• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  లైఫ్ అండ్ లా ఫౌండేషన్...

లైఫ్ అండ్ లా ఫౌండేషన్ ప్రారంభించిన రోజా

By - Tupaki Desk
Update: 2018-09-10 17:02 GMT
విదేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రులకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకునే మార్గాలు తెలియక ఇబ్బంది పడుతున్నప్పుడు లైఫ్ అండ్ లా ఫౌండేషన్ సహాయపడుతుందని ఆ ట్రస్ట్ ఆవిష్కరణ సందర్భంగా ప్రముఖ నటి, వైఎస్ఆర్సీపి ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. సింగపూర్ పర్యటన సందర్భంగా అక్కడి తెలుగు సంఘాల ప్రతినిధులు సభ్యులతో సుదీర్ఘంగా  చర్చించిన రోజా వారి సాధకబాధలు తెలుసుకున్నారు. ఇమ్మిగ్రేషన్ కు సంబంధించి న్యాయ సలహా ఇవ్వడానికి వనరులు అందుబాటులో ఉన్నా వ్యక్తిగతంగానో లేక వృత్తిపరంగానో ఏదైనా సమస్య వచ్చినప్పుడు తీర్చేందుకు సరైన సహాయం అందక ఇబ్బంది పడుతున్న ప్రవాసాంధ్రుల కోసం  లైఫ్ అండ్ లా ఫౌండేషన్ పాటుపడుతుందని ట్రస్ట్ ప్రతినిధులను ఆమె ప్రశంసించారు . సాటి తెలుగు వాడు ఎక్కడా ఉన్నా చేతనైనంత సహాయం చేసే లక్ష్యంతో ఏర్పాటైన ఈ సంస్థకు ఇది ప్రారంభం మాత్రమే అని ముందు ముందు దీన్ని విస్తరించే ప్రణాళికలు ఉన్నాయని తెలుసుకుని హర్షం వ్యక్తం చేసారు. తరచుగా పేపర్లలో మీడియాలో ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో ఉన్న మనవాళ్ళు పడుతున్న కష్ఠాలు చూస్తున్నామని వాటికి అండగా నిలవాల్సిన ఇలాంటి సంస్థల అవసరం ఎంతైనా ఉందని నొక్కి చెప్పారు. ప్రపంచ శాంతి లక్ష్యంగా స్థాపించిన ఈ ట్రస్ట్ ఇండియాతో పాటు అన్ని దేశాల్లోనూ శాఖలను విస్తరించే దిశాగా ముందుకు వెళ్తుందని స్పష్టం చేసారు.

లైఫ్ అండ్ లా ఫౌండేషన్ ఉద్దేశాలను వివరిస్తూ ఈ ట్రస్ట్ ప్రవాసాంధ్రుల వ్యక్తిగత కుటుంబ మరియు ప్రపంచ అభివృద్ధి కోసం స్థాపించబడిందని ఇందులో భాగంగా చక్కని జీవితానికి కావలసిన మెళకువలను తెలియజెప్పి ఫ్యామిలీ కౌన్సిలింగ్ తో పాటు సమానత సాధికారత కోసం పాడుపడుతుందని చెప్పారు. మానవత్వం సేవాభావం స్నేహాతత్వం తదితరాలు పెంపొందించే విధంగా కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. ఎవరికి ఏ సహాయం కావాల్సి వచ్చినా లైఫ్ అండ్ లా ఫౌండేషన్ ను సంప్రదిస్తే వచ్చిన ఆర్జీలను క్రమపద్దతిలో క్రోడీకరించి వెంటనే చర్యలు తీసుకునేలా ప్లాన్ చేసినట్టు చెప్పారు. ఎక్కడ ఉన్నా తెలుగు సమాజం ముఖతోభివృద్ది కోసమే ఇలాంటి చేపడుతున్న ఇలాంటి కార్యక్రమాన్ని ఆవిష్కరణ చేయటం ద్వారా భాగస్వామ్యం కావడం పట్ల సంతోషంగా ఉందని రోజా తన ఆనందం వ్యక్తం చేసారు. కార్యక్రమానికి హాజరైన సింగపూర్ ప్రవాసాంధ్రులు మాట్లాడుతూ తోటి వారి గురించి ఆలోచించడమే నేరంగా భావిస్తున్న పరిస్థితుల్లో రోజా తమ కోసం ఇలాంటి ట్రస్ట్ కు అండగా నిలవడం ద్వారా ముందుకు రావడం చూస్తుంటే రాజకీయ నాయకుల్లో ఇలాంటి మంచి మనసు ఉన్నవారు రాణిస్తున్నందువల్లే ప్రజలు దీవించి ఆదరిస్తున్నారని లైఫ్ అండ్ లా ట్రస్ట్ కు కృతజ్ఞతలు తెలిపారు.
Tags:    
  • YSRCP MLA 
  • Roja 
  • Life-n-Law Foundation 

Similar News

నేల మీదకు జగన్...వ్యూహమా అనివార్యమా ?

2026-11-02 18:28 GMT

విశాఖ హెచ్‌పీసీఎల్ లో భారీ పేలుడు

2026-11-02 18:28 GMT

స్పెసిఫైడ్ అథారిటీకి టీటీడీ...కొత్త బోర్డు అప్పుడే ?

2026-11-02 18:27 GMT

రష్యా-ఉక్రెయిన్ పోరులో భారత్ క్రేజ్.. ఉక్రెయిన్ ఆరాటాన్ని ఎద్దేవా చేసిన పుతిన్

2026-11-02 18:27 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ట్రంప్ టవర్స్‌లో షాకింగ్ పరిస్థితులు.. కోట్ల ఫ్లాట్ కొన్నా కర్టెన్లు లేవు.. లిఫ్ట్ లేదు

2026-11-02 18:26 GMT

మెగాస్టార్ చుట్టూ ఊహాగానాలు...మ్యాటర్ మాత్రం ?

2026-11-02 18:25 GMT

రాహుల్ అర్ధమవుతోందా...అమిత్ షా లాజిక్ పాయింట్ !

2026-11-02 18:24 GMT

భారత్ దెబ్బకు పాకిస్తాన్ దివాళా తీసింది.. ఇవే సాక్ష్యాలు

2026-11-02 18:24 GMT

కూటమి జై కొట్టారా.... వైసీపీ గ్రాఫ్ పెరిగిందా ?

2026-11-02 18:23 GMT

రెచ్చిపోతున్న బంగ్లాదేశ్ ను కర్ర కాల్చి వాత పెడుతోన్న భారత్.. భారీ మాస్టర్ స్ట్రోక్

2026-11-02 18:21 GMT

Copyright @2026

Powered by Blink CMS