డూ ఆర్ డై: మన అమ్మాయిలు అదరగొట్టారు.. సెమీస్ చేరారు
ప్రారంభంలోనే టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత మహిళల జట్టు వరల్డ్ కప్‌లో ఊహించని రీతిలో తడబడింది.;
ప్రారంభంలోనే టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత మహిళల జట్టు వరల్డ్ కప్‌లో ఊహించని రీతిలో తడబడింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లతో వరుసగా మూడు పరాజయాలు ఎదుర్కొన్న టీమ్ ఇండియా పరిస్థితి కఠినంగా మారింది. అభిమానులలో నిరాశ ఆవరించింది.
అయితే నిన్న న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ అద్భుత ప్రదర్శనతో తిరిగి ఫామ్‌లోకి వచ్చింది. బ్యాట్-బాల్ రెండింట్లోనూ మెరుస్తూ సంపూర్ణ ఆధిపత్యాన్ని చాటింది. మొదట బ్యాటింగ్‌కి వచ్చిన భారత్ 49 ఓవర్లలో 340 పరుగులు సాధించి భారీ లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందు ఉంచింది. బ్యాటర్లంతా సమష్టిగా రాణించి పటిష్టమైన పునాది వేశారు.
మరుసటి ఇన్నింగ్స్‌లో వర్షం అంతరాయం కలిగించినా, భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి కివీస్ జట్టును నియంత్రించారు. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ, పరుగులు ఇవ్వకుండా కట్టడి చేశారు. చివరికి భారత్ 57 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో భారత్ నాకౌట్ దశకు అర్హత సాధించింది. క్లిష్ట పరిస్థితుల్లో సాధించిన ఈ విజయం జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది.
ఇప్పుడు భారత్ సెమీఫైనల్‌లో నంబర్ 1 ర్యాంక్ జట్టును ఎదుర్కోనుంది. అది ఆస్ట్రేలియా గానీ, దక్షిణాఫ్రికా గానీ కావొచ్చు.. ఈ రెండూ లీగ్ మ్యాచ్‌లలో భారత్‌ను ఓడించిన జట్లు కావడంతో ఈ పోరు చాలా కఠినంగా ఉండబోతోంది. లీగ్ దశలో ఎదురైన వైఫల్యాలను మరచి, మెరుగైన ప్రదర్శన చేస్తేనే ఫైనల్ చేరడం సాధ్యమవుతుంది.
ఫైనల్ నవంబర్ 2న జరగనుంది. లీగ్ దశలో ఎదురైన ఆటుపోట్ల తర్వాత కూడా భారత్ ట్రోఫీని ఎత్తిపట్టగలదా? నిన్నటి మ్యాచ్‌లో చూపిన తెగువ, పోరాటస్ఫూర్తిని కొనసాగిస్తే, కప్పు మనదే కావచ్చు అన్న ప్రశ్న ఇప్పుడు ప్రతి భారత అభిమానిలో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. భారత మహిళల జట్టు విజయపథంలోకి దూసుకుపోవాలని యావత్ దేశం ఆకాంక్షిస్తోంది.
టీమిండియా సెమీఫైనల్ రేసు.. లెక్కలు ఇవీ
అక్టోబర్ 23న జరగబోయే న్యూజిలాండ్ మ్యాచ్ లో టీమిండియా గెలించింది., దీంతో భారత్ అవకాశాలు మరింత మెరగయ్యాయి. ఎందుకంటే కివీస్ కూడా ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు పాయింట్లతోనే ఉన్నారు. ఇప్పుడు భారత్ 6 పాయింట్లతో ముందంజ వేసింది. ఈ సందర్భంలో భారత్ చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను తప్పక ఓడించాలి. అలాగే ఇంగ్లండ్ న్యూజిలాండ్‌ను ఓడిస్తే మాత్రమే భారత్ సెమీఫైనల్ దిశగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది.
* న్యూజిలాండ్ అవకాశాలు
న్యూజిలాండ్ కూడా ప్రస్తుతం అదే పరిస్థితిలో ఉంది. టీమిండియా వారిని ఓడించింది. కివీస్ తమ చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను తప్పక ఓడించాలి. అదీ కాక, బంగ్లాదేశ్‌తో భారత్ ఓడిపోవాలని వారు ఆశించాలి. ఈ రెండు పరిస్థితులు నిజమైతేనే న్యూజిలాండ్ సెమీఫైనల్ దిశగా అడుగుపెడుతుంది.
* శ్రీలంకకు ఉన్న ఆస్కారం
ఇక శ్రీలంక జట్టుకు కూడా సెమీఫైనల్ అవకాశాలు ఇంకా పూర్తిగా ముగిసిపోలేదు. అయితే వారి అర్హత ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంది. భారత్ తన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవాలని, అలాగే ఇంగ్లండ్ న్యూజిలాండ్‌ను ఓడించాలని వారు ఆశించాలి. ఈ నేపథ్యంలో, పాకిస్థాన్‌పై విజయం సాధిస్తే శ్రీలంకకు నాకౌట్ దశకు దారి తేలుతుంది.
అంటే, టీమిండియా, న్యూజిలాండ్, శ్రీలంక మూడు జట్లూ ఇప్పుడు చివరి దశలో గట్టిపోరాటం చేస్తున్నారు. రాబోయే కొన్ని మ్యాచ్‌లు ఎవరి వరల్డ్‌కప్ కలను సాకారం చేస్తాయో చూడాలి!