• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Sports >  చెస్ ప్రపంచ చాంపియన...

చెస్ ప్రపంచ చాంపియన గుకేశ్.. చెన్నైలో స్థిరపడ్డ తూర్పుగోదావరి బిడ్డ

| ప్రపంచ చదరంగంలో సరికొత్త శకం మొదలైంది. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత భారత్ నుంచి మరో ప్రపంచ చాంపియన్ ఎప్పుడా? అనే ఎదురుచూపులకు తెరపడింది

By - Tupaki Desk
Update: 2024-12-12 17:23 GMT

ప్రపంచ చదరంగంలో సరికొత్త శకం మొదలైంది. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత భారత్ నుంచి మరో ప్రపంచ చాంపియన్ ఎప్పుడా? అనే ఎదురుచూపులకు తెరపడింది. అది కూడా కేవలం 18 ఏళ్ల యువకుడితో సాధ్యమైంది.. ఆ కుర్రాడే గుకేశ్ దొమ్మరాజు. అన్నిటికంటే ముఖ్యమైనది అతడు తెలుగోడు..

తండ్రి డాక్టర్..

చెస్‌ ప్రపంచంలో ఇప్పుడు గుకేశ్ దొమ్మరాజు పేరు మార్మోగుతోంది. దీంతో ఇతడు ఎవరా? అని వెదికితే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వారి కుమారుడని తెలిసింది. గుకేశ్ 2006 మే 29న పుట్టాడు. తమిళనాడు రాజధాని చెన్నైలో స్థిరపడిన తెలుగు కుటుంబం వీరింది. గుకేశ్ తల్లిదండ్రులు ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందినవారు. గుకేష్ తండ్రి, రజనీకాంత్ సర్జన్ కాగా తల్లి పద్మ మైక్రోబయాలజిస్ట్.

11 ఏళ్లలో ప్రపంచ చాంపియన్..

గుకేశ్ కు ఏడేళ్ల వయసు ఉన్నప్పడు చెస్ ఆడడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత 11 ఏళ్లలోనే అతడు ప్రపంచ చాంపియన్ అయ్యాడు. 2015లో జరిగిన ఆసియా స్కూల్ చెస్ ఛాంపియన్‌ షిప్‌ లో అండర్-9 విభాగంలో, 2018లో ప్రపంచ యూత్ చెస్ ఛాంపియన్‌ షిప్ అండర్ 12 విభాగంలో విజేతగా నిలిచాడు. 2018 ఆసియా యూత్ చెస్ ఛాంపియన్‌ షిప్‌ లలో ఐదు బంగారు పతకాలను గెలుచుకున్నాడు. గుకేశ్ 2019 జనవరి 15న గ్రాండ్‌ మాస్టర్ అయ్యాడు. అప్పటికి అతడికి 12 సంవత్సరాల 7 నెలలు మాత్రమే. అప్పటికి చరిత్రలో రెండో అతి పిన్న వయసు గ్రాండ్ మాస్టర్. సెర్గీ కర్జాకిన్‌ ను అధిగమించిన గుకేశ్ నెలకొల్పిన ఈ రికార్డు 17 రోజులే నిలిచింది. అభిమన్యు మిశ్రా దీనిని బద్దలు కొట్టాడు. అయితే, తాజాగా గుకేశ్ ప్రపంచ చాంపియన్ గానూ నిలిచి చరిత్రకెక్కాడు. బహుశా దీనిని ఎవరూ బద్దలుకొట్టలేరు.

Tags:    
  • Indianchess 
  • Dommarajugukesh 
  • Dingliren 
  • Worldchesswinner 
  • Viswanathananand 
  • Gukesh 
  • Dommarajugukeshchess 
  • Worldchesschampion 
  • Dommarajugukeshdetails 
  • Dommarajugukeshfamily 

Similar News

దిగ్గజాల వీడ్కోలు.. 2026 క్రీడాభిమానులకు ఓ చేదు జ్ఞాపకం..

2026-11-18 10:02 GMT

ఐపీఎల్‌లో కెప్టెన్సీ కుర్చీ కోసం పోటీ.. వేలానికి ముందే ఐదు జట్లలో హాట్ టాపిక్

2026-11-18 09:54 GMT

బ్రేకింగ్ : ఐపీఎల్ కు ధోని రిటైర్ మెంట్.. ఇక సీఎస్కే లో ఈ కొత్త రోల్..

2026-11-17 10:33 GMT

పాక్ పనిపట్టిన గుంటూరు కుర్రోడు.. విజయ సుభాష్ ఫుల్ స్టోరీ ఇదే..

2026-11-15 20:25 GMT

అండర్-19 ఆసియా కప్ 2026: వారెవ్వా! ఇదిరా కిక్కిచ్చే విక్ట‌రీ అంటే.. గ్రేట్ ఇండియా!

2026-11-14 16:38 GMT

న్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోర ఓటమి.. 89 పరుగులకే చాపచుట్టేసిన టీమిండియా!

2026-11-13 10:19 GMT

రూ.10 లక్షల నుంచి రూ.18 కోట్లకు.. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా?

2026-11-13 06:53 GMT

తోపు క్రికెటర్ అయినా.. పబ్లిక్ లో భార్యకు గజగజ వణికిపోయాడు.. వైరల్ వీడియో

2026-11-12 19:30 GMT

ఇది భారత చెస్ స్వర్ణయుగానికి అసలైన బలమైన ఆరంభం

2026-11-10 11:30 GMT

ఐపీఎల్ లో మరో రెండు జట్లు.. 10 నుంచి 12కు పెరగనున్న టీమ్‌ల సంఖ్య? బీసీసీఐ మాస్టర్ ప్లాన్ ఇదేనా?

2026-11-10 10:30 GMT

భారత్ తో క్రికెట్ ఆడకపోతే దివాళా తీయాల్సిందే.. ఇంగ్లండ్ పరిస్థితి అదే..

2026-11-09 04:25 GMT

శాండ్ పేపర్ వివాదం.. ఆస్ట్రేలియా క్రికెట్ లో మంటపెట్టిన ఉస్మాన్ ఖవాజా

2026-11-07 08:22 GMT

Copyright @2026

Powered by Blink CMS