మనుషులకే కాదు మరమనుషులకి కూడా ఒలంపిక్స్.. ఎక్కడో తెలుసా?

మారుతున్న కాలం.. పెరుగుతున్న టెక్నాలజీ.. కారణంగా ఇప్పటి జనరేషన్లో మనుషులతో అవసరాలే ఉండట్లేదు.. అన్నింటికీ రోబోలే అవసరం అవుతున్నాయి.;

Update: 2025-08-15 10:32 GMT

మారుతున్న కాలం.. పెరుగుతున్న టెక్నాలజీ.. కారణంగా ఇప్పటి జనరేషన్లో మనుషులతో అవసరాలే ఉండట్లేదు.. అన్నింటికీ రోబోలే అవసరం అవుతున్నాయి. మనుషులని పక్కన పెట్టి ప్రతి పనిలో రోబోలనే వాడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మనిషి అనేవాడు రోబో లకు సర్వెంట్లుగా మారతారేమో అనిపిస్తుంది. అయితే ఈ రోబోల వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో.. అన్ని నష్టాలు కూడా ఉంటాయి. రజినీకాంత్ రోబో సినిమాలో.. ఈ రోబోల వల్ల కలిగే నష్టాలు, లాభాలు రెండు క్లియర్ గా చూపించారు. అయితే రోబోల వల్ల నష్టాలు జరగకూడదు అని ప్రతి కంపెనీ తమ టెక్నాలజీతో ఒక రోబోను మించి మరో రోబోని తయారు చేస్తున్నారు.

ఈ విషయం పక్కన పెడితే.. ఒలంపిక్స్ అంటే అందరూ మనుషులు పాల్గొనే ఒలంపిక్స్ అనుకుంటారు. కానీ తాజాగా రోబోలకి కూడా ఒలంపిక్స్ క్రీడలు నిర్వహిస్తున్నారు.మరి ఇంతకీ రోబోలకి ఒలంపిక్స్ పెట్టబోతున్న ఆ దేశం ఏది అనేది చూస్తే.. చైనా.. అవును మీరు వినేది నిజమే.చైనా త్వరలోనే హ్యుమనాయిడ్ రోబోలకు ఒలంపిక్ క్రీడలను నిర్వహించబోతుందట. చైనాలో తొలిసారి వరల్డ్ హ్యుమనాయిడ్ ఒలంపిక్ క్రీడలు నిర్వహిస్తున్నారట. రోబోలు ఈ ఒలింపిక్ క్రీడల్లో దాదాపు 16 దేశాల నుండి 280 జట్లు పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. జపాన్, జర్మనీ,అమెరికా, బ్రెజిల్ వంటి దేశాల నుండి 88 ప్రైవేట్ సంస్థలు, అలాగే 192 యూనివర్సిటీలు ఈ ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనబోతున్నాయి. చైనాలోని బీజింగ్ మున్సిపల్ గవర్నమెంట్ ఈ హ్యూమనాయిడ్ రోబోల ఒలంపిక్స్ ని నిర్వహిస్తోంది.

ఇక చైనా నుండి ఈ ఒలంపిక్స్ లో ఫోరియర్, యూనిట్రీ అనే రెండు సంస్థలు పాల్గొనబోతున్నాయి. చైనా చాలా సంవత్సరాల నుండి రోబోలు తయారు చేయడంలో ముందుంటుంది. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీతో రోబోలను తయారు చేస్తూ మార్కెట్లోకి తీసుకురావాలని ట్రై చేస్తోంది.అంతేకాదు చైనా ఇప్పటికే రోబోటిక్స్, ఏఐ రంగం కోసం దాదాపు 20 బిలియన్ల డాలర్లను ఖర్చు చేశారు.భవిష్యత్తులో రోబోటిక్స్, ఏఐ స్టార్టప్ కంపెనీల కోసం దాదాపు 137 బిలియన్ డాలర్లతో ఓ నిధిని కూడా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తుందట. అందుకోసమే చైనా దేశం హ్యూమనాయిడ్ రోబోలకు సంబంధించిన చాలా ఈవెంట్లని పెద్ద ఎత్తున నిర్వహిస్తుందని తెలుస్తోంది.

ఇక చైనా నిర్వహిస్తున్న ఈ హ్యూమనాయిడ్ రోబోల ఒలంపిక్స్ లో ఏ ఏ క్రీడలు ఉంటాయంటే.. స్ప్రింట్ రన్నింగ్, బాక్సింగ్, సాకర్ వంటి పోటీలు మొదట నిర్వహిస్తారు.అలాగే హ్యమనాయిడ్ రోబోలు వస్తువులను గుర్తించడం, ఒక దగ్గరి నుండి మరో దగ్గరికి తీసుకువెళ్లడం, ఔషదాలను గుర్తుపట్టడం, క్లీనింగ్ సర్వీసెస్ వంటి విభాగాలలో ఈ రోబో లకు ఒలంపిక్స్ నిర్వహిస్తారట. అంతేకాకుండా ట్రాక్ అండ్ ఫీల్డ్, ఫుట్ బాల్,టేబుల్ టెన్నిస్ వంటి పోటీలు కూడా ఈ ఒలంపిక్స్ లో ఉంటాయి. అయితే డ్రాగన్ కంట్రీ కొన్ని సంవత్సరాల క్రితమే బీజింగ్ లో హ్యూమనాయిడ్ రోబోల కోసం ఒక మారథాన్ ని నిర్వహించింది.కానీ ఈ మారథాన్ లో పాల్గొన్న చాలా రోబోలు లక్ష్యాన్ని చేరుకోక ముందే దెబ్బతిన్నాయి. మరి మనుషులకి కాకుండా మరమనుషులకి ఒలంపిక్స్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏ రోబో సత్తా చాటుతుందో చూడాలి.

Tags:    

Similar News