ఢిల్లీలో మహిళా ఎస్సై దారుణ హత్య ..ప్రేమే కారణమా ?

Update: 2020-02-11 22:30 GMT
సమాజం లో జరిగే కొన్ని సంఘటనలతో ఈ దేశంలో మహిళలకి అసలు భద్రత నిజంగానే ఉందా అని అనిపించమానదు. ఎందుకు అంటే సమాజంలో ప్రస్తుతం అలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇంట్లో నుండి కాలు బయటపెట్టిన మహిళ, మళ్లీ ఇంట్లోకి చేరేవరకు ఆమె ఇంటికి చేరుతుందో లేదో అన్న టెంక్షన్స్ లో జీవనాన్ని కొనసాగించాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాం అంటే ఎలాంటి సమాజంలో బ్రతుకుతున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రభుత్వాలు , పోలీసులు ఎన్ని చట్టాలు , భద్రతలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ప్రతి రోజు కూడా మహిళలపై అఘాయిత్యాలు , దారుణాలు జరుగుతూనే ఉన్నాయి.

తాజాగా ఢిల్లీలో మరో ఘోరం జరిగింది. తన ప్రేమని ఒప్పుకోలేదు అని ,ఒక యువకుడు అమ్మాయిని గన్ తో కాల్చి చంపేశాడు. ప్రేమే వీరికి మరణ శాసనం రాసింది. తనకు దక్కని యువతి మరొకరికి దక్కకూడదన్న ఆగ్రహంతో ఓ ఎస్సై.. తన తోటి మహిళా ఎస్సైనే కాల్చి చంపాడు. పూర్తి వివరాలు చూస్తే ...ఢిల్లీలోని రోహిణీ నగర్ ప్రాంతం లో ఈ దారుణమైన సంఘటన జరిగింది. ప్రీతి ఆహ్లవాత్ అనే 26 ఏళ్ళ మహిళా సబ్ ఇన్స్ పెక్టర్ రోహిణి ప్రాంత పరిధిలోని పోలీసు స్టేషన్ లో విధులు నిర్వరిస్తోంది. 2018 బ్యాచ్ కి చెందిన దీపాంషు రతి అనే ఎస్సై ఈమెను కొంత కాలంగా ప్రేమిస్తున్నాడు. ఆ విషయాన్ని ఆమెకి చెప్పడం తో ఆమె అందుకు ఒప్పుకోలేదు. దీనితో ఆమె పై కోపం పెంచుకొని ఈ దారుణానికి ఒడిగట్టాడు.

ముందుగా అనుకున్న పథకం ప్రకారం .. గత శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ప్రీతి డ్యూటీ ముగించుకుని ఇంటికి నడిచి వెళ్తుండగా దీపాంషు ఆమెపై కాల్పులు జరిపాడు. తలలోకి బులెట్లు దూసుకుపోవడంతో ప్రీతి అక్కడికక్కడే మరణించింది. ఆమెను హత్య చేశాక..దీపాంషు హర్యానాలోని తన స్వస్థలానికి వెళ్లి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అయితే , ప్రీతి ఓ రేప్ కేసును విచారిస్తున్నారని.. ఈ కేసు విషయమై ఆమెకు గతం లో బెదిరింపులు వచ్చాయని తెలుస్తోంది. దీనిపై పోలీసులు సమగ్ర విచారణ చేస్తున్నారు.


Tags:    

Similar News