• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Sports >  ఐపీఎల్ టైటిల్ కొట్టని...

ఐపీఎల్ టైటిల్ కొట్టని జట్ల మధ్య రేపే క్వాలిఫయర్స్.. చరిత్ర ఎవరివైపు?

| మొదటి నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడుతూ ఇప్పటివరకు టైటిల్ కొట్టని జట్లు పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.

By - Tupaki Desk
Update: 2025-05-28 13:18 GMT

మొదటి నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడుతూ ఇప్పటివరకు టైటిల్ కొట్టని జట్లు పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఈ సారి మాత్రం లీగ్ దశలో టాప్-2లో వచ్చి చాంపియన్ గా నిలిచే ఊపులో కనిపిస్తున్నాయి. గురువారం ఈ రెండు జట్ల మధ్య క్వాలిఫయర్-1 జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు వెళ్తుంది. ఓడిన జట్టుకు ఎలిమినేటర్ విజేతతో క్వాలిఫయర్-2 ఆడుతుంది.

ఇప్పటివరకు 18 సీజన్లలో బెంగళూరు-పంజాబ్ 35 సార్లు తలపడ్డాయి. ఎవరు గెలిచారు అని చూస్తే.. సమఉజ్జీలే అనిపిస్తుంది. బెంగళూరు 17 సార్లు నెగ్గగా, పంజాబ్ 18 సార్లు గెలిచింది. పంజాబ్ పై ఆర్సీబీ అత్యధిక స్కోరు 241 కాగా.. ఆర్సీబీపై పంజాబ్ హయ్యస్ట్ స్కోర్ 232 కావడం గమనార్హం. పంజాబ్ పై ఆర్సీబీ అత్యల్ప స్కోరు 84 అయితే.. ఆర్సీబీపై పంజాబ్ లోయస్ట్ స్కోర్ 88.

ప్రస్తుత సీజన్ లో రెండు జట్లూ మంచి ఫామ్ లో ఉండగా.. రెండూ కొత్త కెప్టెన్లు (బెంగళూరుకు రజత్ పటీదార్, పంజాబ్ కు శ్రేయస్ అయ్యర్)తోనే బరిలో దిగడం విశేషం. ఇక ఈ సీజన్ లో రెండుసార్లు తలపడిన ఈ జట్లు చెరో మ్యాచ్ నెగగ్యి. అది కూడా ప్రత్యర్థి వేదికలో కావడం మరో చిత్రం. బెంగళూరు సొంతగడ్డ చిన్నస్వామి మైదానంలో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. పంజాబ్ సొంత మైదానం ముల్లాన్ పూర్ లో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు ఏడు వికెట్లతో విజయం సాధించింది.

ఈ సీజన్ లో ముచ్చటగా మూడోసారి గురువారం జరగబోయే క్వాలిఫయర్-1లో బెంగళూరు-పంజాబ్ తలపడుతున్నాయి. మరి ఇందులో విజేత ఎవరో? తెలియాలంటే గురువారం రాత్రి వరకు ఆగాల్సిందే.

కొసమెరుపు: పంజాబ్ చివరిసారిగా పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచి 2014లో ఐపీఎల్ ప్లే ఆఫ్స్ చేరింది. అదే ఏడాది ఫైనల్స్ కూ వెళ్లింది. కానీ, కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడింది.

Tags:    
  • IPL2025 
  • PunjabKings 
  • RCB 
  • Qualifier1 
  • IPLPlayoffs 
  • Cricket 
  • RoyalChallengersBangalore 
  • CricketRivalry 

Similar News

దిగ్గజాల వీడ్కోలు.. 2026 క్రీడాభిమానులకు ఓ చేదు జ్ఞాపకం..

2026-11-18 10:02 GMT

ఐపీఎల్‌లో కెప్టెన్సీ కుర్చీ కోసం పోటీ.. వేలానికి ముందే ఐదు జట్లలో హాట్ టాపిక్

2026-11-18 09:54 GMT

బ్రేకింగ్ : ఐపీఎల్ కు ధోని రిటైర్ మెంట్.. ఇక సీఎస్కే లో ఈ కొత్త రోల్..

2026-11-17 10:33 GMT

పాక్ పనిపట్టిన గుంటూరు కుర్రోడు.. విజయ సుభాష్ ఫుల్ స్టోరీ ఇదే..

2026-11-15 20:25 GMT

అండర్-19 ఆసియా కప్ 2026: వారెవ్వా! ఇదిరా కిక్కిచ్చే విక్ట‌రీ అంటే.. గ్రేట్ ఇండియా!

2026-11-14 16:38 GMT

న్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోర ఓటమి.. 89 పరుగులకే చాపచుట్టేసిన టీమిండియా!

2026-11-13 10:19 GMT

రూ.10 లక్షల నుంచి రూ.18 కోట్లకు.. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా?

2026-11-13 06:53 GMT

తోపు క్రికెటర్ అయినా.. పబ్లిక్ లో భార్యకు గజగజ వణికిపోయాడు.. వైరల్ వీడియో

2026-11-12 19:30 GMT

ఇది భారత చెస్ స్వర్ణయుగానికి అసలైన బలమైన ఆరంభం

2026-11-10 11:30 GMT

ఐపీఎల్ లో మరో రెండు జట్లు.. 10 నుంచి 12కు పెరగనున్న టీమ్‌ల సంఖ్య? బీసీసీఐ మాస్టర్ ప్లాన్ ఇదేనా?

2026-11-10 10:30 GMT

భారత్ తో క్రికెట్ ఆడకపోతే దివాళా తీయాల్సిందే.. ఇంగ్లండ్ పరిస్థితి అదే..

2026-11-09 04:25 GMT

శాండ్ పేపర్ వివాదం.. ఆస్ట్రేలియా క్రికెట్ లో మంటపెట్టిన ఉస్మాన్ ఖవాజా

2026-11-07 08:22 GMT

Copyright @2026

Powered by Blink CMS