జగన్ తో పోలిక వరకు వంశీ వెళ్లటమా? ఎక్కువ అవుతున్నట్లు లేదు?
రాజకీయాలు మారిపోయాయి. గతంలో మాదిరి పరిస్థితులు ఇప్పుడు లేవు. అధికారం కోసం దేనికైనా రెఢీ అన్నట్లుగా వ్యవహరించే తీరు ఇప్పుడు ఎక్కువ అవుతోంది. ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి కరడుగట్టిన నేత అన్నట్లుగా బిల్డప్ ఇచ్చి.. పార్టీ మారిన తర్వాత తనకు మించిన భక్తుడు లేడన్నట్లుగా వ్యవహరించే తీరు కొంత మేరే ఓకే కానీ.. శ్రుతి మించితేనే ఇబ్బంది.
గన్నవరం ఎమ్మెల్యేగా టీడీపీ బొమ్మ మీద గెలిచి.. తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వల్లభనేని వంశీ తీరు ఇప్పుడు నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పార్టీ మారిన తర్వాత.. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న నేతల్ని కలుపుకుపోవటం.. లేదంటే వారి కంటే తాను మెరుగు అన్న భావన కలిగేలా చేయటం చాలా అవసరం. ఈ సందర్భంగా అధినేత అభిమానాన్ని సొంతం చేసుకోవటంతో పాటు.. కార్యకర్తల బలాన్ని పెంచుకోవటం మీద ప్రత్యేక శ్రద్ధ చాలా అవసరం.
ఇలాంటి వాటి కంటే కూడా తన నోటికి ఎక్కువగా పని పెడుతున్న వల్లభనేని వంశీ తీరును పలువురు తప్పు పడుతున్నారు. గన్నవరం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని దుట్టా రామచంద్రరావు.. యార్లగడ్డ వెంకట్రావులు ఎప్పటి నుంచో ఉన్నారు. పార్టీ కోసం వారెంతో శ్రమించారు కూడా. కోట్లు ఖర్చు పెట్టారు కూడా. అయితే.. ఎన్నికల్లో ఓటమి పాలు కావటం.. వంశీ పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి ప్రదర్శించి.. అధినేతను కన్వీన్స్ చేయటంలో సక్సెస్ కావటంతో ఈ ఇరువురు నేతలకు ఇప్పుడు ఇబ్బందిగా మారింది.
పార్టీలో చేరే క్రమంలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటం ద్వారా.. ఉప ఎన్నికలకు సై అన్న ఆయన తీరు మెచ్చుకునేదే అయినా.. పార్టీలో అప్పటికే ఉన్న నేతల్ని కలుపుకుపోయే విషయంలో మాత్రం ఆయన వెనుకబడిపోయారు. పార్టీ అధినాయకత్వానికి చిరాకు పుట్టేలా వరుస ప్రెస్ మీట్లు పెట్టటం.. జగన్ ను పొగడటం.. విపక్ష నేత కమ్ ఒకనాటి తన బాస్ అయిన చంద్రబాబును తిట్టేస్తున్న తీరు బాగోలేదంటున్నారు.
బాబు తీరు అంతలా నచ్చకపోతే.. అన్నేళ్లు ఆ పార్టీలో ఎందుకు ఉన్నట్లు? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక.. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జగన్ ఒక్కరే నాయకుడని.. అలానే గన్నవరంలో కూడా తాను ఒక్కడే పార్టీకి కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా చేస్తున్న వ్యాఖ్యల్ని తప్పు పడుతున్నారు. పార్టీ నేతల్ని.. తన రాజకీయ ప్రత్యర్థులుగా చెప్పేయటం ద్వారా.. అధినాయకత్వానికి రాంగ్ సిగ్నల్స్ పంపుతున్నారంటున్నారు.
ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే మాత్రమే అయిన వంశీ.. తన స్థాయికి మించి జగన్ తో పోలిక పెట్టుకోవటం సరికాదంటున్నారు. ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు.. కార్యకర్తలు గుర్రుగా ఉంటున్నారు. కొత్త కోడలు అత్తింట్లో అడుగు పెట్టినంతనే.. అత్తతో పోల్చుకుంటే.. అప్పటికే ఉన్న కోడళ్లకు ఎలా ముండుతుందో.. ఇంచుమించు గన్నవరంలో వంశీ తీరు అలానే ఉంటుందంటున్నారు. పోలికల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. మరీ మాటలు వంశీకి వినిపిస్తున్నాయంటారా?