• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Sports >  మీరు రాకుంటే ఎంత? వస్తే...

మీరు రాకుంటే ఎంత? వస్తే ఎంత? పాక్ కు హర్భజన్ గట్టి కౌంటర్

| ‘‘సరే.. మా దేశంలో జరిగే చాంపియన్స్ ట్రోఫీకి భారత్ రాకపోయినా ఫర్లేదు. ఆ దేశపు జట్టు ఆడే మ్యాచ్ లు ఇతర దేశంలో నిర్వహించుకోవచ్చు.

By - Tupaki Desk
Update: 2024-12-03 09:08 GMT

‘‘సరే.. మా దేశంలో జరిగే చాంపియన్స్ ట్రోఫీకి భారత్ రాకపోయినా ఫర్లేదు. ఆ దేశపు జట్టు ఆడే మ్యాచ్ లు ఇతర దేశంలో నిర్వహించుకోవచ్చు. కానీ, భవిష్యత్ లో భారత్ లో జరిగే టోర్నీల్లో మా జట్టు పాల్గొనదు. మీరు కూడా మమ్మల్ని ఒత్తిడి చేయొద్దు’’ ఇదీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పెట్టిన షరతు.

ఇదెక్కడి విడ్డూరం..

పాకిస్థాన్ లో భారత్ ఎందుకు పర్యటించడం లేదు..? ఆ దేశం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని.. ఆ దేశంలో శాంతిభద్రతలు సరిగా లేవని..కానీ, భారత్ లో అలాంటి పరిస్థితి లేదు. అనేక మెగా టోర్నీలు సక్సెస్ ఫుల్ గా జరిగాయి. అయితే, భారత్ తమ దేశానికి రావడం లేదని.. పాకిస్థాన్ కూడా భారత్ లో పర్యటించకూడదనుకోవడమే విడ్డూరం.

హైబ్రిడ్ కు ఓకే.. కానీ..

వచ్చే ఫిబ్రవరిలో పాకిస్థాన్ లో చాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. భారత్ రాననడంతో నిర్వహణ సందిగ్ధంలో పడింది. దీంతో హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించడానికి అంగీకరిస్తూనే పాక్ మెలిక పెట్టింది. దీనిపై ఆ దేశ క్రికెట్ బోర్డుకు భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్ దీటైన కౌంటర్ ఇచ్చాడు. ఇష్టం ఉంటేనే భారత్ కు రండి.. లేదంటే మానుకోండి.. మాకేం బాధ లేదు అంటూ తేల్చిచెప్పాడు.

అంతేకాదు పాక్ జట్టు రాకపోతే పెద్దగా ఎవరూ పట్టించుకోరని.. క్రికెటర్లను అడిగినా ఇదే చెప్తారన్నాడు. పాక్‌ లో పరిస్థితి భిన్నంగా ఉంటే భారత్ కూడా అందుకుతగ్గ నిర్ణయం తీసుకునేదన్నాడు. మొండి వైఖరి వీడి టోర్నీ జరిగేలా చూడాలని.. ఎలాగూ మీరు దానిని ఆపలేరని వివరించాడు. శ్రీలంకతో పాటు మలేసియా వంటి దేశాలు చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నాయన్నాడు.

మీ దేశంలో ఆతిథ్యం అపూర్వం

కాగా, పాకిస్థాన్ లో 2004, 2006లో పర్యటించాడు హర్భజన్. ఆ సమయంలో అద్భుత ఆతిథ్యం దక్కిందన్నాడు. బయట భోజనం చేసిన ప్రతిసారీ వారు డబ్బులు తీసుకోలేదన్నాడు. కొందరు శాలువాలు బహుమతిగా ఇచ్చారని తెలిపాడు. కోహ్లితో పాటు స్టార్‌ ఆటగాళ్లను పాక్ అభిమానులు ప్రత్యక్షంగా చూడలేకపోతున్నారని, తనకు చాలా బాధగా ఉందన్నాడు. ఇది పాక్ అభిమానుల తప్పు కాదని పాకిస్థాన్ లోని పరిస్థితుల ప్రభావం అని వివరించాడు.

Tags:    
  • Harbhajansingh 
  • Bcci 
  • Teamindia 
  • Championstrophy2025 
  • PCB 
  • Pakistan 
  • Rohitsharma 
  • Viratkohli 
  • Hybridmodel 

Similar News

దిగ్గజాల వీడ్కోలు.. 2026 క్రీడాభిమానులకు ఓ చేదు జ్ఞాపకం..

2026-11-18 10:02 GMT

ఐపీఎల్‌లో కెప్టెన్సీ కుర్చీ కోసం పోటీ.. వేలానికి ముందే ఐదు జట్లలో హాట్ టాపిక్

2026-11-18 09:54 GMT

బ్రేకింగ్ : ఐపీఎల్ కు ధోని రిటైర్ మెంట్.. ఇక సీఎస్కే లో ఈ కొత్త రోల్..

2026-11-17 10:33 GMT

పాక్ పనిపట్టిన గుంటూరు కుర్రోడు.. విజయ సుభాష్ ఫుల్ స్టోరీ ఇదే..

2026-11-15 20:25 GMT

అండర్-19 ఆసియా కప్ 2026: వారెవ్వా! ఇదిరా కిక్కిచ్చే విక్ట‌రీ అంటే.. గ్రేట్ ఇండియా!

2026-11-14 16:38 GMT

న్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోర ఓటమి.. 89 పరుగులకే చాపచుట్టేసిన టీమిండియా!

2026-11-13 10:19 GMT

రూ.10 లక్షల నుంచి రూ.18 కోట్లకు.. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా?

2026-11-13 06:53 GMT

తోపు క్రికెటర్ అయినా.. పబ్లిక్ లో భార్యకు గజగజ వణికిపోయాడు.. వైరల్ వీడియో

2026-11-12 19:30 GMT

ఇది భారత చెస్ స్వర్ణయుగానికి అసలైన బలమైన ఆరంభం

2026-11-10 11:30 GMT

ఐపీఎల్ లో మరో రెండు జట్లు.. 10 నుంచి 12కు పెరగనున్న టీమ్‌ల సంఖ్య? బీసీసీఐ మాస్టర్ ప్లాన్ ఇదేనా?

2026-11-10 10:30 GMT

భారత్ తో క్రికెట్ ఆడకపోతే దివాళా తీయాల్సిందే.. ఇంగ్లండ్ పరిస్థితి అదే..

2026-11-09 04:25 GMT

శాండ్ పేపర్ వివాదం.. ఆస్ట్రేలియా క్రికెట్ లో మంటపెట్టిన ఉస్మాన్ ఖవాజా

2026-11-07 08:22 GMT

Copyright @2026

Powered by Blink CMS