అద్భుతః... మహిళల వన్డే ప్రపంచకప్‌ సెమీస్ లో రఫ్ఫాడించిన భారత్!

ఈ సమయంలో భారత్ బ్యాటర్లు అంతకు మించిన అద్భుతాన్ని చేసి చూపించారు. 48.3 ఓవర్లలోనే (341/5) పని పూర్తి చేశారు.. ఫైనల్ లోకి దూసుకెళ్లారు. ఈ సందర్భంగా... జెమీమా పెర్ఫార్మెన్స్ సంచలనంగా మారింది.;

Update: 2025-10-30 17:23 GMT

'అద్భుతం జరిగే ముందు ఎవరూ గుర్తించరు.. జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు'. ఓ తెలుగు సినిమాలోని డైలాగ్ ఇది. మహిళల వన్డే ప్రపంచకప్ లో ఎంట్రీ ఇచ్చిన సమయంలో టీమిండియా ఉమన్స్ జట్టుపై అభిమానులు ఏ స్థాయిలో ఆశలు పెట్టుకున్నారో తెలియదు కానీ.. ప్రతీ మ్యాచ్ లోనూ మహిళా జట్టు తమ పోరాట ప్రతిభను చూపిస్తూనే వచ్చింది. ఫైనల్ గా ఆసిస్ ను మట్టికరిపించి ఫైనల్ కు చేరింది.

అవును... అసలే ప్రపంచకప్ మ్యాచ్.. పైగా ఈ టోర్నీలో ఆసిస్ అద్భుతమైన ప్రదర్శన చేస్తూ వస్తోన్న పరిస్థితి. అంచనాలకు తగ్గట్లుగానే, భారత అభిమానులు భయపడినట్లుగానే 338 పరుగుల భారీ స్కోరు చేసింది ఆసిస్. ఈ సమయంలో భారత్ బ్యాటర్లు అంతకు మించిన అద్భుతాన్ని చేసి చూపించారు. 48.3 ఓవర్లలోనే (341/5) పని పూర్తి చేశారు.. ఫైనల్ లోకి దూసుకెళ్లారు. ఈ సందర్భంగా... జెమీమా పెర్ఫార్మెన్స్ సంచలనంగా మారింది.

మహిళల వన్డే ప్రపంచకప్‌ లో భాగంగా రెండో సెమీఫైనల్‌ లో భారత్, ఆస్ట్రేలియా గురువారం తలబడ్డాయి. ఈ క్రమంలో... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసిస్ 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌటైంది. ఆసిస్ బ్యాటర్స్ లో ఓపెనర్ లీచ్ ఫీల్డ్.. 93 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్‌ ల సాయంతో 119 పరుగులు చేయగా.. ఎలీస్ పెర్రీ 88 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌ ల సాయంతో 77 పరుగులతోనూ.. ఆష్లీన్ గార్డ్‌ నర్ 45 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌ లతో 63 పరుగులు చేశారు.

అనంతరం ఛేజింగ్ కి దిగిన భారత్ మొదటి నుంచీ ఆధిపత్యం కొనసాగిస్తూనే ఉంది. వాస్తవానికి ఓపెనర్ షఫలీ వర్మ 10 పరుగుల వ్యక్తిగత పరుగులకే ఔటైనా.. మరోఐపు మరో ఓపెనర్ మందానాతో కలిసి జెమీమా రోడ్రిగ్స్ మ్యాచ్ ను ముందుకు నడిపించింది. ఈ క్రమంలో 24 వ్యక్తిగత పరుగుల వద్ద మందాన కూడా పెవిలియన్ బాట పట్టింది. ఆ తర్వాత మొదలైంది కీలక భాగస్వామ్యం దిశగా సాగిన జెమీమా – కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పెర్ఫార్మెన్స్!

వీరిద్దరూ మూడో వికెట్ కు 156 బంతుల్లో 167 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో 35.2 బంతికి హర్మన్ ప్రీత్ (88 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్ ల సాయంతో 89 పరుగులు) ఔటయ్యింది. ఆ తర్వాత బాటింగ్ కి వచ్చిన దీప్తి శర్మ (24), రిచా గోష్ (26) ధనాధన్ మనిపించగా... అమన్ జోత్ కౌర్ (15*) తో కలిసి జెమీమా తన అద్భుతమైన బ్యాటింగ్ (134 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 127* పరుగులు) తో భారత్ ను విజయతీరాలకు చేర్చింది.

ఇక భారత బౌలర్లలో శ్రీ చరణి, దీప్తి శర్మ తలో రెండేసి వికెట్లు పడగొట్టగా... క్రాంతి గౌడ్, అమన్‌ జ్యోత్ కౌర్, రాధా యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. ఇక... నవంబర్ 2న సౌతాఫ్రికాతో భారత్ ఫైనల్ లో తలపడనుంది.

Tags:    

Similar News