మళ్లీ అడ్డంగా బుక్కైన దేవళ్ల రేవతి .. మేనల్లుడి దౌర్జన్యం , వీడియో వైరల్ !

Update: 2020-12-11 04:55 GMT
దేవళ్ల రేవతి .. ఇప్పుడు ఈ పేరు ఏపీలో మారుమోగిపోతుంది. దీనికి ప్రధాన కారణం ఈమె టోల్ ప్లాజా సిబ్బంది పై దురుసుగా ప్రవర్తించడమే. టోల్ గేట్ వద్ద రచ్చ రచ్చ చేసిన దేవళ్ల రేవతి తాజాగా మేనల్లుడి కారణంగా మరోసారి వీడియో ఫుటేజ్ తో సహా అడ్డంగా బుక్కైయ్యారు.

ఇంతకీ ఏమైందంటే ...  గుంటూరు జిల్లా దాచేపల్లి నర్సింగ్ హోమ్ సిబ్బందిపై రేవతి మేనల్లుడు వడియారాజు చేయి చేసుకున్నారు. వైద్యం చేయించుకున్నాక బిల్లు కట్టమని నర్సింగ్ హోమ్ సిబ్బంది అడిగారు. దీనితో ఒక్కసారిగా రెచ్చిపోయిన అతడు బిల్లు విషయంలో గొడవకు దిగారు. తాను వడ్డెర కార్పొరేషన్ ఛైర్ పర్సన్ దేవళ్ల రేవతి మేనల్లుడిని అంటూ బెదిరింపులకు దిగారు. డాక్టర్లు, నర్సింగ్ హోమ్ సిబ్బంది స్థానిక పోలీస్ స్టేషన్‌ కు సమాచారం ఇచ్చారు. ఈ దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక నిన్న కాజా టోల్‌గేట్‌ వివాదం హాట్ టాపిక్ అయ్యింది. టోల్ ప్లాజా సిబ్బందిపై ఆమె చేయి చేసుకున్నారు. కారుకు అడ్డంగా పెట్టిన బారికేడ్లను ఆమె పక్కకు లాగేశారు. ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించిన సిబ్బందిపై చేయి చేసుకున్నారు. అడ్డంగా పెట్టిన బారికేడ్‌ లను తీసుకొని విజయవాడ వెళ్లిపోయారు. ఆ సంఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఘటన బయటపడింది. అయితే , ఆ ఘటన పై రేవతి మాట్లాడుతూ  టోల్ ప్లాజా సిబ్బంది ముందుగా దురుసుగా ప్రవర్తన కారణంగానే తాను కారు దిగాల్సి వచ్చింది అన్నారు. చట్టం ప్రకారం నడిచే వ్యక్తిని, సదరు టోల్ ప్లాజా సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తానని చెబుతున్నారు. తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని.. పూర్తి ఆధారాలతో డీజీపీకి అందజేస్తాను అంటున్నారు. ఈ వివాదం కొనసాగుతుండగానే మేనల్లుడి వ్యవహారం వెలుగులోకి రావడం గమనార్హం. 
Full View
Tags:    

Similar News