చ‌ద‌రంగంలో పాల‌బుగ్గ‌ల అభిమ‌న్యుడు... గుకేశ్ నే కంగుతినిపించాడు

ఈ ఏడాది కాలంలో ప్ర‌పంచ చ‌ద‌రంగ చ‌రిత్ర‌లో సంచ‌ల‌నం ఏమిటంటే... తెలుగు మూలాలున్న త‌మిళ‌నాడులో స్థిర‌ప‌డ్డ గుకేశ్ దొమ్మ‌రాజు ప్ర‌పంచ చాంపియ‌న్ గా నిల‌వ‌డ‌మే.;

Update: 2025-09-09 09:43 GMT

ఈ ఏడాది కాలంలో ప్ర‌పంచ చ‌ద‌రంగ చ‌రిత్ర‌లో సంచ‌ల‌నం ఏమిటంటే... తెలుగు మూలాలున్న త‌మిళ‌నాడులో స్థిర‌ప‌డ్డ గుకేశ్ దొమ్మ‌రాజు ప్ర‌పంచ చాంపియ‌న్ గా నిల‌వ‌డ‌మే. గత ఏడాది డిసెంబ‌రు 12న కేవ‌లం 18 ఏళ్ల వ‌య‌సులో ఆ ఘ‌న‌త అందుకున్న అత్యంత పిన్న వ‌య‌స్కుడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. దీంతోనే అత‌డు హాట్ టాపిక్ గా మారాడు. మ‌ధ్య‌లో టోర్నీల్లో వెనుక‌బ‌డినా రికార్డు మాత్రం రికార్డే క‌దా..? అలాంటి గుకేశ్ ను 8 నెల‌ల తేడాలోనే ఓడించాడు ఓ కుర్రాడు.

ఇప్పుడు ఎక్క‌డ‌..??

ఫిడె గ్రాండ్ స్విస్ టోర్నీలో సంచ‌ల‌నం న‌మోదైంది. గుకేశ్ ను అమెరికాకు చెందిన గ్రాండ్ మాస్ట‌ర్ అభిమ‌న్యు మిశ్రా ఓడించాడు. ఇంత‌కూ అభిమ‌న్యు వ‌య‌సు ఎంతో తెలుసా? 16 ఏళ్లే. ప్ర‌పంచ చాంపియ‌న్ అయిన గుకేశ్ ను 61 ఎత్తుల్లో ప‌రాజ‌యం పాల్జేశాడు. త‌న‌కంటే మెరుగైన స్థితిలో ఉన్న గుకేశ్ ను ఓడించ‌డం మిశ్రా కెరీర్ లో చెప్పుకోద‌గ్గ మైలురాయి అనుకోవాలి. అయితే, మ‌రో చాంపియ‌న్ ఆర్‌.ప్ర‌జ్క్షానంద జ‌ర్మ‌నీకి చెందిన మ‌థియాస్ బ్లూబామ్ చేతిలో ఓడిపోయాడు.

కుర్రాడు భ‌లే లేత‌గా ఉన్నాడు...

పేరుచూస్తేనే అభిమ‌న్యు మిశ్రా భార‌తీయ మూలాలున్న కుటుంబం నుంచి వ‌చ్చిన‌వాడ‌ని తెలుస్తోంది. మిశ్రా.. 2009 ఫిబ్ర‌వ‌రి 5న పుట్టాడు. 2021లో... అంటే అప్ప‌టికి 12ఏళ్ల నాలుగేళ్ల 25 రోజుల్లోనే గ్రాండ్ మాస్ట‌ర్ అయ్యాడు. అత్యంత చిన్న వ‌య‌స్కుడైన గ్రాండ్ మాస్ట‌ర్ గా నిలిచాడు.

-2016లో ఏడేళ్ల 6 నెల‌ల 22 రోజుల వ‌య‌సు యుఎస్సీఎఫ్ రేటింగ్ 2000 సాధించాడు అభిమ‌న్యు. దీనిని సాధించిన అతి పిన్న వ‌య‌స్కుడూ ఇత‌డే.

-గ‌త ఏడాది జూన్ వ‌ర‌కు అత్యంత చిన్న వ‌య‌సు ఇంట‌ర్నేష‌న‌ల్ మాస్ట‌ర్ (ఐఎం) రికార్డు క‌డా అభిమ‌న్యుదే. దీనిని 2019 న‌వంబ‌రులో 10 ఏళ్ల 9 నెలల 20 రోజుల వయసులో సాధించాడు. విశేషం ఏమంటే.. గ‌తంలో ఈ రికార్డు రమేష్‌బాబు ప్రజ్ఞానంద పేరిట ఉంది. 2020 ఫిబ్ర‌వ‌రిలో ఇంట‌ర్నేష‌న‌ల్ మాస్ట‌ర్ హోదా పొందాడు.

Tags:    

Similar News