ఈ ఎలుక కెపాసిటీని మీరు అస్సలు నమ్మలేరు

Update: 2020-09-26 09:10 GMT
కొన్ని వినేందుకు విచిత్రంగా అనిపిస్తుంటాయి. వీటిల్లో మరికొన్ని అంశాలు అయితే.. ఎంత చెప్పినా నమ్మలేనట్లుగా ఉంటాయి. తాజాగా ఆ కోవలోకే వస్తుంది ఇప్పుడు చెప్పే అంశం. సాధారణంగా ఎలుక పేరు విన్నంతనే ఎవరి ముఖంలో అయినా అసహనం తన్నుకొస్తుంది. పంటల్ని నాశనం చేయటమే కాదు.. ఇంట్లోకి ఒక్క ఎలుక ఎంట్రీ ఇస్తే చాలు.. ఇక ఆ ఇంటి పనైపోయినట్లే. అంతలా చిరాకు పెట్టిస్తాయి.

వస్తువుల్ని నాశనం చేయటమే కాదు.. ఇంటిని గుల్ల చేసే విషయంలో వాటి తర్వాతే ఏమైనా. అలాంటి ఎలుకల్లో ఒక దాన్ని జాగ్రత్తగా పెంచటమే కాదు.. దానికి బాంబుల్ని పసిగట్టే టాలెంట్ ను అర్థమయ్యేలా నేర్పించటమే కాదు.. అలాంటి పని ఏ మాత్రం తేడా లేకుండా చేసేలా దాన్ని ట్రైన్ చేసిన ఉదంతం ఒకటి బయటకు వచ్చింది.

కాంబోడియాకు చెందిన మగువా అనే ఎలుక ఒకటి ఇప్పుడు మనుషుల ప్రాణాల్ని కాపాడటంలో కీలకంగా వ్యవహరిస్తోంది. దానికి బాంబులు పసిగట్టే గుణాన్ని నేర్పించారు. దీంతో.. భూమిలో పాగి పెట్టిన ల్యాండ్ మైన్లను గుర్తించి హెచ్చరిస్తోంది. దీంతో.. పెద్ద ఎత్తున మనుషుల ప్రాణాల్ని ఈ ఎలుక కాపాడుతుంది. ఒపొపొ అనే సంస్థ ఈ ఎలుకకు ఈ తరహా శిక్షణ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఇదంతా విన్న తర్వాత ఎలుక అంటే అంతో ఇంతో సాఫ్ట్ కార్నర్ రావటం ఖాయం.
Tags:    

Similar News