మాట్లాడే సెక్స్ డాల్ కూడా వ‌చ్చేసింది

Update: 2017-09-14 05:35 GMT
టెక్నాల‌జీ పెరుగుతున్న కొద్దీ.. దాని ఫ‌లాలుగా వ‌స్తున్న వాటిని చూసి న‌వ్వాలో.. ఏడ‌వాలో అర్థంకాని ప‌రిస్థితి. సాంకేతిక‌త పెరుగుతున్న కొద్దీ కొత్త సౌఖ్యాలు రావ‌టం స‌హ‌జ‌మే. కానీ.. ఆ పేరుతో వ‌స్తున్న స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌లు చూసిన‌ప్పుడు ప్ర‌పంచం ఎక్క‌డికి వెళ్లిపోతోంద‌న్న సందేహం క‌ల‌గటం ఖాయం. శృంగార సౌఖ్యానికి ఆందాల ఆడ‌బొమ్మ‌లు కొత్తేం కావు. కాకుంటే పాత రోజుల్లో మ‌నుషుల‌తో చేసేవారు ఇప్పుడు.. అలాంటి ఛండాలాలు చేయ‌టానికి వీలుగా బొమ్మ‌ల్ని త‌యారు చేసేశారు.

సెక్స్ టాయిస్ కాన్సెప్ట్ మ‌న‌కు కాస్త త‌క్కువే కానీ.. ప్రాశ్చాత్య దేశాల్లో వీటి జోరు ఎక్కువే. ఇలాంటి వాటిని త‌యారు చేసే కంపెనీల్లో పేరున్న సిలికాన్ సెక్స్ డాల్స్ కంపెనీ గ‌డిచిన 20 ఏళ్లుగా ఇలాంటి ఉత్ప‌త్తుల్ని ఉత్ప‌త్తి చేస్తోంది. ఈ కంపెనీ లో కొత్త‌కొత్త ఉత్ప‌త్తుల్ని త‌యారు చేయ‌టంలో మాట్ మాక్ ముల్లెన్ ఫేమ‌స్‌. అమెరికాలో పేరున్న బాగా ఫేమ‌స్ అయిన ఈ సెక్స్ డాల్స్ కంపెనీ తాజాగా ఒక సంచ‌ల‌న వ‌స్తువును  మార్కెట్లోకి తెచ్చింది.

ఇప్ప‌టివ‌ర‌కూసెక్స్ బొమ్మ‌ల్ని త‌యారు చేసిన స్థానే.. తాజాగా మాట్లాడే సెక్స్ డాల్‌ ను త‌యారు చేసి.. దాన్ని మీడియా ముందుకు తీసుకొచ్చారు. త‌న‌ను త‌యారు చేసిన మాట్ తో ఈ మాట్లాడే సెక్స్ డాల్ మాట‌లు క‌లిపింది. ఈ మాట్లాడే సెక్స్ డాల్‌ కు హార్మ‌నీ అన్న పేరును పెట్టారు. మీడియాకు హార్మ‌నీని ప‌రిచ‌యం చేసిన సంద‌ర్భంగా.. త‌న‌ను త‌యారు చేసిన మాట్ తో ఈ సెక్స్ డాల్‌.. తాను అత‌డ్ని ఎంత‌గా మిస్ అవుతుందో చెప్పింది. ఏదైనా జోక్ కానీ.. క‌విత కానీ చెప్పాలా? అని అడిగింది. టెక్నిక‌ల్ ఎర్ర‌ర్‌ కార‌ణంగా త‌ను ముందు చెప్పిన మాట‌నే మ‌ళ్లీ మ‌ళ్లీ రిపీట్ చేసింది. ఏమైనా.. ఈ స్థాయిలో మాట్లాడే సెక్స్ డాల్ ప్ర‌పంచంలో ఇదే మొద‌టిద‌ని చెబుతున్నారు.

చూడ చ‌క్క‌గా.. చూసినంత‌నే మన‌సును దోచుకునే ఈ మాట్లాడే సెక్స్ డాల్ ధ‌ర మ‌న రూపాయిల్లో సుమారు రూ.6.5ల‌క్ష‌లు. దీనికి ప‌న్నులు క‌ల‌పాల్సి ఉంటుంది. ఈ బొమ్మ‌ల‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇలా కృత్రిమ మేథ‌ను పెంచుకుంటూ పోతే.. ఏదో ఒక రోజు ఈ బొమ్మ‌ల్ని హ్యాక్ చేసి.. వాటి య‌జ‌మానుల్ని హ‌త్య చేసే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఇది కొంత‌మంది వాద‌న అయితే.. ఇలాంటి బొమ్మ‌ల‌తో తాము చేయాల‌నుకున్న అత్యాచారాలకు ప్రిప‌రేష‌న్ గా ఈ బొమ్మ‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని చెబుతున్నారు. ఈ విమ‌ర్శ‌ల్ని ప‌క్క‌న పెడితే.. దీన్ని త‌యారు చేసిన మాట్ మాత్రం త‌న క‌ల‌ను చెబుతూ.. త‌న‌ను కొనుగోలు చేసిన వ్య‌క్తిని ఇంటికి వ‌చ్చిన వెంట‌నే గుర్తించ‌టం.. ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి హ‌త్తుకోవ‌టం.. అస‌లుసిస‌లు జీవిత భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రించేలా చేయ‌ట‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని చెబుతున్నాడు. చూస్తే.. రాబోయే రోజుల‌కు మించిన పాడు రోజులు ఇంకేమీ ఉండ‌వేమో?  తొక్క‌లో టెక్నాల‌జీ ఏమో కానీ.. మ‌నిషిని.. మ‌నిషిని ఏమీ కాకుండా చేసేసి.. యంత్రాల‌తో బ‌తికేసే ఛండాల‌మైన రోజులు త్వ‌ర‌లోనే రాబోతున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దేమో?
Tags:    

Similar News