టీమిండియా టీ20 జట్టులో భారీ మార్పులు.. సీనియర్లకు ఊహించని షాక్!
టీమిండియా టీ20 జట్టులో బీసీసీఐ పెను మార్పులు చేసింది. ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనలతో పాటు ఏషియన్ గేమ్స్‌కు సరికొత్త జట్టును ప్రకటించింది.
టీమిండియా టీ20 జట్టులో బీసీసీఐ పెను మార్పులు చేసింది. ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనలతో పాటు ఏషియన్ గేమ్స్‌కు సరికొత్త జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌లకు శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా, తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా నియమించారు. అయితే అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ ఎంపికే, ఐపీఎల్‌లో పరుగుల వరద పారించిన ఈ కుర్రాడు.. సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేస్తూ భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఈ సరికొత్త జట్టు విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ కొత్త చరిత్ర సృష్టించాడు, భారత క్రికెట్‌లో కొత్త యుగానికి నాంది పలికింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే బీహార్ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీమిండియా సీనియర్ జట్టుకు ఎంపికై చరిత్ర సృష్టించాడు. గతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల 205 రోజులకు అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. జూన్ 26 నుంచి ఐర్లాండ్‌తో ప్రారంభమయ్యే సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ ఆడితే, భారత్ తరఫున అతి పిన్న వయసులో డెబ్యూ చేసిన క్రికెటర్‌గా సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 36 ఏళ్ల రికార్డు చెరిపేసాడు .
శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ పగ్గాలు:
ఇప్పటివరకు టీ20 కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్‌పై సెలక్టర్లు వేటు వేశారు. అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను కొత్త కెప్టెన్‌గా నియమిస్తూ బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది.ఇక శ్రేయస్ ఐపీఎల్‌లో కోల్‌కతా, పంజాబ్ జట్లను అద్భుతంగా నడిపించిన అనుభవం ఉండటంతో సెలక్టర్లు అతని వైపు మొగ్గు చూపారు. యువ ఆటగాడు తిలక్ వర్మకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.
సీనియర్లకు షాక్.. భారీ మార్పులు:
ఈ సరికొత్త టీ20 జట్టులో హార్దిక్ పాండ్య, రింకూ సింగ్, సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్ ఆటగాళ్లకు చోటు దక్కలేదు. ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణాలకు జట్టులో స్థానం కల్పించారు. అలాగే దేశవాళీ, ఐపీఎల్‌లో అదరగొట్టిన ప్రిన్స్ యాదవ్‌కు కూడా తొలిసారి పిలుపు వచ్చింది.
ఆర్‌సీబీ ఆటగాళ్లకు మొండిచేయి:
ఈసారి జట్టు ఎంపికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్లకు పెద్ద షాక్ తగిలింది. ఆర్‌సీబీ మినహా మిగిలిన అన్ని ఐపీఎల్ జట్ల నుండి ఎవరో ఒకరు టీమిండియాకు ఎంపికయ్యారు. ఆర్‌సీబీని ఐపీఎల్‌లో ముందుండి నడిపించిన రజత్ పాటిదార్, నిలకడగా రాణించిన దేవదత్ పడిక్కల్‌ను సెలక్టర్లు పూర్తిగా పక్కన పెట్టేయడం నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు దారితీసింది.
వచ్చే టీ20 వరల్డ్ కప్ సైకిల్‌ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ జట్టులో భారీ మార్పులకు శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తోంది. సీనియర్లను పక్కన పెట్టి కుర్రాళ్లకు, ముఖ్యంగా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వడం ఒక సాహసోపేతమైన నిర్ణయమే. మరి శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఈ సరికొత్త యంగ్ ఇండియా.. ఇంగ్లండ్, ఐర్లాండ్ గడ్డపై ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.