మరో బుమ్రా వీడియో... ఆర్సీబీ నెట్స్‌ లో సేమ్ యాక్షన్‌ తో కొత్త బౌలర్!

ఆ సంగతి అలా ఉంటే... బుమ్రా బౌలింగ్ యాక్షన్ అందరి దృష్టిని ఆకర్షిస్తుందనేది తెలిసిన విషయమే.

Update: 2024-05-01 23:30 GMT

టీం ఇండియా స్పీడ్ స్టార్ జస్ ప్రీత్ బుమ్రా తనదైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌ కు ఆడుతున్న బుమ్రా... ఆడిన 10 మ్యాచ్ లలోనూ 14 వికెట్లు తీసుకోగా.. అందులో 5/21 బెస్ట్ పెర్ఫార్మెన్స్ గా ఉంది. ఆ సంగతి అలా ఉంటే... బుమ్రా బౌలింగ్ యాక్షన్ అందరి దృష్టిని ఆకర్షిస్తుందనేది తెలిసిన విషయమే.

ఇందులో భాగంగా అతడి స్లింగ్ యాక్షన్ గురించి క్రికెట్ ప్రపంచంలో బలమైన చర్చ జరిగింది. ఇక గత కొన్నేళ్లుగా తన బౌలింగ్‌ లో అద్భుతమైన అభివృద్ధిని సాధించాడు బూమ్రా. ఈ క్రమంలోనే ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో టీం పరంగా ముంబై పెర్ఫార్మెన్స్ పై విమర్శలు వస్తున్నా.. బూమ్రా మాత్రం ఆకట్టుకుంటున్నాడు.

ఈ క్రమంలో తాజాగా... అచ్చం బుమ్రా స్టైల్లో బౌలింగ్ చేస్తున్న మరో బౌలర్ ఐపీఎల్‌ లో ఉద్భవించాడు. ఈ బౌలర్ యాక్షన్ బుమ్రాకు చాలా దగ్గరగా ఉండటంతో.. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో.. అతడి గురించిన ఆరా తీయడం ఆన్ లైన్ వేదికగా ఎక్కువైపోతుంది. ఈ బౌలర్ పేరు మహేష్ కుమార్.

అవును... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెట్స్‌ లో మహేష్ తన బౌలింగ్‌ తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అతను బుమ్రా లాగానే బౌలింగ్ చేస్తూ కనిపిస్తున్నాడు.. బుమ్రా లాగానే స్లింగ్ ఆర్మ్ యాక్షన్‌ తో పదునైన బంతులు సందిస్తున్నాడు. వాస్తవానికి మహేష్ కుమార్.. రెండు సంవత్సరాల క్రితమే గుజరాత్ టైటాన్స్‌ లో భాగంగా ఉండగా.. ఇప్పుడు నెట్ బౌలర్‌ గా ఆర్సీబీలో భాగమయ్యాడు!

Read more!

కర్ణాటకకు చెందిన ఈ 27 ఏళ్ల బౌలర్‌... ఆర్సీబీ నెట్‌ బౌలర్‌‌ గా ఉన్నాడు. 2017లో భారత జట్టు నెట్స్‌ లో కూడా బౌలింగ్‌ చేశాడు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన అతన్ని ఆశిష్ నెహ్రా గుజరాత్ టైటాన్స్ నెట్స్‌ కి పిలిచి.. తర్వాత అతనికి బౌలింగ్ షూలను బహుమతిగా ఇచ్చాడు! అయితే... వైరల్‌ గా మారుతున్న మహేష్ వీడియో పాతదేనని అంటున్నారు.

Tags:    

Similar News