టీడీపీ ఎంఎల్ఏ గొంతు అసెంబ్లీలో వినిపించదా ?
అసెంబ్లీ సెషన్లో జగన్మోహన్ రెడ్డి మాటలు విన్న తర్వాత ఇదే అనుమానాలు పెరుగుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే టీడీపీ ఎంఎల్ఏ నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో సామాజిక పెన్షన్ల విషయంలో మాట్లాడుతు చేసిన ఆరోపణలపై జగన్ కు ఒళ్ళు మండిపోయింది. తమ ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ల విషయంలో రామానాయుడు తప్పుడు మాటలు మాట్లాడుతున్నట్లు జగన్ మండిపోయారు. ఎంఎల్ఏ ఉద్దేశ్యపూర్వకంగానే తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు మండిపోయారు. కాబట్టి నిమ్మలపై ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ స్పీకర్ ను కోరారు.
బయట ఎలా మాట్లాడుకున్నా అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కావాలనే తప్పుడు ఆరోపణలు చేయకూడదంటూ జగన్ క్లాసు తీసుకున్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే తప్పుడు మాటలు మాట్లాడుతున్న రామానాయుడుకు భవిష్యత్తులో అసెంబ్లీలో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వకూడదని స్పీకర్ ను కోరారు. ఇక్కడ జరుగుతున్నదేమంటే ఏదో రకంగా ప్రభుత్వంపై బురద చల్లాలనే ఉద్దేశ్యంతో టీడీపీ ఎంఎల్ఏలు నోటికొచ్చిన అబద్దాలన్నీ మాట్లాడుతున్నారు.
ప్రభుత్వ పథకాల్లో లోపాలుంటే చెప్పటంలో తప్పులేదు. పథకాల అమలుపై ఏదైనా సలహాలు, సూచనలు చేయటమూ తప్పులేదు. కానీ మాట్లాడటం మొదలుపెట్టడమే వైసీపీది తప్పుడు ప్రభుత్వమని, అబద్ధాల ప్రభుత్వమని, జగన్ ఫేక్ సీఎం అంటు మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా జగన్ అమలు చేయటం లేదంటు గోల చేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే టీడీపీ హయాంలో కూడా చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి సంపూర్ణంగా అమలు చేయలేదు.
చంద్రబాబు ఇచ్చిన హామీలు వాటి అమలుతో పోల్చితే, జగన్ ఇచ్చిన హామీలు వాటి అమలు పర్వాలేదన్న అభిప్రాయం జనాల్లో ఉంది. అయితే జనాభిప్రాయంతో సంబంధం లేకుండా చంద్రబాబు అయినా టీడీపీ ఎంఎల్ఏలు అయినా జగన్ను పదే పదే ఫేక్ సీఎం అంటు దెప్పి పొడవటంతోనే సమస్యలు పెరిగిపోతున్నాయి. బయట మీడియా సమావేశంలో జగన్ పై ఆరోపణలు చేసినట్లుగానే చంద్రబాబు, టీడీపీ ఎంఎల్ఏలు అసెంబ్లీలో కూడా ప్రయత్నిస్తున్నారు.
బయట మీడియా సమావేశంలో చంద్రబాబు, టీడీపీ నేతలు ఏది మాట్లాడినా చెల్లుబాటవుతుంది. కానీ అదే పద్దతి అసెంబ్లీలో ఎలా సాధ్యమవుతుంది ? అన్న విషయాన్ని మరచిపోతున్నారు. తాజాగా రామానాయుడు కూడా అలాగే మాట్లాడటంతో వివాదం పెరిగిపోయింది. దాంతో ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేసే వాళ్ళను మాట్లాడనీయకుండా బ్యాన్ చేయాలని జగన్ సూచించారు.
ఏదో ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు కానీ జగన్ చెప్పిన తర్వాత కమిటిలో కాదని చెప్పేవాళ్ళుంటారా ? కాబట్టి సభా నాయుకుని హోదాలో జగన్ సూచన చేశారంటే అమలు కాకుండా ఎలా ఉంటుంది. అంటే రామానాయుడుకు అసెంబ్లీలో ఇక మాట్లాడే అవకాశం రాకపోవచ్చు. మిగిలిన మూడున్నరేళ్ళు ఓ సభ్యునిగా సభలోకి అడుగుపెట్టి స్పెక్టేటర్ గా మాత్రమే మిగిలిపోతారంతే.