వైసీపీ ఎమ్మెల్యే అరెస్టు.. కారణం ఇదే!
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్ పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థిని బెదిరించారనే ఆరోపణలతో ఎలమంచిలి శాసనసభ్యున్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. కాసేపటికే స్టేషన్ బెయిల్ పై ఆయన్ను విడుదల చేశారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థి అల్లుణ్ని ఎమ్మెల్యే ఫోన్‌లో బెదిరించినట్టు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
ఆ వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సదరు వ్యక్తి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాంబిల్లి పోలీసులు కేసు నమోదు చేసి, ఆయన్ను అరెస్టు చేశారు. అనంతరం స్టేషన్ బెయిల్‌పై రిలీజ్ చేశారు.
ఈ బెదిరింపులపై ఎమ్మెల్యే కన్నబాబురాజు స్పందించారు. తాను గతంలో ఎప్పుడో మాట్లాడిన ఆడియో టేపులు రెండు మూడింటిని కలిపి మార్ఫింగ్ చేశారని ఆరోపించారు. ఏకగ్రీవమైతే గ్రామాభివృద్ధి చెందుతుందని మాత్రమే తాను సూచించానని చెప్పారు. అభ్యర్థులను అనర్హుల్ని చేయించాననే మాటలు అవాస్తవమన్నారు. తనపై వచ్చిన ఈ ఆరోపణలు నిరూపిస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు కన్నబాబు.