దిల్లీ విజయానికి రాహుల్ మెరుపులు.. కొత్త రికార్డుతో హైలైట్

భారత స్టార్ బ్యాటర్, క్లాస్ అండ్ మాస్ ఆటతీరుకు మారుపేరుగా నిలిచే కేఎల్ రాహుల్ ఐపీఎల్ చరిత్రలో ఒక అరుదైన మైలురాయిని అధిగమించారు.;

Update: 2026-05-02 07:26 GMT

భారత స్టార్ బ్యాటర్, క్లాస్ అండ్ మాస్ ఆటతీరుకు మారుపేరుగా నిలిచే కేఎల్ రాహుల్ ఐపీఎల్ చరిత్రలో ఒక అరుదైన మైలురాయిని అధిగమించారు. ఐపీఎల్‌లో ఓపెనర్‌గా ఆడుతూ 200 కంటే ఎక్కువ సిక్సర్లు బాదిన తొలి భారతీయ క్రికెటర్‌గా రాహుల్ చరిత్ర సృష్టించారు. తన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను వణికించడమే కాకుండా గణాంకాల పరంగా కూడా తనేంటో మరోసారి ప్రపంచానికి చాటిచెప్పారు.

ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం.. రాహుల్ విశ్వరూపం

ఇటీవల రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. వరుసగా మూడు పరాజయాలతో ప్లే ఆఫ్స్ ఆశలు క్లిష్టమవుతున్న తరుణంలో ఢిల్లీ జట్టు సమిష్టిగా పోరాడి విజయం సాధించింది. రాజస్థాన్ నిర్దేశించిన 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ ఛేదించడం ఆ ఫ్రాంచైజీ చరిత్రలోనే అత్యుత్తమ విజయాల్లో ఒకటిగా నిలిచింది.

ఈ భారీ ఛేదనలో కెప్టెన్ కేఎల్ రాహుల్ ముందుండి నడిపించారు. కేవలం ఫోర్లతోనే కాకుండా మైదానం నలుమూలలా సిక్సర్ల వర్షం కురిపించి 75 పరుగులు సాధించారు. జట్టును గెలుపు తీరాలకు చేర్చడమే కాకుండా, తన అద్భుత ఇన్నింగ్స్‌కు గానూ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును కూడా అందుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన తన 200వ ఐపీఎల్ సిక్సర్‌ను (ఓపెనర్‌గా) నమోదు చేయడం విశేషం.

ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానం

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాహుల్ ఫామ్ అసాధారణంగా ఉంది. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌లలో 433 పరుగులు చేసి, ప్రస్తుతం అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఆరెంజ్ క్యాప్‌ను దక్కించుకున్నారు. అతని గణాంకాలు చూస్తే రాహుల్ ఎంతటి స్థిరత్వాన్ని ప్రదర్శిస్తున్నారో అర్థమవుతుంది. సగటు.. 50.01.. స్ట్రైక్ రేట్ 141.38.. మొత్తం పరుగులు ఓపెనర్‌గా 4,851.. మొత్తం సిక్సర్లు (ఓపెనర్‌గా) 203 గా ఉన్నాయి. కేవలం దూకుడుగానే కాకుండా ఇన్నింగ్స్‌ను నిర్మించడంలో రాహుల్ చూపిస్తున్న పరిపక్వత అతడిని ప్రస్తుత తరం ఎలైట్ బ్యాటర్లలో ఒకడిగా నిలబెడుతోంది.

దిగ్గజాల సరసన రాహుల్

ఐపీఎల్ చరిత్రలో ఓపెనర్‌గా 200 సిక్సర్ల మైలురాయిని చేరిన జాబితాలో రాహుల్ కంటే ముందు కేవలం ఇద్దరు విదేశీ ఆటగాళ్లు మాత్రమే ఉన్నారు. క్రిస్ గేట్ 326 సిక్సర్లు, డేవిడ్ వార్నర్ 210 సిక్సర్లుతో ఉన్నారు. ప్రస్తుతం రాహుల్ 203 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నారు. డేవిడ్ వార్నర్ రికార్డుకు ఆయన కేవలం 8 సిక్సర్ల దూరంలో మాత్రమే ఉన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇంకా ఐదు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ సీజన్ ముగిసేలోపు రాహుల్ రెండో స్థానానికి చేరుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News