నవ్విపోదురుగాక.. ఆసియా కప్ ను హోటల్ కు ఎత్తుకెళ్లిన నఖ్వీ
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీఏ) అధ్యక్షుడు, పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి అయిన మొహిసిన్ నఖ్వీ చిన్న పిల్లల చేష్టలకు దిగాడు.;
బద్ధ శత్రువు భారత్ ఆసియా కప్ గెలిచిందనే కడుపు మంటో... తన చేతుల మీదుగా టీమ్ ఇండియా టైటిల్ తీసుకోలేదనే ఏడుపో.. మొత్తం ప్రపంచం ముందు పరువు పోయిందనే దుగ్ధనో ఏమో కానీ... పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీఏ) అధ్యక్షుడు, పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి అయిన మొహిసిన్ నఖ్వీ చిన్న పిల్లల చేష్టలకు దిగాడు. ఆడుకుంటూ ఆడుకుంటూ చిన్న పిల్లలు తమ స్నేహితులపై కోపంతో బొమ్మలను లేదా వస్తువులను ఇంటికి తీసుకెళ్లిపోతారు... ఇప్పుడు నఖ్వీ అలాంటి పనే చేశాడు. అంతపెద్ద పదవిలో ఉండి.. పాకిస్థాన్ లో మీడియా మొఘల్ గానూ పేరుగాంచిన నఖ్వీ చేసిన పని నవ్వులు తెప్పిస్తోంది.
భారత్ మొహం చాటేయడంతో మొహం మాడ్చేసి...
ఆసియా కప్ ను నీ పాకిష్టి చేతుల మీదుగా తీసుకునేది లేదు పో అంటూ టీమ్ ఇండియా ఫైనల్ల్ గెలుపు అనంతరం తేల్చిచెప్పడంతో మొహిసిన్ నఖ్వీ మొహం చిన్నబోయింది. గ్రౌండ్ లోనే ఉండి సిగ్గుతో కుమిలిపోయాడు. ఏం చేయాలో తెలియక బిక్క మొహం వేశాడు. చివరకు చేసేదేమీ లేక హోటల్ కు వెళ్లిపోయాడు. దీంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తీవ్రంగా స్పందించింది. మొహిసిన్ నఖ్వీవి పిల్ల చేష్టలు అంటూ ఎగతాళి చేశారు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా.
అతడికి ఆ హక్కు లేదు..
ఆసియా కప్ నే కాదు.. మెడల్స్ ను కూడా నఖ్వీ తన వెంట తీసుకెళ్లినట్లు బీసీసీఐ కార్యదర్శి సైకియా తెలిపారు. ఒకవేళ ఆసియా కప్ ట్రోఫీ మైదానంలోనే ఉంటే వేరే ఎవరో ఒకరు (ఆతిథ్య యూఏఈ బోర్డు వైస్ ప్రెసిడెంట్ ఖలీద్) చేతుల మీదుగా టీమ్ ఇండియా అందుకునే అవకాశం ఉంది. అందుకే నఖ్వీ పిల్ల చేష్టలకు దిగాడని బీసీసీఐ మండిపడింది. ఏసీఏ చైర్మన్ అయినప్పటికీ.. అతడికి ఆ హక్కు లేదని స్పష్టం చేసింది. ఎక్కడ ఖలీద్ నుంచి కప్ ను భారత్ అందుకుంటుందోనని నఖ్వీ కడుపు ఉబ్బి పోయింది.
అతడు పాక్ మంత్రి... పెహల్గా దాడి తెలిసే ఉంటుంది...
నఖ్వీది పెద్ద చరిత్రే..! అతడు పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి. అంటే.. అత్యంత కీలక పదవిలో ఉన్నాడు. అలాంటివాడికి పెహల్గాం ఉగ్రదాడి గురించి ముందే తెలిసి ఉంటుంది అనడంలో సందేహం లేదు. అందుకే పాక్ మంత్రి నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోకూడదని నిర్ణయించినట్లు సైకియా తెలిపారు. తనపతో వేదిక కూడా పంచుకోలేదని పేర్కొన్నారు. మేం ఆయన చేతుల మీదుగా తీసుకోవాలని అనుకోలేదు కానీ.. కప్ ను అసలు అందుకోకూడదని అనుకోలేదని స్పష్టం చేశారు.
ట్రోఫీ వస్తుందా.. ఐసీసీలో ఉన్నది మనోడే...
నఖ్వీ.. ఆసియా కప్, మెడల్స్ ను తనతోపాటు హోటల్ రూమ్ కు తీసుకెళ్లాడు. దీంతో ఇవి భారత జట్టుకు ఎలా వస్తాయి..? అన్నదే పెద్ద ప్రశ్న. దీనికి సమాధానంగా తాము అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కు ఫిర్యాదు చేస్తామని బీసీసీఐ తెలిపింది. కాగా, ఐసీసీ చైర్మన్ ఎవరో తెలుసు కదా..? జై షా. కరుడుగట్టిన దేశాభిమాని అయిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో, బీజేపీలో మోదీ తర్వాత నంబర్ 2న అయిన అమిత్ షా కుమారుడి ముందు ఈ నఖ్వీ గాడిలాంటి గుంటనక్క ఆటలు సాగుతాయా..? అందుకే అతడు త్వరలో ట్రోఫీ, మెడల్స్ ను వెనక్కుపంపిసార్తని భావిస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి సైకియా చెప్పారు.