• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Sports >  వరుసగా దిగ్గజాల...

వరుసగా దిగ్గజాల రిటైర్మెంట్లు.. టీమ్ ఇండియాలో అసలు ఏం జరుగుతోంది?

| దీంతో అసలు టీమ్ ఇండియాలో ఏం జరుగుతోంది? అనే చర్చ మొదలైంది. వాస్తవానికి కోహ్లి ఫామ్, ఫిట్ నెస్ బాగున్నాయి. స్వదేశంలో న్యూజిలాండ్ లో విఫలమైనా ఆస్ట్రేలియాలో మోస్తరుగా ఆడిన కోహ్లి.. ఆ తర్వాత గాడినపడ్డాడు.

By - Tupaki Desk
Update: 2025-05-12 14:30 GMT

ఆస్ట్రేలియాతో ఆస్ట్రేలియాలో బోర్డర్-గావస్కర్ టెస్టు సిరీస్ జరుగుతుండగానే సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్..

మరొక్క నెల రోజుల్లో ఇంగ్లండ్ తో ఇంగ్లండ్ లో కీలకమైన ఐదు టెస్టుల సిరీస్ ఉందనగా కెప్టెన్ రోహిత్ శర్మ వీడ్కోలు..

రోహిత్ లేని నేపథ్యంలో మరింత బాధ్యత మీద పడిన టీమ్ ఇండియా బ్యాటింగ్ మూల స్తంభం విరాట్ కోహ్లి కూడా రిటైర్మెంట్..

దీంతో అసలు టీమ్ ఇండియాలో ఏం జరుగుతోంది? అనే చర్చ మొదలైంది. వాస్తవానికి కోహ్లి ఫామ్, ఫిట్ నెస్ బాగున్నాయి. స్వదేశంలో న్యూజిలాండ్ లో విఫలమైనా ఆస్ట్రేలియాలో మోస్తరుగా ఆడిన కోహ్లి.. ఆ తర్వాత గాడినపడ్డాడు. ప్రస్తుత ఐపీఎల్ లో అదరగొడుతున్నాడు.

టి20ల నుంచి ఏడాది కిందటే వైదొలగినందున.. వన్డేలు ఎలాగూ చాలా తక్కువే కాబట్టి.. తాను ఎంతో టెస్టు క్రికెట్ కు కోహ్లి ఇంత త్వరగా రిటైర్మెంట్ ఇస్తాడని ఎవరూ భావించలేదు. కానీ, అనూహ్యంగా ప్రకటన చేసేశాడు.

రిటైర్మెంట్ పై మూడు రోజుల కిందటే ఊహాగానాలు వచ్చినా.. సీనియర్లు, క్రికెట్ నిపుణులు వద్దని వారిస్తున్నా కోహ్లి నిర్ణయం తీసేసుకున్నాడు.

ఈ రిటైర్మెంట్లనీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వచ్చాకే జరగడం గమనార్హం.

ఏమంటాడో గంభీర్..??

ఆటగాడిగా, వ్యక్తిగా గౌతమ్ గంభీర్ ను వంక పెట్టే పరిస్థితే లేదు. అయితే, టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా అతడు వచ్చాక జరుగుతున్న పరిణామాలే గంభీర్ తీరును చర్చనీయాంశం చేస్తున్నాయి.

వాస్తవానికి రోహిత్ సంగతి చెప్పలేకున్నా అశ్విన్ మరొక ఏడాది, కోహ్లి మరొక రెండేళ్లు అయినా ఆడేవారేమో..? కానీ, రిటైర్మెంట్ ఇచ్చేశారు. ఈ విషయంలో గంభీర్ ఒత్తిడి ఉందా? అనే ప్రశ్న వస్తోంది.

ఒకవేళ గంభీర్ కోణంలోనే చూస్తే.. జూన్ లో ఇంగ్లండ్ తో సిరీస్ నుంచి మొదలయ్యే ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ మరో రెండేళ్లు జరుగుతుంది. దీనికోసం తనదైన మార్క్ జట్టును గంభీర్ సిద్ధం చేసుకుంటున్నాడా? అనిపిస్తోంది. ఒకవేల రోహిత్, అశ్విన్ వచ్చే టెస్టు చాంపియన్ షిప్ మొత్ కొనసాగడం కష్టమే. కోహ్లి మాత్రం ఆడే వీలుండేది. కానీ, గంభీర్ ఆలోచనలను పసిగట్టి.. ముందే రిటైర్మెంట్ ఇచ్చేస్తే పోలా? అనుకున్నారో ఏమో?

Tags:    
  • IndianCricket 
  • AshwinRetirement 
  • RohitSharmaRetirement 
  • ViratKohliRetirement 
  • GautamGambhir 
  • TeamIndia 
  • TestCricket 
  • BorderGavaskar 
  • CricketUpdates 
  • TeamIndiaPlayers 
  • BCCI 

Similar News

దిగ్గజాల వీడ్కోలు.. 2026 క్రీడాభిమానులకు ఓ చేదు జ్ఞాపకం..

2026-11-18 10:02 GMT

ఐపీఎల్‌లో కెప్టెన్సీ కుర్చీ కోసం పోటీ.. వేలానికి ముందే ఐదు జట్లలో హాట్ టాపిక్

2026-11-18 09:54 GMT

బ్రేకింగ్ : ఐపీఎల్ కు ధోని రిటైర్ మెంట్.. ఇక సీఎస్కే లో ఈ కొత్త రోల్..

2026-11-17 10:33 GMT

పాక్ పనిపట్టిన గుంటూరు కుర్రోడు.. విజయ సుభాష్ ఫుల్ స్టోరీ ఇదే..

2026-11-15 20:25 GMT

అండర్-19 ఆసియా కప్ 2026: వారెవ్వా! ఇదిరా కిక్కిచ్చే విక్ట‌రీ అంటే.. గ్రేట్ ఇండియా!

2026-11-14 16:38 GMT

న్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోర ఓటమి.. 89 పరుగులకే చాపచుట్టేసిన టీమిండియా!

2026-11-13 10:19 GMT

రూ.10 లక్షల నుంచి రూ.18 కోట్లకు.. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా?

2026-11-13 06:53 GMT

తోపు క్రికెటర్ అయినా.. పబ్లిక్ లో భార్యకు గజగజ వణికిపోయాడు.. వైరల్ వీడియో

2026-11-12 19:30 GMT

ఇది భారత చెస్ స్వర్ణయుగానికి అసలైన బలమైన ఆరంభం

2026-11-10 11:30 GMT

ఐపీఎల్ లో మరో రెండు జట్లు.. 10 నుంచి 12కు పెరగనున్న టీమ్‌ల సంఖ్య? బీసీసీఐ మాస్టర్ ప్లాన్ ఇదేనా?

2026-11-10 10:30 GMT

భారత్ తో క్రికెట్ ఆడకపోతే దివాళా తీయాల్సిందే.. ఇంగ్లండ్ పరిస్థితి అదే..

2026-11-09 04:25 GMT

శాండ్ పేపర్ వివాదం.. ఆస్ట్రేలియా క్రికెట్ లో మంటపెట్టిన ఉస్మాన్ ఖవాజా

2026-11-07 08:22 GMT

Copyright @2026

Powered by Blink CMS