రక్షణ కల్పించండి: పోలీసులను ఆశ్రయించిన వైఎస్ వివేకా కూతురు

Update: 2021-06-15 17:30 GMT
తనకు ప్రాణభయం ఉందని.. రక్షణ కల్పించాలని వైఎస్ సునీత రెడ్డి పోలీసులను ఆశ్రయించారు.  ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బంధువు.. కడప మాజీ ఎంపి వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె అయిన వైయస్ సునీతా రెడ్డి  తనకు.. తన కుటుంబానికి ముప్పు ఉందని అనుమానిస్తున్నారు. వైయస్ సునీత ఈ రోజు కడప ఎస్పీని కలుసుకున్నారు. తన కుటుంబానికి పోలీసు రక్షణ కల్పించాలని కోరారు.  

వైయస్ వివేకా హత్య కేసులో సిబిఐ దర్యాప్తును తిరిగి ప్రారంభించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని సునీత పోలీసులకు వివరించింది.  సీబీఐ అధికారుల బృందం కడపలో  క్యాంప్ చేసి కేసుతో సంబంధం ఉన్న నిందితులను ప్రశ్నిస్తున్నారని.. ఈ నేపథ్యంలోనే తమకు రక్షణ కల్పించాలని సునీత ఫిర్యాదులో కోరింది.

మార్చి 15, 2019న పులివెందులలో వైఎస్ వివేకా హత్య ఆయన సొంతింట్లో జరిగింది.  తన తండ్రి హత్యపై దర్యాప్తు తీరుపై ఆయన కూతురైన సునీత బహిరంగంగానే అసంతృప్తిగా వ్యక్తం చేశారు.  తండ్రి మరణంపై అనుమానం వ్యక్తం చేశారు. నిందితులను పట్టుకోవడం లేదని లేఖలు రాశారు. దీంతో హంతకుల నుంచి తనకు ముప్పు ఉందని అనుమానిస్తూ సునీత రెడ్డి తనకు తనకు కుటుంబానికి ప్రాణభయం ఉందని పోలీసులను ఆశ్రయించారు.

వైఎస్ వివేకాది రాజకీయ హత్య అని వైయస్ సునీత ఆరోపించారు. హైకోర్టులో రిట్ పిటిషన్‌ కూడా  దాఖలు చేశారు. సీబీఐ విచారణ సాగుతున్న దృష్ట్యా తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.
Tags:    

Similar News