ప్రపంచంలో బెస్ట్.. వరస్ట్ సిటీలు ఇవే..

Update: 2017-03-14 10:35 GMT
మనిషి బతకటానికి ఏం కావాలి? ఆరోగ్యకరమైన వాతావరణం..ప్రశాంతంగా ఉండే పరిసరాలు.. జీవనానికి ఎలాంటి ఇబ్బందులు కలగని మౌలికవసతులు.. ఆదాయానికి డోకా లేని అవకాశాలు మాత్రమే. అంతకు మించి మనిషి కోరుకునేది ఏమీ ఉండదు. అదేం చిత్రమో కానీ.. మన దగ్గరే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా చూసినా.. చక్కటి మౌలిక వసతులుకల్పించే విషయంలో అన్ని దేశాల్లోని ప్రభుత్వాలు వైఫల్యం చెందినవైనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటిం. దీనికి పేద దేశాలే కాదు.. అగ్రరాజ్యాలు కూడా మినహాయింపు కాదు.

కొన్ని ప్రాంతాల్లో ప్రకృతి సహకరించకపోయినా.. అక్కడి స్థానిక నాయకత్వాల పుణ్యమా అని అద్భుతమైన వసతులు ఉండటమే కాదు..మనిషి బతకటానికి అవసరమైన సదుపాయాలు కనిపిస్తాయి.తాజాగా ప్రపంచ వ్యాప్తంగా 231 నగరాల్లో అత్యున్నత నగరాలు ఏవి?అతి చెత్త నగరాలు ఏమీ అన్న విషయంపై భారీ అభిప్రాయ సేకరణను నిర్వహించింది ప్రముఖ కన్సెల్టెంట్ సంస్థ మెర్సర్.

రాజకీయ స్థిరత్వం.. ఆరోగ్య సంరక్షణ..విద్య.. నేరాలు..వినోదం.. రవాణా సదుపాయాలు లాంటి అంశాల్నిపరిగణలోకి తీసుకొని ఒక జాబితాను తయారు చేశారు.దీని ప్రకారం అత్యుత్తమ నగరంగా వియన్నా (ఆస్టియా) ఎనిమిదోసారి అగ్రస్థానంలో నిలవగా.. బాగ్దాద్ అత్యంత చెత్త నగరంజాబితాలో అగ్రభాగాన నిలిచింది.

వియన్నాతో పాటు స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్.. అక్లాండ్ (న్యూజిలాండ్).. మ్యూనిచ్ (జర్మనీ). వాంకోవర్ (కెనడా)లు టాప్ ఫైవ్ నగరాలుగా నిలిచాయి. ఇక.. ఆసియాకు చెందిన సింగపూర్ 25వ స్థానంలో నిలవగా.. ప్రపంచానికి పెద్దన్నఅయిన అమెరికాలోని ఏ నగరం కూడా టాప్ 25లో నిలవకపోవటం విశేషం. అమెరికాలోని అత్యుత్తమ నగరంగా శాన్ ఫ్రాన్సిస్కో 29వ స్థానంలో నిలిచింది.

ప్రపంచంలో పెద్ద నగరాలుగా పేరున్న లండన్.. టోక్యో..పారిస్.. న్యూయార్క్ లాంటి నగరాలు సైతం టాప్ 30 జాబితాలో నిలవకపోవటం గమనార్హం. చెత్త నగరాల విషయానికి వస్తే.. సిరియా.. యెమెన్.. సూడాన్ లు నిలిచాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News