అందరి ‘చెవి’లో జోరీగ!?
చిత్తూరు జిల్లాలో పెత్తానం కోసం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తహతహ లాడుతున్నాడు. అన్ని శాఖల్లో వేలుపెడుతూ అందరి చెవుల్లో జోరీగా మారుతున్నాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరెడ్డి శిష్యుడిగా రాజకీయం అరగ్రేటం చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు ఆయనకే పంగనామాలు పెడుతున్నారనే టాక్ విన్పిస్తుంది. ప్రస్తుతం చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన గురువు భుమన కరుణాకర్ రెడ్డి, సీనియర్ నేతలైన పెద్దిరెడ్డి రాంచంద్రరెడ్డిలను పక్కనపెట్టి వారిపై పెత్తనం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలో తనకు అందించిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటూ ముందుకెళుతున్నారు.
*గురువు స్థానానికే ఎసరు.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తొలినాళ్లలో భూమన కరుణారెడ్డి శిష్యుడిగా పేరుతెచ్చుకున్నాడు. చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత చిత్తూరు జిల్లాపై పట్టుకోసం ఆయన ప్రయత్నం మొదలెట్టారు. ప్రస్తుత్తం నాలుగు పదవులను దక్కించుకొని జిల్లాలో పెత్తం చెలాయిస్తున్నారు. ప్రభుత్వ విప్, తుడా చైర్మన్, టీటీడీపీ ఎక్స్ ఆఫీషియో మెంబర్ వంటి పదవులను అడ్డంపెట్టుకొని అన్ని శాఖల్లో జోక్యం చేసుకుంటున్నారు. జిల్లాపై పట్టుకోసం తహతహ లాడుతున్నారు. చంద్రగిరిలో ఎమ్మెల్యేగా ఉంటున్నే భూమన నియోజకవర్గంపై పట్టుకోసం ఆరాటపడుతున్నారు. కరుణకర్ రెడ్డిని పక్కన పెట్టెలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుంచి తన కుమారుడికి సీటు దక్కేలా ప్రయ్నతాలు ముమ్మరం చేస్తూ గురువుకే పంగనామాలు పెట్టే పనిలో పడ్డాడు.
*పెద్ది రెడ్డికి జోరీగగా మారిన వైనం..
జిల్లాలో సీనియర్ నేత అయిన పెద్దిరెడ్డికి చెవిరెడ్డి జోరీగా మారాడని పార్టీలో చర్చ జరుగుతోంది. పెద్ది రెడ్డి మంత్రి పదవీ ఉండటంతో ప్రస్తుతం జిల్లాలో ఆయన మాటే చెల్లుబాటవుతోంది. అంతేకాకుండా ఆయన కుమారుడు ఎంపీగా, ముఖ్యమంత్రి ఆప్తుడు. దీంతో పెద్ది రెడ్డి విషయం లో చెవిరెడ్డి కాస్తా ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. వీలుచిక్కినప్పుడల్లా ఆయన మాట నెగ్గకుండా ప్రణాళికలు రచిస్తున్నాడు. జిల్లాలో పెద్ది రెడ్డికి సమాంతరంగా చెవి రెడ్డి వ్యవహారాలు చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలో ఎవరికీ ఏ పని కావాలన్న అందరు తననే కాలవాలనే కండిషన్ పెడుతున్నారు. వేరే నేతలకు దగ్గరకు పోతే పనులకు అడ్డంపడుతున్నట్లు వ్యవహరిస్తున్నారని పలువురు వాపోతున్నారు. సంబంధంలేని వ్యవహరాల్లో తలదురుస్తూ అధికారులను ఇబ్బందులు పెడుతున్నారు.
అలాగే ఆయన పదవులను అడ్డం పెట్టుకొని పెద్ద సంఖ్యలో టికెట్లు దక్కించుకుంటారని టాక్. ఏకంగా రోజుకు 60నుంచి 70వరకు టికెట్లు దక్కించుకుంటారని సమాచారం. చెవిరెడ్డి నోటి దురుసుకు భయపడి అధికారులు కూడా ఆయన అడిగినన్ని టికెట్లు ఇస్తున్నారట. అయితే చెవిరెడ్డి ఎక్కడ వుంటే అక్కడా వివాదాలు ఉండటం ఖాయం. గతంలో చెవిరెడ్డి అనేక వివాదాల్లో ఇరుక్కున్నారు. ఆయన ఒక్కడి పైనే వందకు పైగా కేసులు ఉన్నాయంటే ఆయన వివాదాలతో ఎలా కాలం గడుపుతారో అర్థం చేసుకోవచ్చు. అయితే అన్నింటి లో జోక్యం చేసుకుంటూ ముందుకెళుతున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుకున్నట్లు జిల్లాపై పట్టుసాధిస్తారా లేక చతికల పడుతారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.