• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పిల్లలు పుట్టలేదని ,...

పిల్లలు పుట్టలేదని , వేశ్యలని తీసుకోచ్చి శృంగారం , ఆ తర్వాత !

By - Tupaki Desk
Update: 2021-10-25 06:29 GMT
ప్రపంచం సైన్స్ పరంగా రోజురోజుకి ఎంతో అభివృద్ధి చెందింది. మనిషి ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నాడు. స్పేస్ టూరిజం దిశగా అడుగులు వేస్తున్నాడు. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ సమయంలో కూడా దేశంలో ఇంకా మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు, క్షుద్ర విశ్వాసాలు రాజ్యమేలుతున్నాయి. మూఢనమ్మకాలతో కొందరు వ్యక్తులు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. తోటి మనిషి ప్రాణాలు తీస్తున్నాడు. తాజాగా మూఢనమ్మకంతో ఓ జంట చేసిన పని అందరిని షాక్ కి గురి చేస్తుంది. మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. సంతానం కోసం ఓ జంట నరబలి ఇచ్చిన ఘటన సంచలనం రేపింది. గ్వాలియర్ లో నివసించే బంటు బదౌరియా, మమతా దంపతులకు 18 ఏళ్ల కిందట పెళ్లైంది. ఇప్పటికీ పిల్లలు కలగలేదు. వారి కుటుంబ స్నేహితుడు నీరజ్ పర్మార్ సలహా మేరకు గిర్వార్ యాదవ్ అనే భూతవైద్యుడ్ని సంప్రదించారు. పిల్లలు పుట్టాలంటే నరబలి ఒక్కటే మార్గమని అతడు చెప్పడంతో బంటు, మమత సరేనన్నారు.

బలి ఇచ్చేందుకు తగిన వ్యక్తిని తీసుకొచ్చే బాధ్యతను వారు నీరజ్ పర్మార్ కు అప్పగించారు. నీరజ్ ఓ వేశ్యను తీసుకొచ్చాడు. వారు ఆమెను బలిచ్చారు. ఆ తర్వాత మృతదేహాన్ని బైక్ పై తరలించే ప్రయత్నంలో కిందపడిపోవడంతో నీరజ్ భయపడ్డాడు. దాంతో ఆ వేశ్య మృతదేహాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. ఆ తర్వాత మరో వేశ్యను తీసుకొచ్చి భూత వైద్యుడి సమక్షంలో బలి ఇచ్చారు. అయితే, మొదట బలి ఇచ్చిన వేశ్య మృతదేహం వెలుగుచూడడంతో పోలీసులు దర్యాప్తు ఆరంభించగా, నరబలి వ్యవహారం బట్టబయలైంది. చనిపోయిన వేశ్య ఫోన్ లో కాంటాక్ట్ లిస్ట్ ద్వారా పోలీసులు నిందితులను పట్టుకోగలిగారు.

నీరజ్ పర్మార్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమ స్టైల్ లో ఎంక్వైరీ చేశారు. నీరజ్ ను నాలుగు పీకారు. అంతే, మనోడు నిజాన్ని కక్కేశాడు. దాంతో బంటు, మమతా దంపతులతో పాటు మమతా సోదరి మీరా రజావత్, భూతవైద్యుడ్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. మొదటి వేశ్యను నరబలి ఇచ్చే ముందు నీరజ్ సర్మార్ ఆమె తో శృంగారం లో పాల్గొన్నాడు. అంతేకాదు, మొదటి వేశ్య మద్యం తాగి ఉన్నందున ఆమె నరబలి చెల్లదని భూతవైద్యుడు చెప్పాడని దీంతో వారు రెండో వేశ్యను తీసుకొచ్చి నరబలి ఇచ్చారని పోలీసుల విచారణలో తేలింది.

ఓ రాత్రి తనతో గడిపేందుకు వేశ్యకు నీరజ్ రూ.10వేలు ఆఫర్ చేశాడు. వేశ్యతో అతడితో సెక్స్ లో పాల్గొన్నాడు. ఆ తర్వాత నరబలి ఇచ్చారు. ఆ తర్వాత మృతదేహాన్ని పూడ్చేందుకు బైక్ పై తీసుకెళ్తున్న సమయంలో బైక్ స్కిడ్ అయ్యింది. మృతదేహం రోడ్డుపై పడింది. దీంతో కంగారుపడిన నిందితులు మృతదేహాన్ని అక్కడే వదిలి పారిపోయారు. ఆ తర్వాత మరో వేశ్యను తీసుకొచ్చి నరబలి ఇచ్చారు. ఆ వేశ్య మృతదేహాన్ని పోలీసులు మొరేనా జిల్లాలో గుర్తించారు. రెండో వేశ్యను బలిచ్చే ముందు కూడా నీరజ్ ఆమెతో సెక్స్ లో పాల్గొన్నాడని పోలీసులు చెప్పారు.


Tags:    
  • latestnews 
  • laterst updates 
  • trending news 
  • Newstoday 
  • Trend News 

Similar News

నేల మీదకు జగన్...వ్యూహమా అనివార్యమా ?

2026-11-02 18:28 GMT

విశాఖ హెచ్‌పీసీఎల్ లో భారీ పేలుడు

2026-11-02 18:28 GMT

స్పెసిఫైడ్ అథారిటీకి టీటీడీ...కొత్త బోర్డు అప్పుడే ?

2026-11-02 18:27 GMT

రష్యా-ఉక్రెయిన్ పోరులో భారత్ క్రేజ్.. ఉక్రెయిన్ ఆరాటాన్ని ఎద్దేవా చేసిన పుతిన్

2026-11-02 18:27 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ట్రంప్ టవర్స్‌లో షాకింగ్ పరిస్థితులు.. కోట్ల ఫ్లాట్ కొన్నా కర్టెన్లు లేవు.. లిఫ్ట్ లేదు

2026-11-02 18:26 GMT

మెగాస్టార్ చుట్టూ ఊహాగానాలు...మ్యాటర్ మాత్రం ?

2026-11-02 18:25 GMT

రాహుల్ అర్ధమవుతోందా...అమిత్ షా లాజిక్ పాయింట్ !

2026-11-02 18:24 GMT

భారత్ దెబ్బకు పాకిస్తాన్ దివాళా తీసింది.. ఇవే సాక్ష్యాలు

2026-11-02 18:24 GMT

కూటమి జై కొట్టారా.... వైసీపీ గ్రాఫ్ పెరిగిందా ?

2026-11-02 18:23 GMT

రెచ్చిపోతున్న బంగ్లాదేశ్ ను కర్ర కాల్చి వాత పెడుతోన్న భారత్.. భారీ మాస్టర్ స్ట్రోక్

2026-11-02 18:21 GMT

Copyright @2026

Powered by Blink CMS