వైఎస్సార్సీపీ ఎంపీ బాలశౌరికి పార్లమెంట్ లో కీలక పదవి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యుడు బాలశౌరికి పార్లమెంట్ లో కీలక పదవి దక్కింది. పార్లమెంట్ కమిటీల్లో అత్యంత కీలకంగా భావించే ప్రజాపద్దుల సంఘం (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ- పీఏసీ) లో బాలశౌరి సభ్యుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2020- 21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బాలశౌరిని నియమించారు. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత ఆధిర్ రంజన్ చౌదరి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్ పర్సన్ గా నియమితులయ్యారు. ఇప్పుడు ఆ కమిటీలో బాలశౌరి సభ్యుడిగా నియమితులయ్యారు.
ప్రభుత్వ రెవెన్యూ - ఖర్చులను మదింపు చేయడం పీఏసీ బాధ్యత అని తెలిసిందే. రాష్ట్ర శాసనసభలోనూ, పార్లమెంట్‌లోనూ పీఏసీలు ఉంటాయి. ప్రభుత్వం ఏడాది పాటు చేసిన వ్యయాలను పరిశీలిస్తుంది. ఈ కమిటీలో ప్రతిపక్షానికి చెందిన నాయకులకు ఈ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బాలశౌరిని పీఏసీ సభ్యుడిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ లో ప్రతిపక్షానికి చెందిన నేత ఆదిర్ రంజన్ చౌదరి చైర్ పర్సన్ గా ఉండగా, ఆ కమిటీలో ఇతర పార్టీలకు చెందిన వారిని సభ్యులుగా నియమించడంలో భాగంగా బాలశౌరికి అవకాశం ఇచ్చారు. అయితే లోక్‌సభలో ఆయా పార్టీలకు ఉన్న సంఖ్యాబలం ఆధారంగా ఆ సభ్యుల నియామకం ఉంటుంది. ప్రస్తుతం లోక్‌సభలో బీజేపీ, కాంగ్రెస్, డీఎంకే తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ మంది ఎంపీలు మొత్తం 22 మంది ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాలశౌరి నియామకం జరిగింది.