టెన్ గిల్ తన జీవితంలోనే బీభత్సమైన ఆటతో పెను విధ్వంసమే సృష్టించారు. క్రికెట్ హిస్టరీ బుక్స్ చెదరగొట్టే విధ్వంసం.. విండీస్ బౌలర్లను మైదానంలో నిలబెట్టి నరికేసిన పరుగుల వేట.. ఇదీ శుభ్‌మన్ గిల్ సృష్టించిన సునామీ.. కేవలం 117 బంతుల్లోనే డబుల్ సెంచరీ తోసిపారేసి ప్రపంచ క్రికెట్ రికార్డులను తుత్తునియలు చేస్తూ ‘ప్రిన్స్’ కాదు.. నేనే ఈ రాజ్యాంగానికి ‘రాజు’ అని గర్జించాడు..




 


టీమిండియా కెప్టెన్.. యంగ్ సెన్సేషన్ శుభ్‌మన్ గిల్ వెస్టిండీస్‌‌పై ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ప్రపంచ క్రికెట్ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశమివ్వకుండా మైదానంలో పరుగుల వర్షం కురిపించిన గిల్, వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన ద్విశతకం నమోదు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో ఇషాన్ కిషన్ పేరిట ఉన్న 126 బంతుల రికార్డును అధిగమిస్తూ కేవలం 117 బంతుల్లోనే 200 పరుగుల మార్క్‌ను చేరుకుని ఆధునిక క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు.

ఇన్నింగ్స్ ఆరంభం నుంచే మైదానంలో పక్కా ప్రణాళికతో కనిపించిన గిల్, విండీస్ బౌలర్ల లైన్ అండ్ లెంగ్త్‌ను పూర్తిగా దెబ్బతీశాడు. క్లాస్ షాట్లతో పాటు పవర్ హిట్టింగ్‌ను రంగరించి మైదానమంతా బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 117 బంతుల్లోనే ద్విశతకం పూర్తి చేసిన అతడు.. ఆ తర్వాత కూడా ఏమాత్రం అలసట లేకుండా ధాటిగా ఆడాడు. తన ఇన్నింగ్స్‌లో 24 ఫోర్లు, 7 భారీ సిక్సర్లు బాది చివరకు 133 బంతుల్లో 223 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ విస్ఫోటక ఇన్నింగ్స్ భారత జట్టుకు భారీ స్కోరును అందించడమే కాకుండా ప్రత్యర్థి జట్టుకు కోలుకోలేని దెబ్బతీసింది.

ఈ ఘనతతో వన్డే కెరీర్‌లో గిల్ తన రెండో ద్విశతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. గతంలో న్యూజిలాండ్‌పై 208 పరుగులు చేసిన గిల్.. తాజా ఇన్నింగ్స్‌తో ప్రపంచంలోనే ఒకటికంటే ఎక్కువ డబుల్ సెంచరీ సాధించిన దిగ్గజ బ్యాటర్ల సరసన నిలిచాడు. నాయకత్వ బాధ్యతలను భుజాన వేసుకుని.. ఒత్తిడిని సైతం జయించి కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో జట్టును ముందుండి నడిపించిన తీరు అతడి మానసిక దృఢత్వానికి అద్దం పడుతోంది.

ఈ చారిత్రాత్మక ద్విశతకంతో వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్ల జాబితాలో గిల్ మూడో స్థానానికి ఎగబాకాడు. రోహిత్ శర్మ సాధించిన 264 పరుగులు, న్యూజిలాండర్ మార్టిన్ గప్టిల్ 237 పరుగుల తర్వాతి స్థానంలో 223 పరుగులతో నిలిచి.. వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాల సరసన కొత్త అధ్యాయాన్ని లిఖించాడు.

సాధారణంగా స్థిరత్వానికి, సరైన షాట్ల ఎంపికకు పేరుగాంచిన శుభ్‌మన్ గిల్.. ఈ ఇన్నింగ్స్‌తో ఒక మ్యాచ్ రూపురేఖలను ఏ స్థాయిలో మార్చేయవచ్చో నిరూపించాడు. ఒత్తిడిలోనూ నిగ్రహం కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ఆడితే అసాధ్యమైన రికార్డులైనా సుసాధ్యమవుతాయని ఈ ప్రదర్శన చాటిచెప్పింది. ప్రపంచ వేదికపై భారత క్రికెట్ పతాకాన్ని మరోసారి అగ్రస్థానంలో నిలిపిన ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్.. క్రమశిక్షణ.. పట్టుదలతో శ్రమిస్తే సాధించలేనిది ఏదీ లేదని చాటుతూ రాబోయే తరాల క్రీడాకారులకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుంది.

వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు

1. రోహిత్ శర్మ – 264

2. మార్టిన్ గప్టిల్ – 237*

3. శుభ్‌మన్ గిల్ – 223*

4. వీరేంద్ర సెహ్వాగ్ – 219

5. క్రిస్ గేల్ – 215

6. ఫఖర్ జమాన్ – 210*

7. పథుమ్ నిస్సాంక – 210*

8. ఇషాన్ కిషన్ – 210

9. రోహిత్ శర్మ – 209

10. రోహిత్ శర్మ – 208*

11. శుభ్‌మన్ గిల్ – 208

12. గ్లెన్ మ్యాక్స్‌వెల్ – 201*

13. సచిన్ టెండూల్కర్ – 200*

14. సయీద్ అన్వర్ – 194

15. చార్లెస్ కోవెంట్రీ – 194*

16. ఫఖర్ జమాన్ – 193

17. జార్జ్ మున్సీ – 191

18. మార్టిన్ గప్టిల్ – 189*

19. సనత్ జయసూర్య – 189

20. వివ్ రిచర్డ్స్ – 189*



🔥 గిల్ చరిత్ర.. వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ!

వెస్టిండీస్‌పై శుభ్‌మన్ గిల్ విధ్వంసం.. కేవలం 117 బంతుల్లో డబుల్ సెంచరీ చేసి వన్డేల్లో ఫాస్టెస్ట్ 200 కొట్టిన బ్యాటర్‌గా రికార్డు. చివరికి 133 బంతుల్లో 223 పరుగులతో* నాటౌట్‌గా నిలిచాడు.

🏏 ODIల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు:… pic.twitter.com/y8KUifoYKr

— Tupaki (@tupaki_official) September 30, 2026


Tags:    
  • shubmangill 
  • rohitsharma 
  • indiancricket 

Similar News

టీమిండియాలో సిరాజ్ కు దక్కని చోటు.. సెలెక్షన్ చుట్టూ రాజకీయ దుమారం..

2026-11-22 11:28 GMT

టెస్టు క్రికెట్‌లో టీమ్‌ఇండియా విధ్వంసం.. రికార్డులన్నీ బద్దలు.. పంత్‌ ఖాతాలో అరుదైన ఘనత

2026-11-22 04:32 GMT

కోహ్లీలా కష్టపడాలి.. ధోనీలా పని చేయించాలి.. తిలక్ వర్మను ఆడించాలి.. అంబటి రాయుడు హాట్ కామెంట్స్

2026-11-21 08:35 GMT

దిగ్గజాల వీడ్కోలు.. 2026 క్రీడాభిమానులకు ఓ చేదు జ్ఞాపకం..

2026-11-18 10:02 GMT

ఐపీఎల్‌లో కెప్టెన్సీ కుర్చీ కోసం పోటీ.. వేలానికి ముందే ఐదు జట్లలో హాట్ టాపిక్

2026-11-18 09:54 GMT

బ్రేకింగ్ : ఐపీఎల్ కు ధోని రిటైర్ మెంట్.. ఇక సీఎస్కే లో ఈ కొత్త రోల్..

2026-11-17 10:33 GMT

పాక్ పనిపట్టిన గుంటూరు కుర్రోడు.. విజయ సుభాష్ ఫుల్ స్టోరీ ఇదే..

2026-11-15 20:25 GMT

అండర్-19 ఆసియా కప్ 2026: వారెవ్వా! ఇదిరా కిక్కిచ్చే విక్ట‌రీ అంటే.. గ్రేట్ ఇండియా!

2026-11-14 16:38 GMT

న్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోర ఓటమి.. 89 పరుగులకే చాపచుట్టేసిన టీమిండియా!

2026-11-13 10:19 GMT

రూ.10 లక్షల నుంచి రూ.18 కోట్లకు.. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా?

2026-11-13 06:53 GMT

తోపు క్రికెటర్ అయినా.. పబ్లిక్ లో భార్యకు గజగజ వణికిపోయాడు.. వైరల్ వీడియో

2026-11-12 19:30 GMT

ఇది భారత చెస్ స్వర్ణయుగానికి అసలైన బలమైన ఆరంభం

2026-11-10 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS