• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Sports >  సమీప భవిష్యత్ లో...

సమీప భవిష్యత్ లో పాకిస్థాన్ తో క్రికెట్ ఉండదు.. బీసీసీఐ సంచలనం

| ఎప్పుడో 2012-13లో జరిగింది భారత్-పాకిస్థాన్ మధ్య ముఖాముఖి క్రికెట్ సిరీస్.. అప్పటికి నాలుగేళ్ల ముందే ముంబై దాడులతో పాకిస్థాన్ తో సంబంధాలు క్షీణించాయి.

By - Tupaki Desk
Update: 2025-04-24 09:36 GMT

ఎప్పుడో 2012-13లో జరిగింది భారత్-పాకిస్థాన్ మధ్య ముఖాముఖి క్రికెట్ సిరీస్.. అప్పటికి నాలుగేళ్ల ముందే ముంబై దాడులతో పాకిస్థాన్ తో సంబంధాలు క్షీణించాయి. కానీ, క్రికెట్ విషయంలో నాటి యూపీఏ ప్రభుత్వం మాత్రం తీవ్ర నిర్ణయాలు తీసుకోలేదు. కాస్త ఉదారంగా వ్యవహరించడంతో 2012-13లో భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్ జరిగింది.

కానీ, ఆ తర్వాత రెండు దేశాల జట్లు తిరిగి ముఖాముఖి క్రికెట్ లో తలపడనే లేదు. అప్పుడప్పుడు ఈ మాట వినిపించినా ముందడుగు పడలేదు. చివరకు 2014లో మోదీ ప్రభుత్వం వచ్చాక అసలు చాన్సే లేకుండా పోయింది.

రెండు నెలల కిందట జరిగిన చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చింది. కానీ, ఆ టోర్నీకి భారత్ వెళ్లనే లేదు. దుబాయ్ లో మ్యాచ్ లు ఆడి అక్కడే టైటిల్ కొట్టింది.

ఇప్పుడు పెహల్గాం దాడి తర్వాత పరిస్థితులు ఇక చెప్పనలవి కానట్లుగా మారాయి. దీంతో సమీప భవిష్యత్ లో భారత్-పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం కష్టమే అని స్పష్టమైంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కూడా ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది.

భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ అనే మాట ఉండబోదని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తేల్చి చెప్పారు. ప్రస్తుతం భారత్-పాక్ కేవలం ఐసీసీ టోర్నీల (అంటే ప్రపంచ కప్ లు, చాంపియన్స్ ట్రోఫీ)లో మాత్రమే ఎదురుబొదురు ఆడుతున్నాయి. పహెల్గామ్ దాడి తర్వాత అసలు ద్వైపాక్షిక సిరీస్ లే ఉండబోవని స్పష్టం అవుతోంది.

Tags:    
  • IndiaVsPakistan 
  • BCCI 
  • CricketPolitics 
  • NoBilateralSeries 
  • PahalgamAttack 
  • RajeevShukla 
  • CricketNews 
  • IndPakRivalry 
  • SportsAndPolitics 
  • BilateralSeries 
  • RajivShukla 

Similar News

దిగ్గజాల వీడ్కోలు.. 2026 క్రీడాభిమానులకు ఓ చేదు జ్ఞాపకం..

2026-11-18 10:02 GMT

ఐపీఎల్‌లో కెప్టెన్సీ కుర్చీ కోసం పోటీ.. వేలానికి ముందే ఐదు జట్లలో హాట్ టాపిక్

2026-11-18 09:54 GMT

బ్రేకింగ్ : ఐపీఎల్ కు ధోని రిటైర్ మెంట్.. ఇక సీఎస్కే లో ఈ కొత్త రోల్..

2026-11-17 10:33 GMT

పాక్ పనిపట్టిన గుంటూరు కుర్రోడు.. విజయ సుభాష్ ఫుల్ స్టోరీ ఇదే..

2026-11-15 20:25 GMT

అండర్-19 ఆసియా కప్ 2026: వారెవ్వా! ఇదిరా కిక్కిచ్చే విక్ట‌రీ అంటే.. గ్రేట్ ఇండియా!

2026-11-14 16:38 GMT

న్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోర ఓటమి.. 89 పరుగులకే చాపచుట్టేసిన టీమిండియా!

2026-11-13 10:19 GMT

రూ.10 లక్షల నుంచి రూ.18 కోట్లకు.. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా?

2026-11-13 06:53 GMT

తోపు క్రికెటర్ అయినా.. పబ్లిక్ లో భార్యకు గజగజ వణికిపోయాడు.. వైరల్ వీడియో

2026-11-12 19:30 GMT

ఇది భారత చెస్ స్వర్ణయుగానికి అసలైన బలమైన ఆరంభం

2026-11-10 11:30 GMT

ఐపీఎల్ లో మరో రెండు జట్లు.. 10 నుంచి 12కు పెరగనున్న టీమ్‌ల సంఖ్య? బీసీసీఐ మాస్టర్ ప్లాన్ ఇదేనా?

2026-11-10 10:30 GMT

భారత్ తో క్రికెట్ ఆడకపోతే దివాళా తీయాల్సిందే.. ఇంగ్లండ్ పరిస్థితి అదే..

2026-11-09 04:25 GMT

శాండ్ పేపర్ వివాదం.. ఆస్ట్రేలియా క్రికెట్ లో మంటపెట్టిన ఉస్మాన్ ఖవాజా

2026-11-07 08:22 GMT

Copyright @2026

Powered by Blink CMS