1993 ముంబయి పేలుళ్ల కేసు దోషి యూసుఫ్ మృతి !

Update: 2020-06-26 23:30 GMT
1993లో ముంబయిలో సంభవించిన వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషి యూసుఫ్ మెమన్ తుదిశ్వాస విడిచాడు. గుండెపోటు రావడంతో ఈ ఉదయం యూసుఫ్ మరణించినట్లు జైలు అధికారులు వెల్లడించారు. స్థానిక సమాచారం ప్రకారం ఈ ఉదయం 10 గంటల సమయంలో బ్రష్ చేసుకునే సమయంలో యూసుఫ్ స్పృహ తప్పి పడిపోగా.. వెంటనే నాశిన్ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ యూసుఫ్ మరణించినట్లు తెలుస్తుంది. పోస్ట్‌ మార్టం నిమిత్తం అతడి మృతదేహాన్ని ధూలే మెడికల్ కాలేజీకి పంపారు. కాగా ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు టైగర్ మెమన్‌ కి యూసుఫ్ సోదరుడు. ఈ కేసులో యూసుఫ్‌ దోషిగా తేలడంతో కోర్టు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. ఈ నేపథ్యంలో 2018 జూలై 26 నుంచి యూసుఫ్‌ జైలులో ఉండగా టైగర్ మెమన్ పరారీలో ఉన్నాడు.

ఇక ఇదే కేసులో నిందితుడైన టైగర్ మరో సోదరుడు యూకుబ్ మెమన్ ‌ను 2015లో ఉరి తీసిన విషయం తెలిసిందే. కాగా 1993 సంవత్సరం మార్చి 12న ముంబయిలో వరుస దాడులు జరగ్గా.. ఈ ఘటనలో దాదాపు 250 మంది మరణించారు. వేల మంది గాయపడ్డ విషయం తెలిసిందే.
Tags:    

Similar News