ఇక వైసీపీ వంతు... ?
అవును హస్తిన వేదిక మీద ఇపుడు వైసీపీ వంతు వచ్చింది. గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ దాని అనుకూల మీడియా తెగ జోరు చేశాయి. ఢిల్లీ వెళ్తాం, ఏపీ సర్కార్ మీద ఫిర్యాదు చేస్తాం, మొత్తానికి మొత్తం వ్యవస్థలను రిపేర్లు చేస్తామని అర్భాటంగా చెప్పుకొచ్చారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు అయితే తీరిక చేసుకుని ఢిల్లీ వెళ్లారు, రెండు రోజులు అక్కడ మకాం చేశారు. రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ని కలసి ఏపీలో రాష్ట్రపతిపాలన పెట్టమని కోరారు. ఆ తరువాత వెనుతిరిగి వచ్చేశారు. ఇక చంద్రబాబు తరువాత కార్యాచరణ ఏంటి అన్నది చూడాలి.
మరోవైపు ఇపుడు వైసీపీ ఢిల్లీలో హడావుడి చేస్తోంది. ఇప్పటికే వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి దేశ రాజధాని చేరుకుని చంద్రబాబు మీద హాట్ హాట్ కామెంట్స్ చేయడం ద్వారా మాటల యుద్ధాన్ని మొదలెట్టేశారు. వైసీపీ ఎంపీలు కూడా త్వరలోనే రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ని కలుస్తారు అంటున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యక్తిగత ఆరోపణలు, ఉపయోగించిన దారుణ పదజాలానికి సంబంధించిన వీడియోను కూడా రాష్ట్రపతిని వైసీపీ ఎంపీలు ఇస్తారని తెలుస్తోంది. రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరికిన వెంటనే ఏపీలో టీడీపీ చేస్తున్న అరాచకాలను తామూ చెబుతామని అంటున్నారు.
అదే విధంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా వైసీపీ ఎంపీలు కలసి టీడీపీ గుర్తింపు రద్దు చేయమని కోరుతారట. ప్రతిపక్ష పార్టీగా బాధ్యతాయుతంగా ఉండకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేస్తారట. ఒక రాజకీయ పార్టీగా రాజ్యాంగం ఇచ్చిన హక్కుని దుర్వినియోగం చేస్తోందని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి చూస్తోందని కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తారని చెబుతున్నారు.
ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా వైసీపీ ఎంపీలు కలుస్తారని అంటున్నారు. అమిత్ షాకు కూడా రెండున్నరేళ్లుగా అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ని టీడీపీ ఎలా ఇబ్బందులు పెడుతుందో అన్ని ఆధారాలతో వివరిస్తారని అంటున్నారు. మొత్త్తానికి చూస్తే వైసీపీ ఎంపీలు ఈ వారమంతా ఢిల్లీలో బిజీగా ఉంటారన్న మాట. మరి హస్తిన టూర్ తరువాత టీడీపీ వేదన ఎంత మేరకు తీరిందో తెలియదు కానీ ఇపుడు వైసీపీ తమ బాధను చెప్పుకుంటామని అంటోంది. కేంద్ర పెద్దలు వైసీపీ ఎంపీలకు అపాయింట్మెంట్ ఇస్తారా అన్నది చూడాలి. ఏది ఏమైనా ఢిల్లీ వేదికగా వైసీపీ, టీడీపీ సాగిస్తున్న రాజకీయ పోరు మాత్రం ఆసక్తికరంగానే ఉందని చెప్పాలి.