ఆఫ్రిది కుక్క మాంసం తిని మొరిగాడు... టీమ్ ఇండియా మాజీ ఆల్ రౌండర్
మాజీ కెప్టెన్ ధోనీ కారణంగానే తన కెరీర్ నాశమైందని నిన్న సంచలన ఆరోపణలు చేసిన టీమ్ ఇండియా మాజీ ఆల్ రౌండర్.. నేడు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదిపై మరింత తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు.;
మాజీ కెప్టెన్ ధోనీ కారణంగానే తన కెరీర్ నాశమైందని నిన్న సంచలన ఆరోపణలు చేసిన టీమ్ ఇండియా మాజీ ఆల్ రౌండర్.. నేడు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదిపై మరింత తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. అసలే పాకిస్థాన్ క్రికెటర్.. ఆపై వ్యక్తిగతంగా తనను ఇబ్బంది పెట్టడంతో భారత ఆల్ రౌండర్ కు చిర్రెత్తిందట. ఈ విషయాన్ని అతడు ఓ పాడ్ కాస్ట్ లో చెప్పాడు.
విమానంలో కోతి పనులు...
టీమ్ ఇండియా మాజీ ఆల్ రౌండర్, కామెంటేటర్ గా మారిన ఇర్ఫాన్ పఠాన్ పొరుగు దేశం క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది గురించి తీవ్ర విమర్శలు చేశాడు. 2006లో టీమ్ ఇండియా పాకిస్థాన్ లో పర్యటించింది. ఆ టూర్ లో కరాచీ నుంచి భారత జట్టు లాహోర్ కు వెళ్తుండంగా.. ఇర్ఫాన్ పఠాన్ ను ఆఫ్రిది విసిగించాడట. ఇర్ఫాన్ జుట్టును చెరిపేసి హాయ్.. కిడ్ ఎలా ఉన్నావ్? అని అడిగాడట. అతడు చేసిన పనికి చిర్రెత్తిన ఇర్ఫాన్.. నువ్వెప్పటి నుంచి నాకు తండ్రి అయ్యావ్? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడట.
అతడేమైనా నాకు స్నేహితుడా?
ఆఫ్రిది పిల్ల చేష్టలకు తనకు తీవ్రమైన కోపం వచ్చిందని.. అతడు తనకు కనీసం స్నేహితుడు కూడా కాదని ఇర్ఫాన్ పేర్కొన్నాడు. తాను తిరగబడేసరికి ఆఫ్రిది నోటికి పని కల్పించి దూషించాడని తెలిపాడు. పైగా విమానంలో తన పక్క సీటు ఆఫ్రిదిదేనని ఇర్ఫాన్ చెప్పాడు. **నా మరోపక్క సీటులో ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ ఉన్నాడు. దీంతో అతడిని ఇక్కడ ఏమేం రకాల మాంసం దొరుకుతుందని అడిగాను. అతడు కొన్ని రకాల మాంసాల పేర్లు చెప్పాడు. అయితే, కుక్కు మాంసం దొరుకుతుందా? అని అడిగాను. రజాక్ షాక్ అయి.. ఎందుకిలా అడుగుతున్నావ్? అని ప్రశ్నించాడు. దీంతో.. ఆఫ్రిది కుక్క మాంసం తిన్నట్లున్నాడు. అందుకే చాలాసేపటి నుంచి మొరుగుతున్నాడు** అని చెప్పాను. నా వ్యాఖ్యల అనంతరం ఆఫ్రిది మళ్లీ నోరెత్తలేదని.. తనతో మాట్లాడేందుకు ప్రయత్నించలేదని ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు. అతడు ఏది మాట్లాడినా మొరుగుతున్నాడని అనే వాడినని.. దీంతో తనతో గెలవలేనని అర్థమై ఊరికే ఉండిపోయాడని ఇర్ఫాన్ చెప్పాడు.