ఏర్పేడు బాధితుల వ‌ద్ద‌కు జ‌గ‌న్‌..స్థానికుల రోద‌న‌లు

Update: 2017-04-23 07:35 GMT
చిత్తూరు మునగలపాలెంలో లారీ ప్రమాదంలో మృతిచెందిన‌ బాధితుల కుటుంబాల‌ను వైసీపీ అధినేత‌ - ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ వైఎస్ జగన్ పరామర్శించారు. రేణిగుంట విమానాశ్ర‌యం నుంచి మున‌గ‌ల‌పాలెం చేరుకున్న జ‌గ‌న్‌ కు  బాధితులు తమ గోడు వెళ్ల‌బోసుకున్నారు. ఇసుక మాఫియా వల్లే తమవాళ్లు చనిపోయారంటూ ఆవేద‌న‌ వ్య‌క్తం చేశారు. జరిగిన దానికి టీడీపీ నేతలే కారణమంటూ ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ప్రమాద ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు వైఎస్ జగన్ వద్ద గోడు వెళ్లబోసుకొని త‌మ‌కు న్యాయం చేసేందుకు పోరాటం చేయాల‌ని కోరారు.

ఈ సంద‌ర్భంగా స్థానికులు మాట్లాడుతూ ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా మారింద‌ని టీడీపీ నేతల కన్నుసన్నల్లో ఈ దందా జ‌రుగుతోందని మండిప‌డ్డారు. ఇతర రాష్ట్రాలకు అక్రమంగా ఇసుక తరలింపుతో రోజూ కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయ‌ని ఆరోపించారు. ఏర్పేడులో 17మందిని పొట్టనపెట్టుకున్నది కూడా ఇసుక మాఫియానేన‌ని విమ‌ర్శించారు. ఇసుక మాఫియా ను అడ్డుకోవాలన్న త‌మ‌ మొరపై అధికారుల నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అధికారులతో పోలీసుల కుమ్మక్కు అయ్యార‌ని మండిప‌డ్డారు. టీడీపీ నేతల ధనదాహం ,అధికారుల నిర్లక్ష్యంతో 17 కుటుంబాలు రోడ్డునపడ్డాయ‌ని మండిప‌డ్డారు. బాధితుల్లో ఒక్కొక్కరిది ఒక్కో ధీనగాథ అని తెలిపారు. ఒక్క ములగలపాలెం లోనే  13మంది మృతి చెందార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇంట చూసినా విషాధ వదనాలే ఉన్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News